Kaushik Reddy : తెలంగాణ కోసం చావడానికైనా నేను సిద్ధం: కౌశిక్‌ రెడ్డి-huzurabad mla padi kaushik reddy said that he is ready to die for telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kaushik Reddy : తెలంగాణ కోసం చావడానికైనా నేను సిద్ధం: కౌశిక్‌ రెడ్డి

Kaushik Reddy : తెలంగాణ కోసం చావడానికైనా నేను సిద్ధం: కౌశిక్‌ రెడ్డి

Basani Shiva Kumar HT Telugu
Sep 16, 2024 01:26 PM IST

Kaushik Reddy : పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం తాను చావడానికైనా సిద్ధమని ప్రకటించారు. అటు సీఎం రేవంత్ రెడ్డి గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. పీసీసీ చీఫ్ ఇప్పించాలని తనను రేవంత్ కోరినట్టు కౌశిక్ వెల్లడించారు. కౌశిక్ కామెంట్స్‌తో తెలంగాణ పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారాయి.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై రెచ్చిపోయారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ తన దగ్గరకు వచ్చారని.. పీసీసీ పదవి ఇప్పించాలని బతిమిలాడారని వివరించారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన కౌశిక్.. రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

'నన్ను హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. తెలంగాణ కోసం చావడానికైనా నేను సిద్ధం. ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయించానని.. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు. సీఎం రేవంత్‌పై కేసు నమోదు చేయాలి. మాపై దాడులు చేస్తే సీఎం ఎందుకు చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్టా.. లేనట్టా. సీఎం రేవంత్‌కు భయపడేవాళ్లు ఎవరూ లేరు. హామీలు అమలు చేసేవరకు రేవంత్‌ను వదిలిపెట్టబోం' అని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.

'దాడులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తా. మేం అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలేది లేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత నా ఇంటికి వచ్చారు. ఆయనకు పీసీసీ పదవి ఇప్పించాలని నన్ను బతిమిలాడారు. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోయారు. హైదరాబాద్‌లో ఇంత టెన్షన్‌కు కారణం రేవంత్ రెడ్డి కాదా' అని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్‌ను నమ్ముకుంటే కుక్క తోకను పట్టుకొని గోదారి ఈదినట్టు ఉంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్ఠితి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపి వివేకానంద విమర్శించారు.

కొన్ని రోజులుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ముఖ్యంగా అరెకపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. పాడి వర్సెస్ అరెకపూడి వ్యవహారం పోలీస్ కేసుల వరకూ వెళ్లింది. గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. అతని అనుచరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

'చరిత్రలో రేవంత్ రెడ్డి లాంటి సీఎంలను చాలామందిని చూశాం. రేవంత్ రెడ్డి ఓ చిట్టి నాయుడు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి వారితోనే కొట్లాడాం. వారి కింద రేవంత్ రెడ్డి ఎంత. చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు, నీలాంటి తల మాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చారు.. మస్తుగా పోయారు' అని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

'కాంగ్రెస్‌ కార్యకర్తలకు అండగా ఉంటాను. మహేష్‌ కుమార్‌ గౌడ్‌ సౌమ్యుడు అనుకోకండి. మహేష్‌ వెనుక నేను ఉంటాను. మా వాళ్లు ఎవరి జోలికి పోరు. ఎవరైనా మా జోలికి వస్తే ఊరుకోరు. రా చూసుకుందామని కౌశిక్‌ రెడ్డి ఎందుకు సవాల్‌ చేశారు' అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.