TG ICET 2024 Results : నేడు తెలంగాణ ఐసెట్ ఫలితాలు - డైరెక్ట్ లింక్ ఇదే
TG ICET 2024 Results Updates: తెలంగాణ ఐసెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. జూన్ 14వ మధ్యాహ్నం తెలంగాణ ఐసెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి విడుదల చేయనుంది. రిజల్ట్స్ ప్రకటన తర్వాత… కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు కానుంది.
TG ICET 2024 Results Updates: తెలంగాణ ఐసెట్ -2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం విడుదల కానున్నాయి. జూన్ 14వ తేదీన విడుదల కానున్నాయి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, కాకతీయ యూనివర్సిటీ ఇంఛార్జి వీసీ వాకాటి కరుణ కలిసి శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేయనున్నారు.
ర్యాంకులతో పాటు మార్కులు కూడా ప్రకటించనున్నారు. దీంతో పాటు, టాప్ టెన్ ర్యాంకర్ల జాబితాను కూడా విడుదల చేయనున్నారు. https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 5, 6 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఇప్పటికే ప్రిలిమినరీ ఆన్సర్ కీ కూడా అందుబాటులోకి వచ్చింది.
తెలంగాణ ఐసెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు..
- తెలంగాణ ఐసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే ICET Results 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టినతేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కాపీ పొందవచ్చు.
- అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు కీలకం.
తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఐసెట్) పరీక్షలను ఈ ఏడాది కాకతీయ వర్శిటీ నిర్వహిస్తోంది. తెలంగాణ ఐసెట్ పరీక్షలు జూన్ 5 నుంచి 6వ తేదీ వరకు పలు సెషన్లల్లో జరిగాయి.
TS ICET 2024 Response Sheets : టీఎస్ ఐసెట్ రెస్పాన్స్ షీట్లు ఇలా పొందండి
- తెలంగాణ ఐసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే Download Response Sheets ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీ Registration Number, ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
- మీ రెస్పాన్స్ షీట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.