Anti- Bloating Drink | వేసవిలో రోజూ ఉదయం ఈ ఒక్క పానీయం తాగండి, చల్లగా ఉండండి!
Anti-Bloating Drink: వేసవిలో తరచుగా సంభవించే కడుపు ఉబ్బరం, గ్యాస్, నిర్జలీకరణ వంటి సమస్యలకు ఒక చిన్న చిట్కాతో చెక్ పెట్టవచ్చు. ఆయుర్వేద నిపుణులు సూచించిన ఆ రెమెడీ ఏమిటో ఇక్కడ చూడండి.
వేసవిలో తరచుగా కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇది మీకు అసౌకర్యంగా అనిపించడంతో పాటు, మలబద్ధకాన్ని కూడా కలిగిస్తుంది. బయట వేడి వాతావరణం ఉన్నప్పుడు శరీరం ఆ వేడిని తట్టుకోవడానికి, బయటి వేడిని నియంత్రించడానికి ఎక్కువ చెమటలు పడుతుంది. దీనివల్ల మీ శరీరంలో నీటి నష్టం ఎక్కువగా జరిగి నిర్జలీకరణానికి దారితీస్తుంది. శరీరంలో ఆహారం జీర్ణం చేయడానికి తగినంత నీటిమొత్తం లేనప్పుడు అది అజీర్ణం దాని అనుబంధ జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అదీ కాకుండా ఈ వేసవిలో అధిక కేలరీలు, ఉప్పు, చక్కెరలు, కలిగిన ఆహార పదార్థాలు, కార్బోనేటెడ్ పానీయాలు తీసుకోవడం వలన మీ జీర్ణవ్యవస్థ పనితీరు మరింత దిగజారుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే చర్యలను తీసుకోవడం చాలా ముఖ్యం.
అయితే ఈ సమస్యలకు పరిష్కారంగా, వేసవిలో యాంటీ-బ్లోటింగ్ డ్రింక్‌ని తాగాల్సిందిగా ఆయుర్వేదం సిఫార్సు చేస్తుంది. ఈ యాంటీ-బ్లోటింగ్ డ్రింక్ కడుపు ఉబ్బరం నివారించడంతో పాటు , మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఈ యాంటీ-బ్లోటింగ్ డ్రింక్ అనేది పూర్తిగా సహజమైనది, తయారు చేయడం కూడా చాలా సులభం. యాంటీ-బ్లోటింగ్ డ్రింక్ చేయడం కోసం ఏమేం కావాలి, ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
How To Make Anti-Bloating Drink- ఎలా తయారు చేయాలి?
ఒక గ్లాసు నీటిలో 5-7 పుదీనా ఆకులు, 1 టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ వాము వేసి, మీడియం వేడి మీద మూడు నిమిషాలు ఉడకబెట్టాలి. ఆ తర్వాత ద్రావణాన్ని ఒక గ్లాసులోకి వడకట్టి, గోరువెచ్చగా సిప్ చేయాలి. ఈ యాంటీ-బ్లోటింగ్ పానీయాన్ని ఉదయం పూట , భోజనానికి అరగంట ముందు లేదా భోజనం చేసిన తర్వాత తాగాలి. అలాగే మీకు కడుపు ఉబ్బరం లేదా బరువుగా అనిపించినప్పుడు కూడా ఈ పానీయం తాగవచ్చునని ఆయుర్వేద నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, థైరాయిడ్, అసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్, హార్మోన్ అసమతుల్యత లేదా మలబద్ధకంతో బాధపడే వారు ఏ సీజన్‌లోనైనా ఈ యాంటీ-బ్లోటింగ్ డ్రింక్ తాగవచ్చు. పుదీనాలోని సమ్మేళనాలు జలుబు, దగ్గు, ఆమ్లత్వం, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం, డిటాక్స్, మొటిమలు, సైనసైటిస్, మలబద్ధకం తదితర సమస్యలకు సహాయపడుతుంది. జీలకర్ర శక్తిలో వేడిగా ఉంటుంది, ఇది మీ నోటికి రుచిని మెరుగుపరుస్తుంది, జీర్ణ అగ్నిని ప్రేరేపిస్తుంది, జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, కఫా, వాతాన్ని తగ్గిస్తుంది. వాము ఉబ్బరంను ఉపశమనం కలిగించడానికి ఉత్తమమైన మసాలా దినుసు, సులభంగా జీర్ణం అవుతుంది, కఫా, వాతాన్ని తగ్గిస్తుంది. భోజనం తర్వాత గ్యాస్, ఆమ్లతను తగ్గించడంలోనూ సహాయపడుతుంది.
వేసవి ఉబ్బరాన్ని నివారించడానికి, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, ఎక్కువ ద్రవాలను తీసుకోవడం చేయాలి, మరోవైపు అధిక క్యాలరీలు, లవణం, చక్కెర కలిగిన ఆహారాలను నివారించాలి.
సంబంధిత కథనం