Gulab Jamun: బొంబాయి రవ్వతో ఇలా గులాబ్ జామ్ చేసేయండి, సాయంత్రం టేస్టీ స్నాక్ రెడీ అయిపోతుంది-gulab jamun with bombay ravva recipe in telugu know how to make this sweet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gulab Jamun: బొంబాయి రవ్వతో ఇలా గులాబ్ జామ్ చేసేయండి, సాయంత్రం టేస్టీ స్నాక్ రెడీ అయిపోతుంది

Gulab Jamun: బొంబాయి రవ్వతో ఇలా గులాబ్ జామ్ చేసేయండి, సాయంత్రం టేస్టీ స్నాక్ రెడీ అయిపోతుంది

Haritha Chappa HT Telugu
Mar 02, 2024 03:30 PM IST

Gulab Jamun: రెడీ టు కుక్ గులాబ్ జామ్‌లను అందరూ చేసుకుంటారు. ఒకసారి బొంబాయి రవ్వతో గులాబ్ జామ్ చేసి చూడండి. చాలా టేస్టీగా వస్తుంది. వీటిని చేయడం కూడా చాలా సులువు.

గులాబ్ జామూన్ రెసిపీ
గులాబ్ జామూన్ రెసిపీ (Pixabay)

Gulab Jamun: గులాబ్ జామ్ అనగానే అందరికీ బయట దొరికే రెడీ టు మిక్స్ దొరికే ప్యాకెట్ గుర్తొస్తుంది. అది కాకుండా ఇంట్లో అప్పటికప్పుడు గులాబ్ జామ్‌ను రెడీ చేసుకోవచ్చు. బొంబాయి రవ్వతో గులాబ్ జామ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు ఇది నచ్చడం ఖాయం. బయట దొరికే ప్యాకెట్ గులాబ్ జామ్ మిక్స్ లో మైదా అధికంగా ఉంటుంది. మైదా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి బొంబాయి రవ్వతో గులాబ్ జామ్ చేయడానికి ప్రయత్నించండి. రెసిపీ ఇదిగో.

బొంబాయి రవ్వ గులాబ్ జామున్ రెసిపీకి కావలసిన పదార్థాలు

బొంబాయి రవ్వ - పావు కిలో

చక్కెర - ఒక కప్పు

పాలు - అర లీటరు

యాలకుల పొడి - అర స్పూను

నెయ్యి - ఒక స్పూను

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

వంటసోడా - చిటికెడు

బొంబాయి రవ్వ గులాబ్ జామున్ రెసిపీ

1. స్టవ్ మీద గిన్నె పెట్టి పంచదార, నీళ్లు వేసి పాకంలా చేసి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో పాలు వేసి మరిగించాలి.

3. పాలు మరిగాక మంటను తగ్గించాలి. ఆ పాలల్లో రవ్వ కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి.

4. అదంతా దగ్గరగా ముద్దలాగా అయ్యేవరకు గరిటతో కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

5. రవ్వ ముద్దలా కాస్త దగ్గరగా, గట్టిగా అయ్యాక అందులో నెయ్యి, చిటికెడు వంటసోడా వేసి బాగా కలుపుకోవాలి.

6. ఒక పావుగంట పాటు పక్కన వదిలేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని తీసి చిన్న ఉండలుగా చుట్టుకోవాలి.

7. స్టవ్ మీద మరో కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.

8. నూనె బాగా వేడెక్కాక ముందుగా చుట్టుకున్న ఉండలను ఇందులో వేసి రంగు మారేవరకు డీప్ ఫ్రై చేయాలి.

9. ఇప్పుడు ఆ ఉండలను తీసి చక్కెర పాకంలో వేయాలి.

10. పైన యాలకుల పొడిని చల్లుకోవాలి.

11. రెండు గంటల పాటు అలా వదిలేస్తే రవ్వ ఉండలు బాగా చక్కెర పాకాన్ని పీల్చుకొని టేస్టీగా మారుతాయి.

12. అంతే బొంబాయి రవ్వతో గులాబ్ జామూన్ రెడీ అయిపోతాయి.

13. ఇవి మైదాతో చేసిన గులాబ్ జామూన్‌లతో పోలిస్తే చాలా టేస్టీగా ఉంటాయి.

14. ఒక్కసారి మీరు చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ మీకే చేయాలనిపిస్తుంది. పిల్లలకు ఇది చాలా నచ్చుతుంది. అంతే కాదు చాలా తక్కువ సమయంలో రెడీ అయిపోతుంది. ఇందులో వాడినవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవి, కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు.

Whats_app_banner