Telangana News Live September 16, 2024: 500 Bonus For Paddy : రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఈ ఖరీఫ్ నుంచే రూ.500 బోసస్
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 16 Sep 202405:08 PM IST
- 500 Bonus For Paddy : రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఖరీఫ్ నుంచే సన్నాలకు రూ.500 బోనస్ అందిస్తామని ప్రకటించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఖరీఫ్ నుంచే రూ.500 బోనస్ ఇస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
Mon, 16 Sep 202403:50 PM IST
- Medak News : గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని మొక్కడానికి వెళ్లిన దళిత మహిళలను కులం పేరుతో దూషించి దాడి చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని శమ్నాపూర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
Mon, 16 Sep 202401:44 PM IST
- CM Revanth Reddy : వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కట్టుకున్న వాళ్లకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి పదేళ్లు సరిపోలేదా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ పరిచయం చేసి ఉండకపోతే...కేటీఆర్ ఇడ్లీ,వడ అమ్ముకునే వారని విమర్శించారు.
Mon, 16 Sep 202401:30 PM IST
- KV Jobs Recruitment 2024 : తెలంగాణలోని కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తున్నారు. సెప్టెంబర్ 18వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు కేంద్రీయ విద్యాలయం అధికారులు వెల్లడించారు.
Mon, 16 Sep 202412:58 PM IST
- Hyderabad Student : పుట్టినరోజు అని స్నేహితులతో కలిసి సరదాగా గడపడానికి వెళ్లాడు. కానీ.. ఆ పుట్టినరోజే ఆఖరి రోజు అవుతుందని ఊహించలేదు. హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి కెనడాలోని సరస్సులో మునిగి మృతిచెందాడు. దీంతో ఆ విద్యార్థి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
Mon, 16 Sep 202412:04 PM IST
- Siddipet Police : సిద్ధిపేట జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. చెరువులు, వాగులు నిండుగా ఉన్నాయి. ఈ సమయంలో పిల్లలను ఈతకు పంపించవద్దని సిద్దిపేట సీపీ సూచించారు. ఈత రాకపోవడం వలన ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడితే ప్రయోజనం ఉండదన్నారు.
Mon, 16 Sep 202411:37 AM IST
- Ganesh Immersion : హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా గణపతి నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీస్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో.. గణేష్ నిమజ్జనం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కీలక ఆదేశాలు ఇచ్చారు.
Mon, 16 Sep 202411:12 AM IST
- TG New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. త్వరలోనే విధివిధానాలు జారీ చేయనున్నట్లు ప్రకటించింది.
Mon, 16 Sep 202409:49 AM IST
- Sangareddy Crime : సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో కట్టుకున్న భర్తే చంపేశాడు. టవల్‌ను గొంతుకు బిగించి హత్య చేశాడు. ఎవరికి అనుమానం రాకుండా.. గుండె నొప్పితో చనిపోయిందని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆఖరికి పోలీసులకు చిక్కాడు.
Mon, 16 Sep 202409:18 AM IST
- Ganesh Immersion : గణపతి నిమజ్జనం నేపథ్యంలో అన్ని శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పోలీస్, జీహెచ్ఎంసీ భక్తులకు సూచనలు చేస్తున్నారు. తాజాగా.. జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి కాట భక్తులకు విజ్ఞప్తి చేశారు. రోడ్లపై రంగుల పేపర్లు, రిబ్బన్లు వేయొద్దని కోరారు.
Mon, 16 Sep 202407:56 AM IST
- Kaushik Reddy : పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం తాను చావడానికైనా సిద్ధమని ప్రకటించారు. అటు సీఎం రేవంత్ రెడ్డి గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. పీసీసీ చీఫ్ ఇప్పించాలని తనను రేవంత్ కోరినట్టు కౌశిక్ వెల్లడించారు. కౌశిక్ కామెంట్స్‌తో తెలంగాణ పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారాయి.
Mon, 16 Sep 202407:13 AM IST
- Vinayaka Chavithi Tragedy : అతనో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. గణపతి అంటే భక్తి ఎక్కువ. అందుకే లడ్డూ వేలంలో పాల్గొని రూ.15 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. అందరితో కలిసి ఆనందంగా డ్యాన్స్ చేశారు. కానీ.. ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. అదే ఆఖరి తీన్‌మార్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.
Mon, 16 Sep 202406:10 AM IST
- Hyderabad Crime : హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో విషాదం జరిగింది. రెడ్‌స్టోన్ హోటల్‌లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అయితే.. రేప్ చేసి ఉరి వేసి చంపారని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
Mon, 16 Sep 202405:40 AM IST
- TGSRTC : హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం కన్నుల పండువగా జరుతుంది. ఈ మహా నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించేందుకు నగర ప్రజలే కాకుండా.. ఇతర రాష్ట్రాల భక్తులు కూడా వస్తారు. ఈ నేపథ్యంలో గణపయ్య భక్తులకు అసౌకర్యం కలగకుండా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక బస్సులు నడపనుంది.
Mon, 16 Sep 202405:33 AM IST
- Girl Friend Attack: ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోకుండా తాత్సారం చేస్తుండటంతో ఆగ్రహించిన యువతి అతనిపై దాడి చేసింది. నర్సుగా పనిచేసే యువతి సర్జికల్ బ్లేడుతో ప్రియుడి పీక కోసి పరారైంది. ఈ ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది.
Mon, 16 Sep 202405:06 AM IST
- Train Reservation : తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగకు హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలు సొంతూళ్లకు తరలి వెళతారు. ఎక్కువగా రైళ్లలో ప్రయాణాలు సాగిస్తారు. ఫలితంగా రైలు టికెట్లకు భారీగా డిమాండ్ ఎర్పడింది. దీంతో 4 నెలల ముందే రిజర్వేషన్లు పూర్తయ్యాయి.
Mon, 16 Sep 202404:54 AM IST
- Ambulance Smuggling: గంజాయి రవాణా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు రూటు మార్చి రవాణా చేస్తూనే ఉన్నారు. అంబులెన్స్‌లో గంజాయి రవాణా చేస్తూ టైర్ పంక్చర్ అవడంతో పట్టుబడిన ఘటన కొత్తగూడెంలో జరిగింది.స్థానికుల సమాచారంతో పోలీసులు వాహనంలో తనిఖీ చేసి 2కోట్ల విలువైన గంజాయి పట్టుకున్నారు
Mon, 16 Sep 202403:50 AM IST
Vande Bharat Express : సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను పీఎం మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ రైలు 19వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ రైలు సికింద్రాబాద్ చేరుకునే సమయంలో స్వాగతం పలికేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Mon, 16 Sep 202402:32 AM IST
- Hyderabad Traffic: భాగ్యనరగంలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి సమయం దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 17,18 తేదీల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. నగరం నలుమూలల నుంచి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం కోసం విగ్రహాలు తరలి రానుండటంతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
Mon, 16 Sep 202412:31 AM IST
- Jagityala Accident: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలాస వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు రెండు బైకులు ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గణేష్ నిమజ్జనానికి తాతతో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరిన మనుమడు మనవరాలు ప్రమాదానికి గురయ్యారు.