యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు రాబోతోందని చాలా రోజులుగా చెబుతున్నారు. కానీ ఆశించిన స్థాయిలో అడుగులు పడలేదు. కానీ.. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటనతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందని.. త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని కిషన్ రెడ్డి వివరించారు.