తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Egg Masala Fry: కోడిగుడ్డు మసాలా వేపుడు ఇలా చేశారంటే లొట్టలు వేసుకొని తింటారు, రెసిపీ ఇదిగో

Egg Masala Fry: కోడిగుడ్డు మసాలా వేపుడు ఇలా చేశారంటే లొట్టలు వేసుకొని తింటారు, రెసిపీ ఇదిగో

Haritha Chappa HT Telugu

12 May 2024, 17:30 IST

google News
    • Egg Masala Fry: కోడిగుడ్డుతో చేసిన వంటకాలు ఏవైనా కూడా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మేము కోడిగుడ్డు మసాలా వేపుడు ఇచ్చాము. ఇది ఒక్కసారి తిన్నారంటే రుచి మర్చిపోలేరు.
ఎగ్ మసాలా వేపుడు
ఎగ్ మసాలా వేపుడు

ఎగ్ మసాలా వేపుడు

Egg Masala Fry: కోడిగుడ్డు చేసిన వంటలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రతి రోజు గుడ్డు తినమని వైద్యులు కూడా చెబుతారు. ఒకసారి కొత్త కోడిగుడ్డుతో ఈ మసాలా వేపుడు చేసి చూడండి. పిల్లలకు, పెద్దలకు నచ్చుతుంది. దీన్ని చేయడం చాలా సులువు. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

కోడిగుడ్డు మసాలా వేపుడు రెసిపీకి కావలసిన పదార్థాలు

కోడిగుడ్లు - నాలుగు

కారం - ఒక స్పూన్

ఉప్పు - రుచికి సరిపడా

పచ్చిమిర్చి - నాలుగు

ఉల్లిపాయలు - మూడు

యాలకులు - మూడు

లవంగాలు - నాలుగు

అనాసపువ్వు - ఒకటి

గసగసాలు - ఒక స్పూను

ధనియాలు - రెండు స్పూన్లు

నూనె - సరిపడినంత

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

పుదీనా తరుగు - రెండు స్పూన్లు

పసుపు - పావు స్పూను

కోడిగుడ్డు మసాలా వేపుడు రెసిపీ

1. కోడిగుడ్లను ముందుగానే ఉడకబెట్టి పైన పొట్టు తీసి ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాసపువ్వు, గసగసాలు వేసి ఫ్రై చేసి పొడిచేసి పెట్టుకోవాలి.

3. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి ముక్కలుగా కోసుకున్న కోడిగుడ్లను వేసి వేయించుకోవాలి.

4. అయితే కోడిగుడ్డులోని తెలుపు సొన ముక్కలను మాత్రమే వేయాలి.

5. పచ్చ సొన పక్కన పెట్టుకోవాలి.

6. ఆ ముక్కలు ఎర్రబడేదాకా వేయించుకొని అందులో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి.

7. ఆ తర్వాత పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేసి వేయించాలి.

8. ముందుగా పొడిచేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి రెండు నిమిషాలు వేయించాలి.

9. ఇప్పుడు పచ్చ సొన ముక్కలను కూడా వేయాలి.

10. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా తరుగును వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.

11. అంతే కోడిగుడ్డు మసాలా వేపుడు రెడీ అయినట్టే.

12. ఇది చాలా రుచిగా ఉంటుంది. కాస్త స్పైసీగా చేసుకుంటే పెద్దలకు బాగా నచ్చుతుంది.

కోడిగుడ్డుతో చేసే ఈ మసాలా వేపుడు సాంబార్ కు, పప్పుకు సైడ్ డిష్ గా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా ఇది బాగా నచ్చుతుంది. స్నాక్స్ గా దీన్ని తినవచ్చు. ఇందులో కోడిగుడ్డును ఉడికించి వేసాము. కాబట్టి దానిలోని పోషకాలు బయటకు పోకుండా ఉంటాయి. ఇందులో వాడిన నూనె కూడా తక్కువే. ఆరోగ్యానికి అన్ని విధాలా ఈ కోడిగుడ్డు మసాలా ఫ్రై రెసిపీ మేలే చేస్తుంది. ఒక్కసారి మీరు చేసుకొని తిని చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.

తదుపరి వ్యాసం