Bharat Jodo : రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ యాత్ర రూట్లో- కాంగ్రెస్ ప్రదర్శన ఇది..
Rahul Gandhi Bharat Jodo Yatra : 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 99 సీట్లు వచ్చాయి. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రూట్లో పార్టీ ప్రదర్శనను ఇక్కడ తెలుసుకోండి..
Rahul Gandhi latest news : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన రెండు మెగా 'భారత్ జోడో' యాత్రలు విజయవంతమయ్యాయి! 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను చూస్తే ఇది స్పష్టమవుతుంది.
సెప్టెంబర్ 2022 నుంచి జనవరి 2023 వరకు రాహుల్ గాంధీ మొదటి 'భారత్ జోడో' యాత్రను నిర్వహించారు. కన్యాకుమారి నుంచి ప్రారంభమై కాశ్మీర్లో ముగిసిన ఈ యాత్ర.. 71 లోక్‌సభ నియోజకవర్గాల్లో సాగింది. ఇక 'భారత్ జోడో న్యాయ్' యాత్ర 2024 జనవరి 14న మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాలో ప్రారంభమై 2024 మార్చి 16న ముంబైలో ముగిసింది. 100 లోక్‌సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ సెగ్మెంట్లు, 110 జిల్లాల పరిధిలో 6,713 కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది.
'భారత్ జోడో యాత్రలు' మార్గాల్లోని కొన్ని కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల ప్రదర్శన..
ఉత్తరప్రదేశ్..
'భారత్ జోడో' ర్యాలీలు ఉత్తరప్రదేశ్‌లోని 20కి పైగా నియోజకవర్గాలను భారత్ జోడో యాత్ర కవర్ చేసింది. ఈసారి ఉత్తరప్రదేశ్‌లో సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ప్రతిష్టంభనకు తెరదించుతూ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఆగ్రాలో జరిగిన ఉత్తరప్రదేశ్ యాత్రలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు.
ర్యాలీల రూట్లలో కాంగ్రెస్ మూడు స్థానాలను గెలుచుకోగా, ఎస్పీ ఆరు స్థానాలను గెలుచుకుంది.
దిల్లీ..
2024 Lok Sabha election results : మొదటి కాంగ్రెస్ ర్యాలీలో కవర్ అయిన దిల్లీలో కూడా కాంగ్రెస్ లేదా దాని మిత్రపక్షాలు సీట్లు గెలుచుకోలేదు. ర్యాలీ దాటిన ఐదు సీట్లలో రెండింటిలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ పోటీ చేయగా, మిగిలిన మూడింటిలో ఆప్ పోటీ చేసింది. అయితే మొత్తం ఐదు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.
మహారాష్ట్ర..
రాష్ట్రంలో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమితో కలిసి కాంగ్రెస్ ర్యాలీలు సాగిన ప్రాంతాల్లో తొమ్మిది స్థానాలను గెలుచుకుంది.
రెండో 'భారత్ జోడో న్యాయ్' ర్యాలీలో మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, ముంబై పార్టీ చీఫ్ భాయ్ జగ్తాప్, నసీమ్ ఖాన్, విశ్వజిత్ కదమ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేతలు సుప్రియా సూలే, జితేంద్ర అవద్ తదితరులు రాహుల్ గాంధీతో చేరారు.
ఈశాన్య రాష్ట్రాలు..
Congress 2024 Lok Sabha elections : రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో న్యాయ్ యాత్ర జనవరి 14 న మణిపూర్‌లో ప్రారంభమైంది. భారీ హింస తరువాత కీలకమైన రాష్ట్రం అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ గుండా 11 నియోజకవర్గాల్లో యాత్ర సాగింది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆరు స్థానాలను గెలుచుకుంది.
బీహార్..
రాహుల్ గాంధీ రెండో యాత్ర రాష్ట్రంలోని ఏడు నియోజకవర్గాలను తాకింది. వీటిలో కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీ చేసి అన్నింటిలో విజయం సాధించింది. అదే సమయంలో దాని ప్రతిపక్ష మిత్రపక్షాలు రెండు స్థానాలను గెలుచుకున్నాయి.
హరియాణా..
ర్యాలీ ముగిసిన ఐదు స్థానాల్లో కాంగ్రెస్ ఒకటి గెలుచుకోగా, మిగిలిన స్థానాలను బీజేపీ గెలుచుకుంది.
