తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mango Jam : కేవలం మూడే మూడు పదార్థాలతో మ్యాంగో జామ్.. సూపర్ టేస్టీ

Mango Jam : కేవలం మూడే మూడు పదార్థాలతో మ్యాంగో జామ్.. సూపర్ టేస్టీ

Anand Sai HT Telugu

28 April 2024, 17:00 IST

    • Mango Jam : వేసవిలో దొరికే మామిడిపండు అంటే అందరికీ ఇష్టమే. అయితే దీనితో మ్యాంగో జామ్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. కేవలం మూడు పదార్థాలతోనే తయారుచేయవచ్చు.
మ్యాంగ్ జామ్ రెసిపీ
మ్యాంగ్ జామ్ రెసిపీ (Unsplash)

మ్యాంగ్ జామ్ రెసిపీ

వేసవిలో దొరికే మామిడిపండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేసవి వచ్చిందంటే చాలా మంది వీటికోసం చూస్తారు. అయితే మార్కెట్లో దొరికే మామిడిపండ్లలో స్వచ్ఛమైనవి ఏవో గుర్తించి కొనుక్కోవాలి. అప్పుడే ఆరోగ్యానికి మంచిది. అతిగా కూడా వీటిని తినకూడదు. వేడి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. మామిడితో వివిధ రకాల జ్యూస్‌లు తయారుచేసుకోవచ్చు. అంతేకాదు అందరూ ఇష్టంగా తినేలా మ్యాంగ్ జామ్ చేయవచ్చు. అయితే కేవలం మూడు పదార్థాలను మాత్రమే ఉపయోగించి.. ఈ రెసిపీ చేయవచ్చు.

జామ్ అంటే పిల్లలకు పంచ ప్రాణం. ముఖ్యంగా మామిడి జామ్ అంటే కమ్మని రుచి, ఈ సీజన్ లో మామిడి జామ్ చేసుకోవచ్చు. చాలా సులువుగా తయారుచేయవచ్చు. ఎలాంటి రసాయనాలు వాడకుండా ఈ జామ్ చేయవచ్చు. పిల్లలు జామ్ ని ఎంజాయ్ చేస్తూ తింటారు. వారికి నచ్చినట్లు, దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం:

కావలసినవి పదార్థాలు : 2 పెద్ద గుజ్జు మామిడికాయలు(సహజంగా పండిన మామిడికాయలు, జ్యూసిగా ఉండాలి) 1/2 కప్పు పంచదార, మీరు కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం జోడించవచ్చు.

ఒక కప్పులో మామిడికాయ గుజ్జు మాత్రమే వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మామిడికాయ గుజ్జును పాన్‌లో వేసి 2 నిమిషాలు వేడి చేయాలి. తర్వాత పంచదార వేయండి, చక్కెర కలుపుతున్నప్పుడు మిశ్రమం గట్టిపడుతుంది. తరువాత వేడి నుండి తీసివేసి 8-10 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై నిమ్మరసం పిండి మిక్స్ చేయాలి. ఆపై గాలి చొరబడని గాజు కంటైనర్‌లో ఉంచండి. మీరు దీన్ని ఒక నెల పాటు ఉపయోగించవచ్చు.

ఇతర సలహాలు

కావాలంటే కొద్దిగా వెనీలా ఎసెన్స్ 1/2 టీస్పూన్ వేసుకోవచ్చు. యాలకుల పొడి కూడా వేయాలి. పీచుపదార్థం తక్కువగా ఉండడం వల్ల జామ్ చేయడానికి మామిడిపండ్లు మంచివి. మామిడిపండు, పంచదార ఎక్కువ వేసి జామను ఎక్కువగా వాడవచ్చు. అలాగే బాగా పండిన మామిడి పండ్లను ఉపయోగించవద్దు, అవి బాగా పండితే పంచదార కలిపితే రుచి పాడవుతుంది. నిమ్మరసం ఎక్కువగా జోడించడం వల్ల గట్టిపడటం నివారించవచ్చు. బయట ఉంచవద్దు, ఫ్రిజ్‌లో ఉంచి వాడండి. జామ్‌లో నీటి చెంచా వేయవద్దు, అది చెడిపోతుంది.

ఈ మ్యాంగ్ జామ్ పిల్లలు ఇష్టంగా తింటారు. సాయంత్రం స్నాక్స్ టైములో కూడా ఇవ్వవచ్చు. చపాతీలో కలుపుకొని తినవచ్చు. లేదంటే.. బ్రెడ్ మీద కూడా కలుపుకోవచ్చు. ఈ జామ్ తయారుచేసందుకు సమయం కూడా ఎక్కువగా పట్టదు. చాలా సులభంగా తయారుచేయవచ్చు. అయితే ఎక్కువ రోజులు నిల్వఉంచుకోకూడదు. అలాగే ఫ్రిజ్‌లో తప్పకుండా పెట్టాలి. లేదంటే పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ మ్యాంగ్ జామ్ రెసిపీ ట్రై చేయండి. ఫిదా అయిపోతారు.

తదుపరి వ్యాసం