Andhra Pradesh News Live October 12, 2024: Kakinada Robbery : ఒంట‌రి మ‌హిళ‌లే టార్గెట్‌, చందా కోసం వ‌చ్చి మ‌త్తు మందు చల్లి చోరీలు-today andhra pradesh news latest updates october 12 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live October 12, 2024: Kakinada Robbery : ఒంట‌రి మ‌హిళ‌లే టార్గెట్‌, చందా కోసం వ‌చ్చి మ‌త్తు మందు చల్లి చోరీలు

Kakinada Robbery : ఒంట‌రి మ‌హిళ‌లే టార్గెట్‌, చందా కోసం వ‌చ్చి మ‌త్తు మందు చల్లి చోరీలు

Andhra Pradesh News Live October 12, 2024: Kakinada Robbery : ఒంట‌రి మ‌హిళ‌లే టార్గెట్‌, చందా కోసం వ‌చ్చి మ‌త్తు మందు చల్లి చోరీలు

04:57 PM ISTOct 12, 2024 10:27 PM HT Telugu Desk
  • Share on Facebook
04:57 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 12 Oct 202404:57 PM IST

Andhra Pradesh News Live: Kakinada Robbery : ఒంట‌రి మ‌హిళ‌లే టార్గెట్‌, చందా కోసం వ‌చ్చి మ‌త్తు మందు చల్లి చోరీలు

  • Kakinada Robbery : ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుని చోరీలకు పాల్పడుతున్నాడో ఘనుడు. చందా కోసం అని వచ్చి మత్తు మందు చల్లి ఇల్లు గుల్ల చేసి పరారవుతున్నాడు. కాకినాడ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202404:02 PM IST

Andhra Pradesh News Live: Srivari Brahmotsavam 2024 : శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలు విజ‌య‌వంతం- హుండీ ఆదాయం రూ.26 కోట్లు, 30 లక్షల లడ్డూలు విక్రయం

  • Srivari Brahmotsavam 2024 : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని టీటీడీ ఈవో జె.శ్యామలరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేశామన్నారు. 6 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 15 ల‌క్షల మంది శ్రీ‌వారి వాహ‌న సేవ‌లు వీక్షించారన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202402:20 PM IST

Andhra Pradesh News Live: AP Heavy Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ నెల 14 నుంచి 17 వరకు ఏపీలో భారీ వర్షాలు

  • AP Heavy Rains : బంగాళాఖాతంలో ఆవర్తనం విస్తరించి ఉందని, సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 14 నుంచి 17 వరకు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో హోంమంత్రి అనిత అధికారులను అప్రమత్తం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202401:48 PM IST

Andhra Pradesh News Live: Trains Information: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌, కడ‌ప మీదుగా వెళ్లే రైళ్లు పొడిగింపు

  • Trains Information: క‌డ‌ప మీదుగా రాక‌పోక‌ల నిర్వహించే కాచిగూడ‌-ముర‌డేశ్వర్‌ మ‌ధ్య రాక‌పోక‌లు నిర్వహించే రెండు వీక్లీ రైళ్లను పొడించారు. ప్రతి మంగ‌ళ‌, శుక్రవారాల్లో కాచిగూడ-మంగుళూరు ఎక్స్‌ప్రెస్ (12789) రైలు, మంగుళూరు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ (12790) రైలు మురడేశ్వర్ వరకు పొడిగించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202401:06 PM IST

Andhra Pradesh News Live: Papikondalu Tourism : మళ్లీ ప్రారంభమైన పాపికొండలు బోటు ట్రిప్, టూర్ ప్యాకేజీ బుకింగ్ ఇలా!

  • Papikondalu Tourism : ఏపీలో పాపికొండలు టూర్ మళ్లీ ప్రారంభం అయ్యింది. నేటి నుంచి పర్యాటకులను బోట్లలో పాపికొండల ట్రిప్ నకు అనుమతిస్తున్నారు. దాదాపుగా నాలుగు నెలల తర్వాత మళ్లీ లాంచీలు బయలుదేరాయి. పర్యాటకులు ఏపీ టూరిజం వెబ్ సైట్ ద్వారా టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202412:15 PM IST

Andhra Pradesh News Live: Vijayawada : అంబులెన్స్‌లో భక్తులు.. అవాక్కైన పోలీసులు.. అసలు కథ ఇదీ!

