(1 / 6)
వైసీపీ మహిళా నేత, యాంకర్ శ్యామలను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైసీపీ ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంపై యాంకర్ శ్యామల... వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు చెప్పారు.
(Anchor Shyamala Twitter)(2 / 6)
రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన యాంకర్ శ్యామల రంగంలోకి దిగారు. ఏపీలో వరద సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లక్ష్యంగా విమర్శలు చేశారు. వైఎస్ జగన్ పై విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
(Anchor Shyamala Twitter)(3 / 6)
రెండెకరాల నుంచి రెండు లక్షల కోట్ల వరకు ఆస్తులు ఎలా సంపాదించారో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ వివరిస్తే ప్రజలు తెలుసుకుంటారని యాంకర్ శ్యామల అన్నారు. పిల్లికి కూడా బిచ్చం పెట్టని చంద్రబాబు, లోకేశ్... వైఎస్ జగన్ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
(Anchor Shyamala Twitter)(4 / 6)
వరద బాధితులకు జగన్ ఏం చేశారని ప్రశ్నిస్తున్న సూడో మేధావులు దయచేసి కళ్లు తెరచి చూడండి, చెవులు విప్పి వినండని వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 200లకు పైగా వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేశారని, వారందరికీ వైఎస్ జగన్ అండగాని నిలిచి సాయం చేశారని యాంకర్ శ్యామల తెలిపారు.
(Anchor Shyamala Twitter)(5 / 6)
విశాఖలోని ఓ ఫార్మా కంపెనీలో పేలుడు సంబంధించి 17 మంది చనిపోతే ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున జగన్ సాయం చేశారని యాంకర్ శ్యామల తెలిపారు. ఆ పేలుడులో 41 మంది గాయపడితే వారికీ రూ.1 లక్ష చొప్పున సాయం చేశారన్నారు. విజయవాడలో వరదలు ముంచెత్తితే, బాధితులకు వైఎస్ జగన్ రూ.కోటి సాయం చేశారని యాంకర్ శ్యామల తెలిపారు. ఇప్పటికే వరద బాధితులకు నిత్యావసర వస్తువులు, వాటర్ బాటిళ్లు, పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారన్నారు. పులివెందులలో ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు.
(Anchor Shyamala Twitter)(6 / 6)
పాదయాత్ర, ఓదార్పుయాత్రలో ఎంతో మందికి ధనసాయం చేశారని శ్యామల తెలిపారు. జగన్ చేసిన సాయం వల్ల ఎంతో మంది లబ్ది పొందారన్నారు. సీఎం చంద్రబాబు అధికార బలం, మీడియా బలం ఉందని వైసీపీపై విష ప్రచారం చేస్తు్న్నారని మండిపడ్డారు. జగన్ చేసిన విధంగా చంద్రబాబు ఏం సాయం చేశారో చెబితే తాను తెలుసుకుంటానని యాంకర్ శ్యామల అన్నారు.
(Anchor Shyamala Twitter )ఇతర గ్యాలరీలు