Travels Bus in Fire: బస్సులో చెలరేగిన మంటలు, చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్
Travels Bus in Fire: వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు లో మంటలు చెలరేగడంతో, గుర్తించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి, వెంటనే బస్సు పక్కకు ఆపటంతో అందులో ప్రయాణిస్తున్న సుమారు 15 మంది ప్రయాణికులు ఎలాంటి గాయాలు కాకుండా ప్రమాదం నుండి తప్పించుకున్నారు. డ్రైవర్ అప్రమత్తతో అందరి బయటపడ్డారు.
Travels Bus in Fire: ఆర్టీసీ బస్సు ఇంజిన్‌లో చెలరేగిన మంటలు వేగంగా బస్సును వ్యాపించడంతో అప్రమ్తతమైన డ్రైవర్ దానిని పక్కన నిలపడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు దిగిన తర్వాత, డ్రైవర్ వెంటనే దగ్గర్లో ఉన్న కుకునూరుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన చేరుకున్న పోలీసులు సిబ్బంది కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెంటనే అందులో ఉన్న ప్యాసింజర్ అందర్నీ కిందికి దిగమని తెలపగానే అందరూ కిందికి దిగిపోయారు.
ఇంజన్లో నుండి మంటలు, పొగలు వస్తుండగా వెంటనే నీళ్లు తెప్పించి మంటలు ఆర్పారు. బస్సులో ఉన్న ప్రయాణికులు పోలీసులు వచ్చి ఎలాంటి ప్రమాదం జరగకుండా వెంటనే స్పందించి మంటలు ఆర్పిన కుకునూరు పల్లి పోలీసులను అభినందించారు. కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెదినీపూర్ బస్సు స్టేజ్ వద్ద ఆర్టీసీ బస్సు కరీంనగర్ డిపోకు చెందిన బస్సు నెంబర్ TS09Z-7645 కరీంనగర్ నుండి సికింద్రాబాద్ వెళుతున్న బస్సు ఇంజన్లో అకస్మాత్తుగా మంటలు/ పొగలు వస్తున్నాయని డయల్ 100 కాల్ ద్వారా సమాచారం వచ్చిందని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
బస్సు లో ఉన్న పాసెంజర్స్ అందరిని మరొక బస్సులో ఎక్కించి సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేరుకునే ఏర్పాట్లు చేసారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ కుకునూరు పల్లి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించినందుకు ఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ రమణమూర్తి, సిబ్బంది శేఖర్, శ్రీనివాస్, రాకేష్, వంశీ లను అభినందించారు.
స్కూళ్లలో షీటీమ్ పిర్యాదు బాక్సులు
జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో షీ టీమ్ ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేశారు. అమ్మాయిలను ఎవరైనా అవహేళన చేసినా, ఇబ్బందులకు గురిచేసినా వెంటనే సమస్యను చిట్టిలో రాసి బాక్స్ లో వేయాలని సూచించారు. దాని తాళం సీక్రెట్ షీ టీమ్ బృందం వద్ద ఉంటుందని వారు వారానికి ఒకసారి వచ్చి కి ఓపెన్ చేసి అందులో ఉన్న ఫిర్యాదులపై తగు చర్యలు తీసుకుంటారని సూచించారు.
మహిళల భద్రత మా ముఖ్య బాద్యత....
చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దని పోలీసులు సూచించారు. డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని అన్నారు. పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలని మరియు సామాజిక రుగ్మతల గురించి సెల్ఫోన్ కు ఎంత దూరం ఉంటే అంత మంచిది సెల్ ఫోన్ వల్ల ఎంత మంచి ఉందో అంత చెడు ఉంది దానికి అలవాటు పడి బానిసలు కావద్దని సూచించారు.
విద్యార్థి దశ చాలా కీలక కష్టపడే తత్వం కష్టపడి చదువుకోవడం చాలా ముఖ్యమని మహిళలను ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మరియు అవహేళనగా మాట్లాడిన వెంటనే డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ షీటీమ్ నెంబర్ 8712667434 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సమాచార అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.