  • Vijayawada : విజయవాడలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. అటు పోలీసులు అమ్మవారి ఆలయం వద్ద ఆంక్షలు విధించారు. ఈ సమయంలో ఓ అంబులెన్స్ అక్కడికి వచ్చి ఆగింది. దాంట్లో నుంచి కొందరు కిందకు దిగారు. అసలు విషయం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202411:09 AM IST

Andhra Pradesh News Live: Vijayawada Teppotsavam Cancel : వరద ఉద్ధృతితో విజయవాడ తెప్పోత్సవం రద్దు, ఘాట్ వద్దే ఉత్సవమూర్తులకు పూజలు

  • Vijayawada Teppotsavam Cancel : కృష్ణా నదిలో వరద ప్రవాహం ఉద్దృతంగా ఉండడంతో దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్సవ మూర్తుల‌ను దుర్గాఘాట్ వ‌ర‌కు తీసుకెళ్లి హంస వాహ‌నంపై ఉంచి పూజ‌లు నిర్వహించనున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202410:33 AM IST

Andhra Pradesh News Live: AP DSC Notification 2024 : ఏపీ డీఎస్సీ అభ్యర్థుల బిగ్ అప్డేట్, నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల!

  • AP DSC Notification 2024 : ఏపీ మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. నవంబర్ 3న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రాథమిక సమాచారం. న్యాయ వివాదాలు లేకుండా, పాత సిలబస్ తోనే డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202410:31 AM IST

Andhra Pradesh News Live: Online Betting : పండగపూట విషాదం.. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

  • Online Betting : అతను ఎన్నో కలలతో చదువుతున్నాడు. పేరెంట్స్ కోరిక మేరకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయ్యాడు. బెంగళూరులో మంచి లైఫ్. ఇంతలోనే ఓ చెడ్డ అలవాటు. అదే ఆన్‌లైన్ బెట్టింగ్. ఈ బెట్టింగ్‌కు బానిసైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జీవితం అర్ధాంతరంగా ముగిసింది. ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202409:45 AM IST

Andhra Pradesh News Live: Sathya Sai Crime : సత్యసాయి జిల్లా దారుణం, కత్తులతో బెదిరించి అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం

  • Sathya Sai Crime : శ్రీసత్య సాయి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. చిల‌మ‌త్తూరు మండ‌లంలో వాచ్‌మెన్‌, అత‌ని కొడుకును నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు క‌త్తుల‌తో బెదిరించి అత్తాకోడ‌ళ్లపై అత్యాచారం చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రత్న స్పందిస్తూ... నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202409:17 AM IST

Andhra Pradesh News Live: Tadepalli RealEstate: తాడేపల్లి రియల్‌ ఎస్టేట్‌‌ మార్కెట్‌కు మళ్లీ మంచి రోజులు, ఐదేళ్ల తర్వాత ఊపందుకున్న లావాదేవీలు

  • Tadepalli RealEstate: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లుగా స్తబ్దుగా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లు పుంజుకుంటాయని అంతా ఎదురు చూస్తున్నారు.  ఈ క్రమంలో గుంటూరు జిల్లా తాడేపల్లి రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో మళ్లీ కదలిక మొదలైంది. విజయవాడ పక్కనే ఉండటంతో లావాదేవీలు ఊపందుకున్నాయి. 
పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202408:16 AM IST

Andhra Pradesh News Live: Vizianagaram : విజ‌య‌న‌గరం జిల్లాలో దారుణం.. యువ‌తిని అప‌హ‌రించి.. ఆపై అత్యాచారం

  • Vizianagaram : విజ‌య‌న‌గరం జిల్లాల్లో దారుణం జరిగింది. మ‌తిస్థిమితం లేని యువ‌తిని.. తెలిసివాడే అప‌హ‌రించి, ఆపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది. కుమార్తె క‌నిపించ‌టం లేద‌ని పోలీసుల‌ను ఆశ్ర‌యిస్తే.. నిర్ల‌క్ష్యంగా స‌మాధానం చెప్పారని త‌ల్లిదండ్రులు వాపోయారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202407:36 AM IST

Andhra Pradesh News Live: AP Loans : మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.50 వేల రాయితీతో రుణాలు.. పూర్తి వివరాలు ఇవే

  • AP Loans : మహిళల ఆర్థిక ప్రగతికి కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేయబోతోంది. రాయితీపై రుణాలు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. స్వయం ఉపాధి చేసుకునే మహిళలకు దన్నుగా నిలిచేందుకు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోంది. వచ్చే నెల నుంచి లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202407:27 AM IST

Andhra Pradesh News Live: Loco Pilot Murder: ఉపాధి కోసం వచ్చి ఉసురు తీశాడు, వీడిన విజయవాడ రైల్వే లోకో పైలట్‌ మర్డర్ మిస్టరీ

