500 Bonus For Paddy : రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఈ ఖరీఫ్ నుంచే రూ.500 బోనస్
500 Bonus For Paddy : రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఖరీఫ్ నుంచే సన్నాలకు రూ.500 బోనస్ అందిస్తామని ప్రకటించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఖరీఫ్ నుంచే రూ.500 బోనస్ ఇస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
500 Bonus For Paddy : తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఖరీఫ్ నుంచి సన్నాలకు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇది విప్లవాత్మక నిర్ణయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఖరీఫ్ నుంచి సన్నాలకు 500 రూపాయల బోనస్ అందించనున్నట్లు మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఖరీఫ్ నుంచే సన్నాలకు(సన్న రకం ధాన్యం) 500 రూపాయల బోనస్ ను చెల్లించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
సన్న వడ్లకు వానాకాలం నుంచి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు రైతులకు హామీలు ఇచ్చారు. వీటిల్లో రూ.2 లక్షల రైతు రుణ మాఫీ, వరి పంటకు రూ.500 బోనస్. తాజాగా బోనస్ పై ప్రభుత్వం ప్రకటన చేసింది.
వర్గీకరణపై మంత్రి వర్గ ఉపసంఘం భేటీ
ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ సోమవారం సాయంత్రం ఎర్రమంజిల్ కాలనీలోని జలసౌదలో సమావేశం అయ్యింది. ఉపసంఘం ఛైర్మన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు దామోదర్ రాజనరసింహా, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, లోకసభ సభ్యులు మల్లు రవి, అధికారులు పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు తీర్పుపై కేబినెట్ ఉపసంఘం అధ్యయనం చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ఇప్పటికే అమలులో ఉన్న పంజాబ్, హర్యానా,తమిళనాడులో ఉపసంఘం అధ్యాయనం చేయనుందన్నారు. ఇదే విషయంలో ప్రజాభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించామన్నారు. న్యాయపరమైన అంశాలలో నిపుణుల సూచనలు తీసుకుంటామన్నారు. న్యాయపరంగా ఎటువంటి ఆటంకాలు కలుగకుండా ఉండేలా పకడ్బందీగా ముందుకు వెళ్తామన్నారు.
సంబంధిత కథనం