Home Remedies for Constipation : ప్రతిరోజూ ఉదయం నిమ్మరసం తీసుకోండి.. ఆ సమస్య దూరమైపోతుంది..-here are home remedies for constipation
Telugu News  /  Lifestyle  /  Here Are Home Remedies For Constipation
పరగడుపునే నిమ్మరసం తాగితే ప్రయోజనాలు ఇవే..
పరగడుపునే నిమ్మరసం తాగితే ప్రయోజనాలు ఇవే..

Home Remedies for Constipation : ప్రతిరోజూ ఉదయం నిమ్మరసం తీసుకోండి.. ఆ సమస్య దూరమైపోతుంది..

25 November 2022, 14:06 ISTGeddam Vijaya Madhuri
25 November 2022, 14:06 IST

Home Remedies for Constipation : చలికాలంలో వ్యాయామం చేయాలనిపించదు. పైగా పొడి వాతావరణం. ఇది మనల్ని డీహైడ్రేట్ చేస్తుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాదు. వీటిన్నింటి వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. దీనివల్ల మానసికంగా, శారీరకంగా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనిని సులభంగా క్యూర్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

Home Remedies for Constipation : మలబద్ధకం అనేది ఒక సాధారణ జీర్ణ సమస్య. దీనిగురించి ఎవరితోనూ ఎక్కువ డిస్కస్ చేయము. అది ఒక నామోషీలాగా ఫీలవుతారు. అయితే చెడు ఆహారం, అనారోగ్యకరమైన జీవనశైలి ఎంపికలు, కొన్ని మందులు, వ్యాధుల వల్ల ఇది సంభవించవచ్చు. దీనివల్ల మీరు బాత్రూమ్‌కు వెళ్లినప్పుడు చాలా అసౌకర్యానికి గురవుతారు. పొత్తికడుపు ఉబ్బరం, తేలికపాటి నుంచి తీవ్రమైన నొప్పికి దారితీస్తుంది. కాబట్టి దీనిని తగ్గించుకోవడానికి ఇక్కడ సులభమైన ఇంటి నివారణలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండండి..

మలబద్దకానికి ప్రధాన కారణాలలో డీహైడ్రేషన్ ఒకటి. ఇది మీ పేగు కదలికను అడ్డుకుంటుంది. తద్వారా మలబద్దకానికి దారితీస్తుంది. కాబట్టి మీరు రోజూ పుష్కలంగా నీరు తాగండి. కనీసం రోజుకు కనీసం 8-10 గ్లాసులు నీరు తాగితే ఆరోగ్యానికి మంచిది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు కీలకం.

ఫైబర్ ఫుడ్ తీసుకోండి..

మీరు మలబద్ధకంతో బాధపడుతూ ఉంటే.. మీరు ఫైబర్ ఫుడ్ గురించి కచ్చితంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఇది మీ జీర్ణవ్యవస్థ నుంచి వ్యర్థమైన ఆహారాన్ని బయటకు పంపడానికి సహాయం చేస్తుంది. రోజుకు 20-35 గ్రాముల ఫైబర్ తీసుకోవడం సిఫార్సు చేస్తున్నారు. అయితే కొన్ని ఫైబర్ నిండిన ఆహార వనరులలో భాగంగా తృణధాన్యాలు, బీన్స్, కాయధాన్యాలు, వోట్మీల్, బాదం, బార్లీ, కూరగాయలు, పండ్లు తీసుకోవచ్చు.

కాఫీ తాగండి..

కాఫీ పెద్దపేగును ప్రేరేపిస్తుంది. ఇది మీ కడుపులోని మళినాలను బయటకు పంపడానికి సహాయం చేస్తుంది. మూలికా టీ, వేడి నిమ్మ నీరు లేదా తేనె వంటి ఇతర వేడి పానీయాలు కూడా పెద్దపేగును ప్రేరేపించడంలో సహాయం చేస్తాయి. ఇవి మలబద్ధకం చికిత్సలో అద్భుతాలు చేస్తాయి. అయితే దీనిని ఎక్కువగా కాకుండా.. తగిన మోతాదులో తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. లేదా మీ మలబద్ధకం మరింత తీవ్రమవుతుంది.

నిమ్మ నీరు

నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ మీ జీర్ణవ్యవస్థకు ఉద్దీపనగా పనిచేస్తుంది. మీ శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. తద్వారా మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు నీటిలో తాజా నిమ్మరసం వేసి తాగండి. మీ ఉదయం కప్పు టీలో కూడా నిమ్మరసాన్ని కలిపి తీసుకోవచ్చు. నిమ్మకాయ నీరు మలబద్ధకాన్ని మెరుగుపరచడమే కాకుండా.. మీ దీర్ఘకాలిక జీర్ణ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

ఆలివ్, ఫ్లాక్స్ సీడ్ నూనెలు

ఆలివ్, అవిసె గింజల నూనెలు తేలికపాటి భేదిమందు ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి మీ పేగుల ద్వారా పదార్థాల ప్రవాహాన్ని తగ్గిస్తాయి. తద్వారా మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా అవి మీ జీర్ణక్రియను మెరుగుపరిచే సమ్మేళనాలతో సమృద్ధిగా నిండి ఉంటాయి. వీటిలోని గొప్ప యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. 2015లో చేసిన అధ్యయనంలో ఆలివ్, ఫ్లాక్స్ సీడ్ నూనెలు మలబద్ధకం లక్షణాలను గణనీయంగా తగ్గిస్తాయని పేర్కొంది.

వ్యాయామం తప్పనిసరి

రెగ్యులర్ వ్యాయామం మీ పేగు కదలికను మెరుగుపరుస్తుంది. మీరు హెవీ మీల్స్ తీసుకోవడం ముగించినట్లయితే.. జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేసుకోవాలంటే.. కాసేపు నడవండి. నిశ్చల జీవనశైలి మలబద్ధకాన్ని పెంచుతుంది. కాబట్టి రోజు చురుకుగా ఉండండి.

సంబంధిత కథనం

టాపిక్