TG ICET Counseling 2024 : టీజీ ఐసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్​మెంట్​ ఇలా చెక్ చేసుకోండి-how to check allotment of tg icet first phase seats allotment 2024 direct link here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Icet Counseling 2024 : టీజీ ఐసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్​మెంట్​ ఇలా చెక్ చేసుకోండి

TG ICET Counseling 2024 : టీజీ ఐసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్​మెంట్​ ఇలా చెక్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 13, 2024 10:02 PM IST

టీజీ ఐసెట్‌ - 2024 ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోది. ఫస్ట్ ఫేజ్ సీట్లను అధికారులు శుక్రవారం కేటాయించారు. https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అలాట్ మెంట్ కాపీలను పొందవచ్చు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 17వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ 2024
తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ 2024

తెలంగాణ ఐసెట్ - 2024 ప్రవేశాలకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చింది. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు శుక్రవారం సీట్లను కేటాయించారు. ఎంసీఏ కోర్సుల్లో 86 శాతం, ఎంబీఏలో 87.5 శాతం సీట్లు భ‌ర్తీ అయ్యాయి, సీట్లు పొందిన విద్యార్థులు https://tgicet.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అలాట్ మెంట్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ ఏడాది మొత్తం 34,748 సీట్లు ఉండ‌గా… 30,300 సీట్లు ఫస్ట్ ఫేజ్ లోనే భర్తీ అయ్యాయి. ఇంకా 4,448 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. తొలి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 17వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

ఇక ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని అధికారులు ప్రకటించారు. 21, 22 తేదీల్లో వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి. సెప్టెంబర్ 25వ తేదీలోపు సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబర్ 27వ తేదీన స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి మార్గదర్శకాలు విడుదలవుతాయి.

అలాట్ మెంట్ ఇలా చెక్ చేసుకోండి:

  • ఐసెట్ అభ్యర్థులు https://tgicet.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • College-wise Allotment Details ఆప్షన్ పై క్లిక్ చేయాలి. కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ Candidates Login ఆప్షన్ పై నొక్కాలి.
  • ఇక్కడ మీ లాగిన్ ఐడీ, TGICET Hall Ticket No, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  • లాగిన్ పై నొక్కితే మీరు సీటు పొందిన కాలేజీ వివరాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
  • కాలేజీలో చేరాలంటే అలాట్ మెంట్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది.

ఈ ఏడాది నిర్వహించిన తెలంగాణ ఐసెట్‌ పరీక్ష కోసం 86156 మంది దరఖాస్తు చేసుకున్నారు. 77942 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 71 వేల 647 మంది ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత శాతం 91.92 శాతంగా నమోదైంది.జూన్‌ 5, 6 తేదీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 116 కేంద్రాల్లో ఐసెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

టీజీ ఐసెట్ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోవచ్చు..

  • తెలంగాణ ఐసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో కనిపించే ICET Results 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు Registration Number, పుట్టినతేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కాపీ పొందవచ్చు.
  • అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు కీలకం.

తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఐసెట్) పరీక్షలను ఈ ఏడాది కాకతీయ వర్శిటీ నిర్వహించింది. తెలంగాణ ఐసెట్ పరీక్షలు జూన్ 5 నుంచి 6వ తేదీ వరకు పలు సెషన్లల్లో జరిగాయి. కౌన్సెలింగ్ లో భాగంగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లతో పాటు ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కోసం https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.