Sathya Sai Crime : సత్యసాయి జిల్లా దారుణం, కత్తులతో బెదిరించి అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం
Sathya Sai Crime : శ్రీసత్య సాయి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. చిలమత్తూరు మండలంలో వాచ్‌మెన్, అతని కొడుకును నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో బెదిరించి అత్తాకోడళ్లపై అత్యాచారం చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రత్న స్పందిస్తూ... నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.
సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు...తండ్రి, కొడుకులను కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది.
కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన ఒక కుటుంబం ఉపాధి కోసం సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామానికి వలస వచ్చారు. ఈ కుటుంబంలోని నలుగురూ..ఓ నిర్మాణ భవనం వద్ద వాచ్ మెన్, ఇతర పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని నలుగురు దుండగులు రెండు బైక్ లపై వారి నివాసానికి వచ్చారు. తండ్రీ, కొడుకును కత్తులతో బెదిరించి అత్త, కోడలి సామూహిక అత్యాచారం చేశారు.
ఈ ఘటనపై బాధితులు చిలమత్తూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా... విషయం తెలుసుకున్న సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అత్యాచారానికి పాల్పడిన వారిని వెంటనే పట్టుకుంటామని, బాధితులకు హామీ ఇచ్చారు. ఈ ఘటనపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎస్పీ రత్నతో ఫోన్‌లో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకుని బాధ్యులను వెంటనే పట్టుకోవాలని, కఠిన శిక్షలు పడేలా చేయాలని ఆదేశించారు.
ఈ ఘటనపై మంత్రి సవిత సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఉపాధి కోసం వచ్చిన కుటుంబంపై ఇంతటి దారుణానికి పాల్పడడం క్షమించరాని నేరం అన్నారు. పండగ వేళ ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సవిత హామీ ఇచ్చారు.
కామంధులు రెచ్చిపోతున్నారు- వైసీపీ విమర్శలు
శ్రీసత్యసాయి జిల్లాలో దారుణం జరిగిందని వైసీపీ అధికార టీడీపీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బాలికలు, మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలో వాచ్‌మెన్, అతని కొడుకును నలుగురు కత్తులతో బెదిరించి అత్తాకోడళ్లపై అత్యాచారం చేశారని తెలిపింది. రాష్ట్రంలో కామాంధులు హెచ్చుమీరుతున్నా కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదా? ఇదేనా ఆడబిడ్డలకి మీరు కల్పించే రక్షణ అని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనితను ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా ప్రశ్నించింది.
విజయనగరంలో మరో దారుణం
విజయనగరం సమీపంలో గొట్లాం బైపాస్ వద్ద దారుణ ఘటన జరిగింది. విజయనగరం జిల్లా పాచిపెంట మండలానికి చెందిన పి.శ్రీధర్ (45) తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఓ కోళ్లఫారంలో పనిచేస్తున్నాడు. అక్కడే ఉంటున్న మతిస్థిమితం లేని ఓ యువతి(20)తో వీరి కుటుంబానికి పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు పని మానేసిన శ్రీధర్.. ఈనెల 3న ఆమెను విజయనగరం సమీపంలో గొట్లాం బైపాస్ వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆమె వద్దని ప్రతిఘటించడంతో ఇద్దరు మధ్య జరిగిన గొడవ జరిగింది. ఆమెకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో ఆమెతో పాటు ద్విచక్రవాహనాన్ని బైపాస్ రోడ్డుపై వదిలేసి పరారయ్యాడు. తమ కుమార్తెను శ్రీధర్ తీసుకెళ్లాడని, ఫోన్ చేస్తుంటే స్పందించట్లేదని అదే రోజు భీమిలి పోలీస్ స్టేషన్‌లో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో బాధితులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. మతిస్థిమితం లేని యువతిని గమనించిన గ్రామస్తులు విజయనగరం రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అమ్మాయి వివరాలేవీ చెప్పలేకపోవడంతో.. స్కూటీ నంబర్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు. దీంతో భీమిలి చిరునామా, యువతి తండ్రి ఫోన్ నంబర్ దొరికాయి. ఆయనకు ఫోన్ చేసి చెప్పగా తండ్రి వచ్చి కుమార్తెను తీసుకెళ్లారు.
యువతి శరీరంపై గాయాలను గుర్తించిన కుటుంబ సభ్యులు భీమిలి పోలీసులను ఆశ్రయించారు. విజయనగరం రూరల్ పోలీసులు నిందితుడిని పట్టుకున్నారని.. అక్కడికే వెళ్లాలని పోలీసులు చెప్పిటన్లు తెలుస్తోంది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో భీమిలి పోలీసులు వారం రోజుల తరువాత జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును విజయనగరం పోలీసులకు బదిలీ చేశారు.
సంబంధిత కథనం