Tirumala Brahmotsavam 2024 : శాస్త్రోక్తంగా తిరుమ‌లేశుని చక్రస్నానం - నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు-chakrasnanam at tirumala saw pilgrims taking a holy dip in the pushkarini annual brahmotsavams 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tirumala Brahmotsavam 2024 : శాస్త్రోక్తంగా తిరుమ‌లేశుని చక్రస్నానం - నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Tirumala Brahmotsavam 2024 : శాస్త్రోక్తంగా తిరుమ‌లేశుని చక్రస్నానం - నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Oct 12, 2024, 10:39 AM IST Maheshwaram Mahendra Chary
Oct 12, 2024, 10:39 AM , IST

  • Chakrasnanam at Tirumala: తిరుమలలో శనివారం ఉదయం వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు పుష్కరిణిలో అర్చకులు ఈ క్రతువును పూర్తిచేశారు. అనంతరం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఫొటోలు ఇక్కడ చూడండి….

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తొమ్మిది రోజుల పాటు జ‌రిగిన న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ముగిశాయి.

(1 / 5)

తెల్లవారుజామున 4 నుండి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు.

(2 / 5)

ఇందులో భాగంగా ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.

(3 / 5)

ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టీటీడీ వేదపారాయణదారులు పారాయణం చేశారు. 

(4 / 5)

తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై – లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికీ – చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక – యజ్ఞాంతంలో అవభృథస్నానం’ చేస్తారు. యజ్ఞనిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్నీ సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చేసే దీక్షాంతస్నానం అవభృథం. ఈ ఉత్సవాలు చేసినవారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ – అందరికీ ఈ ఉత్సవయజ్ఞఫలం లభిస్తుంది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు