Trains Information: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్, కడప మీదుగా వెళ్లే రైళ్లు పొడిగింపు
Trains Information: కడప మీదుగా రాకపోకల నిర్వహించే కాచిగూడ-మురడేశ్వర్ మధ్య రాకపోకలు నిర్వహించే రెండు వీక్లీ రైళ్లను పొడించారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో కాచిగూడ-మంగుళూరు ఎక్స్‌ప్రెస్ (12789) రైలు, మంగుళూరు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ (12790) రైలు మురడేశ్వర్ వరకు పొడిగించారు.

కడప మీదుగా రాకపోకల నిర్వహించే కాచిగూడ-మురడేశ్వర్ మధ్య రాకపోకలు నిర్వహించే రెండు వీక్లీ రైళ్లను పొడించారు. ఈ మేరకు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ ఎ. జనార్దన్ తెలిపారు.
కాచిగూడలో బయలుదేరే కాచిగూడ-మంగుళూరు ఎక్స్‌ప్రెస్ (12789) రైలు ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఉదయం 6.05 గంటలకు రైలు బయలుదేరి జడ్చర్ల, మహబూబ్‌నగర్, కర్నూలు మీదుగా కడపకు మధ్యాహ్నం 2.25 గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుంచి రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, కోయంబత్తూరు మీదుగా బుధ, శనివారాల్లో ఉదయం 9.30 గంటలకు మంగుళూరు చేరుకుంటుంది. మురడేశ్వర్‌కు మధ్యాహ్నం 2 గంటలకు వెళ్తుంది.
మురడేశ్వర్‌లో బయలుదేరే మంగుళూరు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ (12790) రైలు ప్రతి బుధ, శనివారాల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు (గురు, ఆదివారాల్లో) మధ్యాహ్నం కడపకు 1.55 గంటలకు చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 11.40 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.
విశాఖపట్నం-రాయ్‌పూర్ రైళ్ల సమయాలలో మార్పులు
విశాఖపట్నం-రాయ్‌పూర్ (08528) అక్టోబర్ 20 నుంచి అమలులోకి వస్తుంది. విశాఖపట్నంలో ఉదయం 4:25 గంటలకు బదులుగా ఉదయం 6:30 గంటలకు బయలుదేరుతుంది. సింహాచలం, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం సమయాల్లో మార్పు ఉంటుంది. రాయపూర్ రాత్రి 7.45 గంటలకు రాయ్‌పూర్ చేరుకుంటుంది. ప్రయాణికులు, రైలు వినియోగదారులు ఎన్‌టీఈఎస్ యాప్‌లోని పబ్లిక్ టైమ్ టేబుల్‌లోని మార్పులను గమనించవలసిందిగా అభ్యర్థించారు. గందరగోళాన్ని నివారించడానికి ప్రయాణం ప్రారంభించే ముందు ఏకీకృత నెంబర్ 139ని సంప్రదించవచ్చని మేనేజర్ కె.సందీప్ కోరారు.
జనరల్ క్లాస్ కోచ్‌లతో రైళ్ల పెంపు
పండుగ సీజన్‌లో వెయిట్‌లిస్ట్ ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి అదనపు కోచ్‌లతో రైళ్లను పెంచాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. విశాఖపట్నం-బ్రహ్మాపూర్ ఎక్స్‌ప్రెస్ (18526) రూలు రెండు జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్‌లతో అక్టోబర్ 16 వరకు పెంచారు. బ్రహ్మపూర్ - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (18525) రైలు రెండు జనరల్ కోచ్‌లతో సెకండ్ కోచ్‌లతో అక్టోబర్ 17 వరకు పెంచారు.
జగ్దల్పూర్-దంతెవాడా మధ్య నాలుగు జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు
ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి, ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని వాల్తేర్ డివిజన్ దంతేవార-జగ్దల్‌పూర్ మధ్య జనసధరణ ప్రత్యేక రైళ్లను అక్టోబర్ 14 వరకు నడపాలని నిర్ణయించింది. ఇది దంతేశ్వరి ఆలయాన్ని సందర్శించాలనుకునే వారికి, దసరా పండుగ సమయంలో రద్దీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
1. జనసాధారణ్ స్పెషల్ జగదల్పూర్ (08513) నుండి అక్టోబర్ 13 వరకు అందుబాటులో ఉంటుంది. జగదల్పూర్ నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరుతుంది. సాయంత్రం 5.30 గంటలకు దంతెవార చేరుకుంటుంది.
2. జనసాధారణ్ స్పెషల్ దంతేవాడ (08514) నుండి అక్టోబర్ 13 వరకు అందుబాటులో ఉంటుంది. దంతెవాడ నుండి సాయంత్రం 6 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 8.45 గంటలకు జగదల్పూర్ చేరుకుంటుంది.
3. జనసాధారణ్ స్పెషల్ జగదల్పూర్ (08515) నుండి అక్టోబర్ 13 వరకు అందుబాటులో ఉంటుంది. జగదల్పూర్ నుండి మధ్యాహ్నం రాత్రి 8 గంటలకు బయలుదేరుతుంది. అర్ధరాత్రి 12.45 గంటలకు దంతెవాడ చేరుకుంటుంది.
4. జనసాధారణ్ స్పెషల్ దంతెవాడ (08516) నుండి అక్టోబర్ 14 వరకు అందుబాటులో ఉంటుంది. దంతెవార నుండి ఉదయం 5 గంటలకు బయలుదేరుతుంది. ఉదయం 7.15 గంటలకు జగదల్పూర్ చేరుకుంటుంది.
5. జనసాధారణ్ స్పెషల్ జగదల్పూర్ (08511) నుండి అక్టోబర్ 14 వరకు అందుబాటులో ఉంటుంది. జగదల్పూర్ నుండి ఉదయం 8.15 గంటలకు బయలుదేరుతుంది. ఉదయం 11 గంటలకు దంతెవాడ చేరుకుంటుంది.
6. జనసాధారణ్ స్పెషల్ దంతెవాడ (08512) నుండి అక్టోబర్ 14 వరకు అందుబాటులో ఉంటుంది. దంతెవాడ నుండి ఉదయం 11.30 గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు జగదల్పూర్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లలో జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు ఉంటాయి. ప్రజలు ఈ ప్రత్యేక రైళ్లను వినియోగించుకుని సురక్షితమైన ప్రయాణాన్ని అనుసరించాలని వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ కోరారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు