Pawan Kalyan: జగన్‌కు పదవీ గండం ఉందనే శ్రీశైలం మహా కుంభాభిషేకం చేయడం లేదని ఆరోపించిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan: పదవీ గండం ఉందనే శ్రీశైలం మహాకుంభాభిషేకం చేయకుండా ముఖ్యమంత్రి జగన్ వాయిదా వేశారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

Pawan Kalyan 'రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసి, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని Janasena జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే మన ఆస్తులను మనమే తగలబెట్టుకున్నట్లేనన్నారు.
కోనసీమ Konaseema రైతాంగం క్రాప్ హాలీడే ప్రకటించినట్లు... వైసీపీకి ప్రజలు పొలిటికల్ హా లీడే ప్రకటించడం రాష్ట్రానికి చాలా అవసరమన్నారు. తండ్రి లేని బిడ్డను, మీ ఇంట్లో వాడినమ్మా అంటే నమ్మి ఒక్కసారి ఓటు వేసినందుకు, మన పొలాలు లాక్కుంటున్నాడు...liquor మద్యం ఏరులై పారిస్తున్నాడని... ఇసుకను దోచుకుంటున్నాడని అన్నారు. జగన్ సింపతి డ్రామాలకు మరోసారి జనం మోసపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. వారాహి విజయభేరి యాత్రలో ఉంగుటూరులో సమావేశం నిర్వహించారు.
జగన్ ప్రభుత్వం ఎయిడెడ్ స్కూళ్లు Aided Schools మూసివేసిందని రాష్ట్రవ్యాప్తంగా 4,709 పాఠశాలలన్ని మూసేశారని, 3 లక్షల 88 వేల మంది విద్యార్థులు స్కూళ్లు మానేశారని పవన్ ఆరోపించారు. ఐదేళ్ల నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న విద్యార్థులు 62 వేల మంది చనిపోయారని ఈ విషయం ఏదీ బయటకి రాదన్నారు.
పిల్లలకు ఇచ్చే చిక్కీల కవర్ల మీద కూడా రూ. 67 కోట్లు దోచేశారని, స్కూలు పిల్లలకు ఇచ్చే నోట్ బుక్స్ మీద భగత్ సింగ్, అంబేద్కర్, మహాత్మా గాంధీ వంటి వారి ఫొటోలు వేస్తే స్ఫూర్తిని రగిలిస్తాయని అలాంటిది జగన్ ఫోటో వేసుకున్నాడని మండిపడ్డారు.
పోలీస్ శాఖను నియంత్రించే సీఎం ఐదేళ్లుగా బెయిల్ మీదున్నాడని పవన్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ మీదున్నాడని, 39 కేసులున్న వ్యక్తి. పాస్ పోర్టు కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ అవసరమని, ఆ పోలీసుల్ని నియంత్రించే వ్యక్తి ఐదేళ్లుగా బెయిల్ మీదున్నాడన్నారు.
అవినీతిని నిలువరించే ఏసీబీ మీద ఆధిపత్యం చెలాయించే ముఖ్యమంత్రి మీద ఈడీ కేసులు ఉన్నాయని, ఐదేళ్లుగా బెయిల్ మీద ఉన్నాడు. ఓటు వేసే ముందు ముఖ్యమంత్రి మనవాడా తనవాడా అని కాదు.. మంచివాడా కాదా అన్నదే ఆలోచించాలన్నారు. ప్రజలకు ఒకటే చెబుతున్నా క్రిమినల్స్ ని భుజాన పెట్టుకుంటే జీవితాలు నాశనం అవుతాయన్నారు.
తోడబుట్టిన చెల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తి జగన్ అని, మన ఆడబిడ్డలకు గౌరవం ఏమీ ఇస్తాడని ప్రశ్నించారు. చెల్లి కట్టుకున్న చీర మీద, ఆమె సంసారం మీద ఏ అన్న అయినా బహిరంగంగా మాట్లాడతాడా..? ఈ పెద్ద మనిషి మాట్లాడతాడని, రాష్ట్రంలో 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే స్పందించని వ్యక్తి జగన్ అని ఆరోపించారు. ఆడబిడ్డలు అత్యాచారానికి గురైతే... ఒకటి రెండు జరుగుతాయి ఆమాత్రం దానికే ఏమైపోతుందని వైసీపీ మంత్రులు మాట్లాడతారని, ఇలాంటి వారికి ఇంకోసారి అధికారం ఇస్తే మన ఆడబిడ్డల మాన, ప్రాణాలకు సంరక్షణ ఉండదని హెచ్చరించారు.
అత్యంత ప్రమాదకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను జగన్ తీసుకొచ్చాడని, మన ఆస్తులు తాలుకు ఒరిజినల్ దస్తావేజులు మన దగ్గర ఉండవు. మన దగ్గర కేవలం జిరాక్స్ లు మాత్రమే ఉంటాయని, మన ఆడబిడ్డలకు పసుపు, కుంకుమ కింద అల్లుడికి ఇవ్వాలంటే కుదరదు. తాకట్టు పెట్టుకోవాలన్నా కుదరదు. భారతదేశపు పాస్ పోర్ట్ మీద ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మ ఉండదు. మన దేశ రాజముద్ర ఉంటుంది. అలాగే మన పట్టదారు పాస్ పుస్తకాలపై మన రాష్ట్ర రాజముద్ర ఉండాలి కానీ... జగన్ బొమ్మ ఎందుకు..? కూటమి ప్రభుత్వం రాగానే మన పాస్ పుస్తకాలపై రాష్ట్ర రాజముద్రను వేయిస్తాం. ఓటు వేసినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి. వైసీపీ ఓటు వేస్తే మాత్రం మన ఆస్తులను మనమే పెట్రోల్ పోసి తగలబెట్టినట్లేనన్నారు.
కావాలనే మహాకుంభాభిషేకం వాయిదా…
‘శ్రీశైలం మల్లికార్జునుడికి తరతరాలుగా వస్తున్న మహా కుంభాభిషేకం క్రతువును వైసీపీ కావాలనే వాయిదా వేస్తూ వస్తోందని. ఓ ప్రణాళిక ప్రకారమే ఆ పవిత్ర కార్యాన్ని జరిపించలేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
దక్షిణాయనంలో ఉన్న శివుడికి మహా కుంభాభిషేకం చేస్తే జగన్ కు పదవీ గండం అని కొందరు జ్యోతిషులు చెప్పడంతోనే కార్యక్రమాన్ని ఇప్పటికి రెండు పర్యాయాలు ఏ కారణం చెప్పకుండా రద్దు చేశార’ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఇటీవల కొందరు పెద్దలు గట్టిగా నిలదీస్తే ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయని కొత్త కథలు చెబుతున్నారన్నారు.
తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని వైసీపీ కావాలని ఆపేసింది.. ఇది ఆదిదేవుడైన శివుడికి ఆగ్రహం కలిగించే నిర్ణయం అవుతుందన్నారు. కచ్చితంగా శివుడు మూడు కన్ను తెరిస్తే, ఆ మంటల్లో వైసీపీ కాలిపోతుంది. కారణం అయిన వారు సర్వనాశనం అవుతారని ఆయన హెచ్చరించారు.
సంబంధిత కథనం