  • Loco Pilot Murder:విజయవాడ రైల్వే స్టేషన్‌లో జరిగిన లోకో పైలట్ మర్డర్ మిస్టరీ వీడింది. బీహార్‌ నుంచి ఉపాధి కోసం నగరానికి వచ్చిన వలస కార్మికుడు ఉపాధి దొరక్క డబ్బు కోసం హత్యకు పాల్పడినట్టు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202407:18 AM IST

Andhra Pradesh News Live: AP Sand Policy : ఏపీలో కొత్తగా 108 ఇసుక రీచ్ లు.. నేరుగా బుకింగ్ చేసుకునే అవకాశం - కీలక ఆదేశాలు

  • AP Sand Policy 2024: గనులు, భూగర్భ శాఖ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. డిమాండ్ కు తగిన స్థాయిలో ఇసుక సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 16వ తేదీ నుంచి 108 కొత్త ఇసుక రీచ్‌లు అందుబాటులో వస్తాయని ముఖ్యమంత్రి ప్రకటించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202406:39 AM IST

Andhra Pradesh News Live: Nuzvid IIIT : నూజివీడు ట్రిపుల్ ఐటీకి ఏమైంది.. ఓవైపు అధ్యాపకుల కొరత.. మరోవైపు నాసిరకం భోజనం!

  • Nuzvid IIIT : నూజివీడు ట్రిపుల్ ఐటీ.. ఏపీలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ. ఎంతో పేరున్న ఈ విద్యా సంస్థలో.. ఇప్పుడు ప్రమాణాలు పడిపోతున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అధ్యాపకుల కొరత, నాసిరకం ఆహారం వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202405:11 AM IST

Andhra Pradesh News Live: AP Wine Shop Tenders 2024 : ఏపీలో ఎక్కువ డిమాండ్ ఉన్న టాప్ 10 వైన్ షాప్స్ ఇవే.. ఒక్కో షాప్‌కు ఇన్ని దరఖాస్తులా!

  • AP Wine Shop Tenders 2024 : ఏపీలో వైన్ షాప్‌ల లైసెన్సుల కోసం దరఖాస్తులు భారీగా వచ్చాయి. శుక్రవారం సాయంత్రం 7 గంటల దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. ఆ సమయానికి 87 వేల 986 దరఖాస్తులు వచ్చాయి. రాత్రి 11 గంటలకు ఈ సంఖ్య 89 వేల 643కు చేరిందని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202403:45 AM IST

Andhra Pradesh News Live: Prakasam District : మ‌ళ్లీ ఆడ‌పిల్లే పుట్టింద‌ని అమానుషం.. త‌ల్లి, కుమార్తెల‌ను గ‌దిలో బంధించిన వ్య‌క్తి.. కుమార్తె మృతి

  • Prakasam District : ప్ర‌కాశం జిల్లాలో దారుణం జరిగింది. మ‌ళ్లీ ఆడ‌పిల్లే పుట్టింద‌ని అమానుషంగా వ్య‌వ‌హ‌రించాడు ఓ దుర్మార్గుడు. క‌న్న కూతురిని తండ్రే పొట్ట‌న పెట్టుకున్నాడు. త‌ల్లి, కుమార్తెల‌ను గ‌దిలో బంధించాడు. దీంతో అనారోగ్యంగా ఉన్న ప‌సికందు చికిత్స అంద‌క‌పోవ‌డంతో.. ప్రాణాలు విడిచింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202403:01 AM IST

Andhra Pradesh News Live: Eluru District : భర్త, కుమారులు మృతి...! జీర్ణించుకోలేక‌ ఆత్మ‌హ‌త్య చేసుకున్న భార్య‌

  • ఏలూరు జిల్లాలో విషాదం ఘ‌ట‌న చోటు చేసుకుంది. పందెం కోళ్ల‌కు ఈత నేర్పించే క్ర‌మంలో కాలువ‌లో జారి భర్త‌, ఇద్ద‌రు కుమారులు ఇటీవలే మృతి చెందారు. దీన్ని జీర్ణించుకోలేక‌ తాజాగా భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంది. వారు లేని ఈలోకంలో తానుండ‌లేన‌ని భావించి త‌నువు చాలించింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202402:14 AM IST

Andhra Pradesh News Live: AP Cabinet Meeting : ఈనెల 16న ఏపీ కేబినెట్ భేటీ - అజెండాలో కీలక అంశాలు..!

  • ఏపీ కేబినెట్ అక్టోబర్ 16వ తేదీన భేటీ కానుంది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. చెత్తపన్ను రద్దు, కొత్త మున్సిపాలిటీల్లో పోస్టుల భర్తీ, జ్యుడిషియల్‌ ప్రివ్యూ చట్టంతో పాటు సంబంధిత జీవోల వంటి మరికొన్ని  కీలక అంశాలపై చర్చించనుంది.
పూర్తి స్టోరీ చదవండి