Constipation । కడుపును శుభ్రపరుచుకోవడంలో ఇబ్బందా? ఈ చిట్కాలతో మలబద్ధకం దూరం!
Home Remedies For Constipation: ప్రతిరోజూ కడుపును శుభ్రపరుచుకోవడంలో ఇబ్బంది ఉంటే ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి, పాటించి చూడండి, సునాయాసంగా మలబద్ధకం సమస్యను వదిలించుకోవచ్చు.
మనం ప్రతిరోజూ ఆహార, పానీయాలు ఎలా అయితే తీసుకుంటామో. వాటి వ్యర్థాలను కూడా ప్రతిరోజూ తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో తినడం మాత్రం కొనసాగుతుంది గానీ, తిన్న తర్వాత వచ్చే వ్యర్థాలు మాత్రం బయటకు రావడం జరగదు. కానీ, ఇది చాలా ప్రమాదకరం. దాదాపు ప్రతీ వ్యక్తికి ఏదో ఒక సందర్భంలో మలబద్ధకం సమస్య గురించి ఫిర్యాదును కలిగి ఉంటాడు. కొంతమందికి ఇది తరచుగా ఇబ్బంది పెట్టే సమస్య.
సాధారణంగా నీరు, ద్రవ పదార్థాలు తక్కువ తీసుకునే వారిలో ఈ మలబద్ధకం సమస్య ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మలం గట్టిపడి పేగు మార్గాల గుండా కదలడంలో ఇబ్బంది ఉంటుంది. అయితే దీర్ఘకాలిక మలబద్ధకం సమస్య కొనసాగితే అది అనేక కారణాలను కలిగి ఉంటుంది. అలాగే కొన్ని రకాల ఔషధాల వినియోగం, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి ఆందోళనల కారణంగా కూడా ఈ సమస్య ఉండవచ్చు.
మలబద్ధకం సమస్య తలెత్తకూడదంటే ముఖ్యంగా మూడు నియమాలు పాటించాలి. అవేంటంటే..
1. నీరు సమృద్ధిగా తాగాలి
2. ఆహారంలో తగినంత మొత్తంలో పీచు ఉండేలా చూసుకోవాలి
3. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
Home Remedies For Constipation- మలబద్ధకం నివారణకు చిట్కాలు
ఇవేకాకుండా మరికొన్ని చిట్కాలతో కూడా మలబద్ధకం సమస్యను నివారించవచ్చు. మీరు ప్రతిరోజూ ఉదయం కడుపును ఖాళీ చేయడానికి ఇబ్బంది పడుతుంటే ఈ కింది పద్ధతులు అనుసరించి చూడండి.
రాక్ సాల్ట్ తీసుకోవడం
రాతి ఉప్పు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందులో పొట్టను శుభ్రపరచడం కూడా ఒకటి. ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ రాళ్ల ఉప్పు లేదా గులాబీ ఉప్పు కలపండి. ఈ నీటిని తాగడం వల్ల పేగులు పూర్తిగా శుభ్రమవుతాయి.
గోరువెచ్చని నీరు తాగండి
ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే పరిగడుపున ఒకటి నుండి రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగండి. ఇది పొట్టను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది.
మూలికల టీ
మీరు కడుపును ఖాళీ చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే, ఒక కప్పు హెర్బల్ టీని కూడా తాగవచ్చు. ఈ టీ మలబద్ధకం, ఆమ్లత్వాన్ని తొలగిస్తుంది.
ఇంగువ పొడి
అజీర్తి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, మీరు అర టీస్పూన్ ఇంగువ పొడిని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోండి. ఈ ఆయుర్వేద పద్ధతి కడుపుని శుభ్రపరచడానికి ప్రభావవంతంగా ఉంటుంది.
సంబంధిత కథనం