Ganesh Shobha Yatra 2024 : గణేష్ భక్తులకు అలర్ట్.. నిమజ్జనం రోజు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి!-the hyderabad city police has disclosed the rules to be followed during ganesh immersion procession ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ganesh Shobha Yatra 2024 : గణేష్ భక్తులకు అలర్ట్.. నిమజ్జనం రోజు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి!

Ganesh Shobha Yatra 2024 : గణేష్ భక్తులకు అలర్ట్.. నిమజ్జనం రోజు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి!

Basani Shiva Kumar HT Telugu
Sep 13, 2024 03:45 PM IST

Ganesh Shobha Yatra 2024 : గణేష్ నిమజ్జన శోభాయాత్రల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. నిమజ్జనం రోజున పాటించాల్సిన ముందస్తు నియమాలను వెల్లడించారు. గణేష్ భక్తులు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని సీపీ సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు.

గణేష్ శోభాయాత్ర
గణేష్ శోభాయాత్ర (Photo Source: @Chetanx69)

హైదరాబాద్ నగరం గణేష్ శోభాయాత్రకు సిద్ధమవుతోంది. ఖైరతాబాద్ మహా గణపతి మొదలు.. గల్లీల్లోని బుల్లి గణపయ్యలను ఊరేగించేందుకు భక్తులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. శోభాయాత్ర జరిగే రోజు పాటించాల్సిన నియమాలను వివరించారు. పోలీసులకు భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

నిమజ్జనం రోజున పాటించాల్సిన నియమాలు..

1.గణేష్ నిమజ్జనానికి ఒక వాహనాన్ని మాత్రమే అనుమతిస్తారు.

2.నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంపై సౌండ్ బాక్స్‌లు, డీజేలు అమర్చొద్దు.

3.నిమజ్జనం కోసం విగ్రహాలను తీసుకెళ్లే వాహనంలో మద్యం, ఇతర మత్తు పధార్థాలను, మద్యం తాగిన వ్యక్తులను అనుమతించరు.

4.గణపతి నిమజ్జనం ఊరేగింపులో కర్రలు, కత్తులు, మండే పధార్థాలు, ఇతర ఆయుధాలను తీసుకురావొద్దు.

5.వెర్మిలియన్, కుంకుమ్, గులాల్‌ను సామాన్య ప్రజలపై జల్లకూడదు.

6.గణేష్ ఊరేగింపులో రాజకీయ ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే నినాదాలు చేయొద్దు.

7.గణపతి ఊరేగింపు సమయంలో బాణాసంచా పేల్చొద్దు.

8.పోలీసులు ఇచ్చే సలహాలు, సూచనలు కచ్చితంగా పాటించాలి.

9.ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే.. వెంటనే డయల్ 100 కి ఫోన్ చేయాలి.

ఎంఎంటీఎస్ సర్వీసులు..

గణేష్ విగ్రహాల నిమజ్జనం సమయంలో ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17 నుండి 18 మధ్య రాత్రి వరకు జంట నగరాల్లోని వివిధ గమ్యస్థానాల మధ్య కొన్ని ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను నడుపాలని నిర్ణయించింది. 8 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని.. గణపతి భక్తులు ఈ సర్వీసులను వినియోగించుకోవాలని సూచించారు.

రైలు నెం- GHL-5 (హైదరాబాద్- లింగంపల్లి) సెప్టెంబర్ 17వ తేదీ రాత్రి 11:10 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి.. అదే రోజు రాత్రి 11:55 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది.

రైలు నెం- GHS-1 (సికింద్రాబాద్- హైదరాబాద్) సెప్టెంబర్ 17 రాత్రి 11:50 గంటలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరి 12:20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

రైలు నెం- GHS-6 (లింగంపల్లి- ఫలక్‌నుమా) సెప్టెంబర్ 18వ తేదీ తెల్లవారుజామున 12:10 గంటలకు లింగంపల్లి నుండి బయలుదేరి అదే రోజు తెల్లవారుజామున 1:50 గంటలకు ఫలక్‌నుమా చేరుకుంటుంది.

రైలు నెం- GHS-7 (ఫలక్‌నుమా- సికింద్రాబాద్) సెప్టెంబర్ 18న తెల్లవారుజామున 2:20 గంటలకు ఫలక్ నుమా నుండి బయలుదేరి అదే రోజు తెల్లవారుజామున 3 గంటలకు ఫలకున్మా చేరుకుంటుంది.