Shirdi Tour Package : షిర్డీకి సరికొత్త టూర్ ప్యాకేజీ - పండరీపురం, తుల్జాపూర్ కూడా చూడొచ్చు!తెలంగాణ టూరిజం ప్యాకేజీ ఇదే
- షిర్డీ సాయి బాబా దర్శనం కోసం తెలంగాణ టూరిజం మరో కొత్త ప్యాకేజీని ప్రకటించింది. ఈ ట్రిప్ లో భాగంగా షిర్డీతో పాటు పండరీపూర్ కూడా వెళ్లి రావొచ్చు. హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈనెల 14వ తేదీన ప్యాకేజీ అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి…
- షిర్డీ సాయి బాబా దర్శనం కోసం తెలంగాణ టూరిజం మరో కొత్త ప్యాకేజీని ప్రకటించింది. ఈ ట్రిప్ లో భాగంగా షిర్డీతో పాటు పండరీపూర్ కూడా వెళ్లి రావొచ్చు. హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈనెల 14వ తేదీన ప్యాకేజీ అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి…
(1 / 7)
పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూసేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా షిర్డీ సాయి బాబా దర్శనం కోసం మరో ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. (Image Source From @SSSTShirdi 'X')
(2 / 7)
హైదరాబాద్ నుంచి ‘SHIRDI PANDHARPUR TOUR’ పేరుతో ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. మొత్తం నాలుగు రోజులు ఉంటుంది. బస్సులో జర్నీ ఉంటుంది. (Image Source From @SSSTShirdi 'X')
(3 / 7)
ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 14, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీని ప్రకటిస్తారు. అందుకు అనుగుణంగా బుకింగ్ చేసుకుని వెళ్లొచ్చు. ఈ ప్యాకేజీలో షిర్డీ., పాండరీపురం, తుల్జాపూర్, శనిశిగ్నాపూర్ చూస్తారు.(Image Source From @SSSTShirdi 'X')
(4 / 7)
ఫస్ట్ డే హైదరాబాద్ నుంచి బయల్దేరుతున్నారు. దిల్ సుఖ్ నగర్, బషీర్ బాగ్, సికింద్రాబాద్, బేగంపేట్, కేపీహెచ్ బీ, చందానగర్ పికప్ పాయింట్స్ ఉన్నాయి. రెండో రోజు ఉదయం శనిశిగ్నాపూర్ చేరుకుంటారు. 11.30 గంటలకు హోటల్ లోకి చెకిన్ అవుతారు. ఆ తర్వాత షిర్డీ సాయి బాబా దర్శనం ఉంటుంది. రాత్రి ఇక్కడే బస చేస్తారు.(Image Source From @SSSTShirdi 'X')
(5 / 7)
మూడో రోజు ఉదయం 05. 30 గంటలకు షిర్డీ నుంచి పాండరీపురంకు బయల్దేరుతారు. ఇక్కడ శ్రీ విట్టల్ రుక్మిణి ఆలయాన్ని దర్శించుకుంటారు. అక్కడ్నుంచి తుల్జాపూర్ కు బయల్దేరుతారు. అనంతరం హైదరాబాద్ కు తిరుగుప్రయాణమవుతారు. నాల్గోరోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ప్యాకేజీ ముగుస్తుంది. (Image Source From 'X' Account)
(6 / 7)
టికెట్ ధరలు చూస్తే పెద్దలకు రూ. 3100, పిల్లలకు రూ. 2530గా నిర్ణయించారు. నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది. ఈ ప్యాకేజీని ఎంచుకునే టూరిస్టులు ముందుగా షిర్డీ సాయిబాబా దర్శన టికెట్ల( www.sai.org.in )ను బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. (Image Source From @SSSTShirdi 'X')
ఇతర గ్యాలరీలు