తెలుగు న్యూస్ / ఫోటో /
Constipation Relieves । మలబద్ధకంను పోగోట్టేందుకు ఈ నాలుగు చాలు!
Constipation Relieves: ప్రతిరోజూ మలబద్ధకంతో బాధపడుతున్నారా? అయితే ఇది చాలా గడ్డు సమస్య, అయినప్పటికీ దీనిని నివారించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.
(1 / 8)
ప్రతిరోజూ ఉదయం మలబద్ధకం వేధిస్తే అది మానసికంగా కూడా ఒత్తిడికి గురిచేస్తుంది. కడుపు శుభ్రంగా లేకపోతే, అది వివిధ అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఈ సమస్యను విస్మరించకూడదు.
(2 / 8)
మలబద్ధకం నివారణకు యోగా ఒక చక్కని పరిష్కారంగా ఉంటుంది. గంటలోపే మీకు మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించే యోగాసనాలు ఉన్నాయి.
(3 / 8)
పవనముక్తాసనం: ప్రతి రోజూ ఉదయాన్నే కొంత సమయం పాటు ఈ ఆసనం చేయడం వల్ల అనేక ఉదర సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం సమస్య కూడా పరిష్కారమవుతుంది. ఆకలి పెరగవచ్చు
(4 / 8)
భుజంగాసనం: ఈ ఆసనం ఉదర కండరాలను బలపరచడమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఫలితంగా, ఆకలి పెరుగుతుంది. అదే సమయంలో మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ప్రతిరోజూ ఉదయం ఈ ఆసనం వేయండి. కడుపు శుభ్రంగా మారుతుంది.
(5 / 8)
అర్ధచక్రాసనం: ఇది ఇతర యోగాసనాల కంటే కొంచెం కష్టమైన ఆసనం. కానీ సాధన చేస్తే పొట్టకు చాలా మేలు కలిగిస్తుంది. రోజూ ఉదయం ఈ ఆసనం వేస్తే మలబద్ధకం సమస్య అనేదే ఉండదు.
(6 / 8)
వజ్రాసనం: సరళమైన యోగాసనాలలో ఇది ఒకటి. అయితే ఉదయం పూట కాదు, ప్రతిరోజూ భారీ భోజనం చేసిన తర్వాత ఈ యోగాసనాన్ని అభ్యాసం చేయవచ్చు. ఇది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.
ఇతర గ్యాలరీలు