Jagityala Accident: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరి మృతి, మరో ముగ్గురికి గాయాలు
Jagityala Accident: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలాస వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు రెండు బైకులు ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గణేష్ నిమజ్జనానికి తాతతో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరిన మనుమడు మనవరాలు ప్రమాదానికి గురయ్యారు.
Jagityala Accident: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో తాత మనవరాలు మృతి చెందడం పండుగ పూట అల్లీపూర్ లో విషాదం నెలకొంది.రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన బైండ్ల లచ్చన్న మనువడు మల్లికార్జున్(10), మనవరాలు శ్రీనిధి (13) తో కలిసి స్క్రూటిపై ధర్మపురి నుండి అల్లీపూర్ కు బయలుదేరారు.
పోలాస చౌరస్తా వద్ద ధర్మపురి వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ఋ బస్సు వేగంగా ఢీకొట్టింది. మరో బైక్ అదుపుతప్పి బస్సు కిందికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్క్రోటిపై ఉన్న అల్లిపూర్ కు చెందిన బైండ్ల ఋ లచ్చన్న, మనుమరాలు శ్రీనిధి అక్కడికక్కడే మృతి. మనుమడు మల్లికార్జున్ కు తీవ్ర గాయలయ్యాయి.
మరో బైక్ పై ఉన్న పొలాస గ్రామానికిఋ చెందిన బద్దెనపల్లి నర్సయ్య, బుర్ల రాజన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ముగ్గురిని జగిత్యాల ఆస్పత్రికి స్థానికులు తరలించారు. రెండు బైక్ లను బస్ ఢీ కొట్టి ముందుకు దూసుకెళ్ళడంతో మృతదేహాలు నుజ్జునుజ్జు అయ్యాయి.
సెలవులతో గణేష్ నిమజ్జనానికి వెళ్తు...
గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఆదివారం సోమవారం మంగళవారం వరుసగా మూడు రోజులు స్కూళ్లకు సెలవులు రావడంతో ధర్మపురిలో ఉండే శ్రీనిధి, మల్లికార్జున్ తాతతో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరారు. ఆనందంగా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో గణేష్ నిమజ్జనోత్సవంలో పాల్గొనేందుకు బయలుదేరిన ఇద్దరూ ఒక మధ్యలోనే ప్రమాదానికి గురై ఒకరు ప్రాణాలు పోల్పోవడం మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందడం స్థానికులను కలిసివేసింది.
పండుగ పూట అల్లీపూర్ లో విషాదం నెలకొంది. కన్నవారు కన్నీరుగా విలపిస్తూ సెలవులు రాకపోయినా తన పిల్లలు బతికే వారిని ఆవేదన వ్యక్తం చేశారు.
బస్సులో వారికి తృటిలో తప్పిన ప్రమాదం...
రెండు బైకులు ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో బస్సులో వారికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో హైదరాబాద్ లోని అంబర్ పేట ఆర్య వైశ్య సంఘానికి చెందిన ప్రయాణికులు వేములవాడ, కొండగట్టు మీదుగా ధర్మపురి కి వెళ్లే క్రమంలో పొలాస వద్ద ప్రమాదానికి గురైంది. ధర్మపురి వైపు వెళ్తున్న బస్సు ఎదురుగా వచ్చిన స్క్రూటి ఢీకొన్నాయి.
బస్సు ను అదుపు చేసే క్రమంలో మరో బైక్ వచ్చి బస్సు కిందికి దూసుకెళ్లింది దీంతో బస్సు డ్రైవర్ అప్రమత్తమై బ్రేక్ కొట్టడంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఆగిపోయింది. లేకుంటే బస్సు బోల్తా పడితే బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని బస్సులో ఉన్నావారు ఆవేదన వ్యక్తం చేశారు.
భగవంతుడి దయ వల్లే తృటిలో ప్రమాదం నుంచి బయట పడ్డామని అభిప్రాయపడ్డప్పటికీ బస్సు కిందికి బైక్ దూసుకెళ్లి ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడం మరో ముగ్గురు గాయపడడం పట్ల ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు.
డ్రైవర్ పరార్...
ఈ ప్రమాదం లో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం, మరో ముగ్గురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందడం, 40 మందికి తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ ఘటనలో బస్సు డ్రైవర్ పరారయ్యాడు. స్థానికులు ఆగ్రహ వేషాలతో బస్సు డ్రైవర్ పై దాడికి ఎక్కించే ప్రయత్నం చేయక అప్రమత్తమైన డ్రైవర్ అక్కడినుంచి పారిపోయాడు. పారిపోయిన డ్రైవర్ ముత్యంగౌడ్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగం వల్లే ప్రమాదానికి కారణమని పోలీసులు స్పష్టం చేశారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)