తెలుగు న్యూస్  /  Lifestyle  /  5 Water-rich Fruits That Helps Relieve Constipation Naturally

Fruits For Constipation । మలబద్ధకం ఇబ్బంది పెడితే.. ఈ పండ్లు తినండి!

HT Telugu Desk HT Telugu

21 March 2023, 11:42 IST

  • Fruits For Constipation: కొన్ని రకాల పండ్లలో ఫైబర్, నీటి శాతం అధికంగా ఉండటం మూలనా అవి పేగు కదలికలకు తోడ్పడతాయి. తద్వారా మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. అవి పండ్లు ఏమిటో తెలుసుకోండి.

Fruits For Constipation
Fruits For Constipation (Unsplash)

Fruits For Constipation

మన కడుపును నిరంతరం శుభ్రంగా ఉంచుకోవాలి, మనం తిన్న ఆహారం జీర్ణం అయిన తర్వాత శరీరంలోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు విసర్జించడం ముఖ్యం. అయితే మలబద్ధకం వలన మలం విసర్జించడంలో ఇబ్బందిని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. వరుసగా మూడు, నాలుగు రోజులైనా అదే పరిస్థితి కొనసాగుతుంది, కొంతమందికి వారం రోజులైనా ప్రేగు కదలికలు సరిగ్గా ఉండకపోవచ్చు. దీనివల్ల తీవ్రమైన కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి బాధాకరమైన సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఆహారంలో పీచు పదార్థాలు లేకపోవడం, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవడం, తగినంత నీరు తీసుకోకపోవడం, అధిక ఒత్తిడి స్థాయిలు, హార్మోన్ల హెచ్చురగ్గుల వంటివి మలబద్ధకం కలగడానికి ప్రధాన కారణాలు. ఈ వేసవిలో వేడి వాతావరణం, విపరీతమైన చెమట కారణంగా ప్రజలు సులభంగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. దీంతో మన శరీరంలో తగినంత నీరు లేనప్పుడు, మలబద్ధకం సమస్య వస్తుంది. షుగర్, క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తరచుగా తీసుకోవడం వల్ల కూడా మలబద్ధకం తలెత్తుతుంది. భోజనం తర్వాత చాలా మంది స్వీట్లు, డెజర్ట్ లు తింటారు. కానీ, ఇది మలబద్ధకాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది.

అయితే ఈ మలబద్ధకం సమస్య నుంచి బయటపడాలంటే, సహజ మార్గాలు ఉన్నాయి. కొన్ని రకాల పండ్లను తినడం ద్వారా అవి మలబద్ధకం సమస్యను పరిష్కరిస్తాయి.

Fruits to Relieve Constipation- మలబద్ధకం నివారించే పండ్లు

కొన్ని రకాల పండ్లలో ఫైబర్, నీటి శాతం అధికంగా ఉండటం మూలనా అవి పేగు కదలికలకు తోడ్పడతాయి. తద్వారా మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. ఎలాంటి పండ్లు తినాలో తెలుసుకోండి.

బొప్పాయి

బొప్పాయి వేసవికాలంలో విరివిగా లభించే పండు, ప్రతిరోజూ ఉదయం లేదా మధ్యాహ్నం క్రమం తప్పకుండా ఈ పండు తినడం ద్వారా సాధారణ ప్రేగు కదలికలకు సహాయపడుతుంది. ఇందులో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థలో ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది, ఇది ప్రేగుల గుండా వెళ్ళడాన్ని సులభతరం చేస్తుంది. ఇందులో ఫైబర్, వాటర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ, సాధారణ ప్రేగు కదలికల కోసం బొప్పాయి తింటూ ఉండాలి.

ఆపిల్స్

ఆపిల్ పండ్లు మీ పేగులను ఆరోగ్యంగా ఉంచడానికి గొప్పవి. మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడే పెక్టిన్ అనే ఒక రకమైన ఫైబర్ ఆపిల్ పండులో ఉంటుంది. రోజూ ఒక ఆపిల్ తినడం ద్వారా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఆపిల్ పండును చర్మంతో పాటుగా తినాలి, దాని తొక్క తీయకూడదు.

నారింజ

మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడే మరొక గొప్ప పండు నారింజ. ఇవి రుచికరంగా, జ్యూసీగా ఉండటమే కాకుండా మంచి మొత్తంలో ఫైబర్ కలిగి ఉంటాయి. ఈ పండు తింటే ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అదనంగా, నారింజలో విటమిన్ సి ఉంటుంది. ఇది మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఒక యాంటీఆక్సిడెంట్.

నల్లని ఎండు ద్రాక్ష

నల్లని ఎండుద్రాక్ష, ఎండు రేగుపళ్లను కూడా అప్పుడప్పుడూ తింటుండాలి. వీటిని నీటిలో నానబెట్టి, ప్రతిరోజూ ఉదయం తీసుకోవడం వల్ల ప్రేగు కదలికలు సక్రమంగా జరగడానికి సహాయపడుతుంది, తద్వారా మలబద్ధకం సమస్య పరిష్కారం అవుతుంది.