Girl Friend Attack: సర్జికల్‌ బ్లేడుతో ప్రియుడిపై ప్రియురాలి దాడి, పెళ్లి ఆలస్యం చేస్తున్నాడని పీక కోసి పరారైన యువతి-girlfriend attacked her boyfriend with a surgical blade ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Girl Friend Attack: సర్జికల్‌ బ్లేడుతో ప్రియుడిపై ప్రియురాలి దాడి, పెళ్లి ఆలస్యం చేస్తున్నాడని పీక కోసి పరారైన యువతి

Girl Friend Attack: సర్జికల్‌ బ్లేడుతో ప్రియుడిపై ప్రియురాలి దాడి, పెళ్లి ఆలస్యం చేస్తున్నాడని పీక కోసి పరారైన యువతి

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 16, 2024 11:03 AM IST

Girl Friend Attack: ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోకుండా తాత్సారం చేస్తుండటంతో ఆగ్రహించిన యువతి అతనిపై దాడి చేసింది. నర్సుగా పనిచేసే యువతి సర్జికల్ బ్లేడుతో ప్రియుడి పీక కోసి పరారైంది. ఈ ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది.

ప్రియుడి పీక కోసిన ప్రియురాలు..
ప్రియుడి పీక కోసిన ప్రియురాలు.. (photo source from unshplash,com)

Girl Friend Attack: ప్రేమించానంటూ వెంటపడి ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండా తాత్సారం చేస్తుండటంతో ఓ యువతి ప్రియుడిపై దాడి చేసింది. నర్సుగా పనిచేసే యువతి సర్జికల్‌ బ్లేడుతో ప్రియుడి పీకకోసిన ఘటన బోయిన్‌పల్లి ఠాణా పరిధిలో జరిగింది.

హైదరాబాద్‌లోని న్యూ బోయిన్‌పల్లి పెద్దతోకట్టకు చెందిన హరికృష్ణ ప్లంబర్‌‌గా పని చేస్తున్నాడు. ఐదేళ్లుగా న్యూబోయిన్‌పల్లి కంసాలి బజార్‌కు చెందిన నర్సును ప్రేమిస్తున్నాడు. తమకు వివాహం చేయాలని హరికృష్ణ తండ్రి యాదయ్యను ఇద్దరూ గతంలో కోరారు. ఏడాది పాటు ఆగితే పెళ్లి చేస్తానని యాదయ్య వారికి సర్ది చెప్పాడు.

సెప్టెంబర్ 14 శనివారం రాత్రి 8 గంటల సమయంలో హరికృష్ణ వాకింగ్‌ చేయడానికి వెళుతున్నట్టు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత హరికృష్ణ తండ్రి యాదయ్యకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి న్యూ బోయిన్‌పల్లి జయనగర్‌కాలనీలో హరికృష్ణకు, యువతి మధ్య గొడవ జరిగిందని, ఆమె సర్జికల్‌ బ్లేడుతో ప్రియుడి మెడపై దాడిచేసి పారిపోయిందని చెప్పాడు.

దీంతో యాదయ్య హుటాఘటనా స్థలానికి చేరుకొని కుమారుడు హరికృష్ణను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాడు. ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి కారణాలను ఆరా తీస్తున్నారు.

ఆటో డ్రైవర్ ఆత్మహత్య…

ప్రేమ వివాహం చేసుకున్న ఆటో డ్రైవర్‌ కుటుంబ కలహాల నేపథ్యంలో హైదరాబాద్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా సున్నిపెంటకు చెందిన షేక్‌ రఫీ(29) వృత్తిరీత్యా ఆటో డ్రైవర్‌‌గా పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన శ్రావణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.

కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో రఫీ గ్రామంలోనే ఉంటుండగా భార్య నగరంలోని మియాపూర్‌లో ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుంది. రెండు రోజుల క్రితం ఆమెతో మాట్లాడి నచ్చజెప్పేందుకు వచ్చిన రఫీకి భార్యతో గొడవ జరగడంతో మనస్తాపానికి గురయ్యాడు. మియాపూర్‌ బీకే ఎన్‌క్లేవ్‌ దగ్గర చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.