జమ్ముకశ్మీర్..
కాంగ్రెస్ తన మొదటి ర్యాలీలో నాలుగు స్థానాలను కవర్ చేసింది. ఇందులో పార్టీ మిత్రపక్షం నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) రెండు స్థానాలను గెలుచుకుంది. మిగిలిన రెండు స్థానాలను కూటమి కోల్పోయింది.
కర్ణాటక..
Bharat Jodo Yatra Congress : కాంగ్రెస్ తన తొలి 'భారత్ జోడో' ర్యాలీలో ఏడు స్థానాలను కైవసం చేసుకుంది. వీటిలో మహాకూటమి మూడు స్థానాలు గెలుచుకోగా, మిత్రపక్షం జేడీఎస్ ఒక స్థానాన్ని గెలుచుకుంది.
ఈ మెగా ర్యాలీ ద్వారా 11 నియోజకవర్గాల్లో ఏడు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది.
మధ్యప్రదేశ్..
రాష్ట్రంలో బీజేపీ అన్ని స్థానాలు గెలుచుకోవడంతో ఆ పార్టీ ఒక్క సీటు కూడా విజయం సాధించలేదు.
పంజాబ్..
భారత్ జోడో' యాత్రలో పంజాబ్‌లో కాంగ్రెస్ ఆరు స్థానాలను కవర్ చేసింది. వీటిలో కాంగ్రెస్ ఐదు స్థానాలను గెలుచుకోగా, మిత్రపక్షం ఆప్ ఒక స్థానాన్ని గెలుచుకుంది.
రాజస్థాన్..
ఏడు నియోజకవర్గాల్లో పార్టీ యాత్ర నిర్వహించిన మెగా ర్యాలీ అనంతరం ఆ పార్టీ నాలుగు స్థానాలను గెలుచుకుంది.
తమిళనాడు..
'భారత్ జోడో' యాత్ర చేపట్టిన రెండు సీట్లలో ఒకటి కాంగ్రెస్ గెలుచుకోగా, మిత్రపక్షం డీఎంకే మరో స్థానాన్ని గెలుచుకుంది.
తెలంగాణ..
కాంగ్రెస్ పార్టీ ఏడు నియోజకవర్గాల్లో కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది.
తొలి 'భారత్ జోడో యాత్ర' జరిగిన ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ రెండు స్థానాల్లో పోటీ చేసింది. అయితే ఆ పార్టీ రెండు స్థానాలనూ గెలుచుకోలేకపోయింది.
గుజరాత్..
ఐదు నియోజకవర్గాల్లో పర్యటించిన కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలవలేకపోయింది. వాటిని స్థానాలను బీజేపీ గెలుచుకుంది.
పశ్చిమ్ బెంగాల్..
'భారత్ జోడో న్యాయ్' యాత్రలో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ తొమ్మిది స్థానాలను కవర్ చేసింది. వీటిలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కేవలం ఒక సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే, దాని మిత్రపక్షమైన టీఎంసీ ఐదు స్థానాలను గెలుచుకుంది. (రాష్ట్రంలో రెండు పార్టీలు కలిసి పోటీ చేయలేదు.)
ఝార్ఖండ్..
గ్రాండ్ ఓల్డ్ పార్టీ భారత్ జోడో ర్యాలీలో పాల్గొన్న ఏడు సీట్లలో నాలుగింటిలో పోటీ చేసింది. అందులో కేవలం ఒక సీటును మాత్రమే గెలుచుకోగలిగింది.
ఛత్తీస్‌గఢ్..
'భారత్ జోడో న్యాయ్' యాత్రలో పాల్గొన్న నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు..
2024 లోక్‌సభ ఎన్నికల్లో 240 స్థానాలను గెలుచుకుంది బీజేపీ. అయితే ఎన్డీయే మొత్తం బలం 293గా ఉంది. ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అధికార పార్టీ తన ఎన్డీయే మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడుతోంది. మరోవైపు, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాలను గెలుచుకుంది. ఇది 2009 తర్వాత దాని అత్యుత్తమ ప్రదర్శన. ఇండియా కూటమికి 234 సీట్లు ఉన్నాయి.
సంబంధిత కథనం