Srivari Brahmotsavam 2024 : శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం- హుండీ ఆదాయం రూ.26 కోట్లు, 30 లక్షల లడ్డూలు విక్రయం
Srivari Brahmotsavam 2024 : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని టీటీడీ ఈవో జె.శ్యామలరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేశామన్నారు. 6 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 15 లక్షల మంది శ్రీవారి వాహన సేవలు వీక్షించారన్నారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు టీటీడీ ఈవో జె.శ్యామల రావు తెలిపారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఆసౌకర్యం కలుగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో సేవలందించిట్లు చెప్పారు. టీటీడీ ఏర్పాటు చేసిన సౌకర్యలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు.
శనివారం తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అక్టోబరు 4 నుంచి 11వ తేదీ వరకు (8 రోజులు) వరకు ముఖ్యాంశాలు
- అక్టోబరు 4న సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అక్టోబరు 5న పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక వైపున రూ. 13.45 కోట్లతో వకుళమాతా వంటశాలను ప్రారంభించారు.
- బ్రహ్మోత్సవాల్లో 6 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
- 15 లక్షల మంది భక్తులు శ్రీవారి వాహన సేవలు వీక్షించారు.
- గరుడసేవనాడు 82,043 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా, గరుడసేవలో దాదాపు 3.5 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు.
- బ్రహ్మోత్సవాల్లో 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉండగా, మొత్తం 30 లక్షల లడ్డూలు విక్రయించారు.
- హుండీ కానుకల ద్వారా రూ.26 కోట్ల ఆదాయం వచ్చింది.
- తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 2.60 లక్షలు
కల్యాణవేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శన నాడు -నేడు కాన్సెప్ట్‌తో ఫొటో ఎగ్జిబిషన్, అటవీ, శిల్ప కళాశాలలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లు భక్తుల ప్రశంసలు అందుకున్నాయి. తిరుమలలోని పలు ప్రాంతాల్లో దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లతోపాటు, 32 పెద్ద డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగు మాడ వీధులలో 23, ప్రధాన కూడళ్లలో 9, ప్రత్యేకంగా తిరుపతిలో 7 డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
- శ్రీవారి బ్రహ్మోత్సవాల 8 రోజుల్లో 26 లక్షల అన్నప్రసాదం, అల్పాహారం అందించారు.
- గరుడసేవ రోజున 8.71 లక్షల మందికి అన్నప్రసాదాలు, అల్పాహారం అందించారు. 3.47 లక్షల మందికి టీ, కాఫీ, పాలు, బాదం పాలు, 4 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 4 లక్షల తాగునీరు బాటిళ్లు, స్నాక్స్, బిస్కెట్లు అందించారు.
- హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 18 రాష్ట్రాల నుంచి వచ్చిన 261 కళాబృందాల్లో 6,884 మంది కళాకారులు తమ కళలను శ్రీవారి ముందు ప్రదర్శించారు. వాహన సేవలతో పాటు తిరుమల, తిరుపతిలో ప్రదర్శించిన కళాకృతులు భక్తులను విశేషంగా అకట్టుకున్నాయి.
ఉద్యానవన విభాగం
- బ్రహ్మోత్సవాలలో 40 టన్నులు పుష్పాలు, 3.50 లక్షల కట్ ఫ్లవర్స్, 80 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియోగించారు.
ఏపీఎస్ఆర్టీసీ
- 9.53 లక్షల మంది ఏపీఎస్ఆర్టీసీ ద్వారా తిరుమలకు రాకపోకలు సాగించారు.
- గరుడసేవనాడు ఆర్‌టీసీ బస్సులు తిరుపతి నుంచి తిరుమలకు 2,764 ట్రిప్పుల్లో 97,402 మంది భక్తులను చేరవేశాయి. తిరుమల నుంచి తిరుపతికి 2,711 ట్రిప్పుల్లో 89,181 మంది భక్తులను చేరవేశాయి.
సంబంధిత కథనం