Sambar History: సాంబార్ పుట్టిన రాష్ట్రం ఇదే, దీనికి ఎవరి పేరు పెట్టారంటే…-sambar history this is the state where sambar was born after whom it was named ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sambar History: సాంబార్ పుట్టిన రాష్ట్రం ఇదే, దీనికి ఎవరి పేరు పెట్టారంటే…

Sambar History: సాంబార్ పుట్టిన రాష్ట్రం ఇదే, దీనికి ఎవరి పేరు పెట్టారంటే…

Published Apr 23, 2024 03:37 PM IST Haritha Chappa
Published Apr 23, 2024 03:37 PM IST

  •  దక్షిణాది వంటకాలలో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న వాటిలో సాంబార్ ఒకటి. తెలుగు భోజనాలలో సాంబార్ కు ప్రత్యేక స్థానం ఉంది. దక్షిణ భారతదేశంలో తొలిసారి సాంబారు ఎక్కడ తయారు చేశారో, దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటో తెలుసుకోండి.

దక్షిణ భారత వంటకాలలో సాంబార్ ఒకటి. దీనికి అభిమానులు ఎక్కువ. వివిధ రకాల మసాలా దినుసులను జోడించి తయారు చేసే సాంబార్ లేకుండా ఏ పెళ్లి విందు పూర్తి కాదు. సాంబార్ వెరీ స్పెషల్ వంటకంగా పేరు తెచ్చుకుంది.

(1 / 6)

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇష్టపడి తినే సాంబార్ వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఈ వంటకం ఎండు మిరియాలు, పప్పు, చింతపండు, జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిపాయ, వెల్లుల్లి మొదలైన పదార్ధాలతో తయారు చేస్తారు. సాంబార్ ఆవిష్కరణ వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.

(2 / 6)

సాంబారును మొదట మహారాష్ట్రలో తయారు చేశారు. తంజావూరులో మరాఠా పాలనను స్థాపించిన ఏకోజీ కుమారుడు మొదటి షాహాజీ రాజపాకశాలలో మొదట సాంబారును తయారు చేసినట్లు చరిత్ర చెబుతోంది. 

(3 / 6)

ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు,శంభాజీ తంజావూరును సందర్శించినప్పుడు, అతని కోసం ప్రత్యేకంగా సాంబార్ అనే వంటకాన్ని తొలిసారి వండినట్టు చెబుతారు. శంభాజీని ముద్దుగా సాంబా అని పిలుచుకుంటారు. ఈ కొత్త వంటకానికి అతని గౌరవార్థం అతని పేరునే పెట్టారు.

(4 / 6)

మరో కథనం ప్రకారం షాజీ అనే రాజ వంటగాడు పప్పు వండుతున్నాడు. పప్పులో వేసేందుకు కోకుమ్ లేకపోవడంతో… చింతపండును వేశారు. అలాగే కొన్ని కూరగాయలు కూడా జోడించాడు. ఈ లోపు శివాజీ కొడుకు శంభాజీ పర్యటనకు అక్కడికి వచ్చాడు.  ఆ వాసన అతనికి బాగా నచ్చింది. అతడికి ఈ సాంబారును తొలిసారి వడ్డించినట్టు చరిత్ర చెబుతోంది.

(5 / 6)

సాంబార్ తినడం వల్ల జీర్ణక్రియకు మంచిది. ఇంట్లోనే సులభంగా రుచికరమైన సాంబార్ తయారు చేసుకోవచ్చు. వారంలో ఒక్కసారైనా సాంబార్ చేసుకునేవారు ఎంతోమంది. కొందరైతే ప్రతిరోజూ వండుకుంటారు. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు