ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించినా సాంకేతిక కారణాలతో అర్హులైన వారి దరఖాస్తుల్ని సచివాలయాల్లో తిరస్కరిస్తున్నారు. వాట్సాప్లో పౌర సేవల్ని అందించే రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల సర్వర్లను సచివాలయాలతో అనుసంధానించక పోవడంతో దరఖాస్తుదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి.