తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Raw Mango Jam: పచ్చి మామిడితో పుల్లపుల్లని జామ్ ఇలా చేసేయండి, ఎంతో రుచి

Raw Mango Jam: పచ్చి మామిడితో పుల్లపుల్లని జామ్ ఇలా చేసేయండి, ఎంతో రుచి

Haritha Chappa HT Telugu

12 May 2024, 15:30 IST

google News
    • Raw Mango Jam: పచ్చి మామిడికాయలతో చేసే జామ్ పులపుల్లగా ఉంటుంది. ఈ తీయని పుల్లని జామ్‌ను పిల్లలు ఇష్టంగా తింటారు. దీని రెసిపీ కూడా చాలా సులువు.
పచ్చి మామిడికాయ జామ్
పచ్చి మామిడికాయ జామ్

పచ్చి మామిడికాయ జామ్

Raw Mango Jam: పిల్లలకు ఇష్టమైన వాటిలో జామ్ కూడా ఒకటి. ప్రతిసారి దీన్ని బయటే కొనకుండా పచ్చి మామిడితో ఇంట్లోనే చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చేయడం చాలా సులువు. ఒకసారి చేస్తే వారం రోజులపాటు తాజాగా ఉంటుంది. కాబట్టి రోజూ పిల్లలు తినవచ్చు. ఈ పచ్చి మామిడి జామ్ ఎలా చేయాలో తెలుసుకోండి.

పచ్చిమామిడి జామ్ రెసిపీకి కావలసిన పదార్థాలు

పచ్చి మామిడికాయలు - రెండు

డ్రై ఫ్రూట్స్ - అరకప్పు

యాలకుల పొడి - ఒక స్పూను

పంచదార - ఒక కప్పు

పచ్చి మామిడికాయ జామ్ రెసిపీ

1. పుల్లని పచ్చి మామిడికాయలను ఈ జామ్ కోసం ఎంచుకోవాలి.

2. మామిడికాయ పైన చెక్కును తీసి సన్నగా తురమాలి.

3. ఇప్పుడు ఒక గిన్నెలో మామిడికాయ తురుమును వేసి పంచదార వేసి బాగా కలపాలి. ఒక పావు గంట సేపు అలా వదిలేయాలి.

4. తర్వాత స్టవ్ మీద ఈ గిన్నెను పెట్టి తురుమును, పంచదారను బాగా కలుపుతూ ఉడికించాలి.

5. ఒక పావు గంట సేపు చిన్న మంట మీద ఉడికించాలి.

6. అది హల్వాలాగా దగ్గరగా అవుతూ ఉంటుంది.

7. ఆ సమయంలోనే డ్రై ఫ్రూట్స్ ముక్కలు చల్లుకోవాలి.

8. అది జెల్లీలాగా దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి.

9. అంతే తీపి పులుపు కలిసిన మామిడికాయ జామ్ రెడీ అయినట్టే.

10. దీని రెసిపీ చాలా సులువు. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు.

11. ఒకసారి చేసుకుంటే గాలి చొరబడని డబ్బాలో వేసి దాచుకుంటే ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది.

పచ్చి మామిడికాయలు వేసవిలోనే అధికంగా లభిస్తాయి. కాబట్టి వాటితో చేసే రెసిపీలను ఆయా సీజన్లలో తినడం చాలా ముఖ్యం. పచ్చిమామిడిలో మన శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. అలాగే అందులో ఉండే పోషకాలు సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. ఈ పచ్చి మామిడి జామ్ పిల్లలకే కాదు పెద్దలకు కూడా బాగా నచ్చుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం