AP DSC Notification 2024 : ఏపీ డీఎస్సీ అభ్యర్థుల బిగ్ అప్డేట్, నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల!-ap dsc notification 2024 releases on november online application process schedule posts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Dsc Notification 2024 : ఏపీ డీఎస్సీ అభ్యర్థుల బిగ్ అప్డేట్, నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల!

AP DSC Notification 2024 : ఏపీ డీఎస్సీ అభ్యర్థుల బిగ్ అప్డేట్, నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల!

Bandaru Satyaprasad HT Telugu
Oct 12, 2024 04:16 PM IST

AP DSC Notification 2024 : ఏపీ మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. నవంబర్ 3న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రాథమిక సమాచారం. న్యాయ వివాదాలు లేకుండా, పాత సిలబస్ తోనే డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఏపీ డీఎస్సీ అభ్యర్థుల బిగ్ అప్డేట్, నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల!
ఏపీ డీఎస్సీ అభ్యర్థుల బిగ్ అప్డేట్, నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల!

ఏపీలో మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ విడుదలకు ముహూర్తం ఖరారైంది. నవంబర్‌ 3న డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 16,347 టీచర్ పోస్టులకు నవంబర్ 3వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఏపీలో టెట్ పరీక్షలు జరుగుతున్నాయి. అక్టోబర్ 21తో టెట్ పరీక్షలు ముగుస్తాయి. అనంతరం నవంబర్ 2న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. టెట్ ఫలితాలు విడుదల చేసిన మరుసటి రోజే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

మూడు నెలల ప్రిపరేషన్ గ్యాప్

కూటమి ప్రభుత్వం ఏర్పడగానే...మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. ఇక మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని భావించినప్పటికీ, అభ్యర్థుల అభ్యర్థన మేరకు మరోసారి టెట్‌ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌ పరీక్షలు జరుగుతున్నాయి. డీఎస్సీ పరీక్షలకు సాధారణంగా న్యాయ వివాదాలు తలెత్తుతాయి. దీంతో ఎలాంటి న్యాయవివాదాలు లేకుండా పటిష్టంగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య ఎక్కువ సమయం ఉండాలని సూచించారు. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు టెట్‌, డీఎస్సీ పరీక్షల మధ్య మూడు నెలల ప్రిపరేషన్‌ గ్యాప్ ఉండాలని ఆదేశించారు.

పాత సిలబస్ తోనే

మెగా డీఎస్సీ-2024 సిలబస్ విషయంలో కొంత గందరగోళం ఏర్పడింది. సిలబస్‌ మారిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. గత నోటిఫికేషన్‌ ప్రకారమే డీఎస్సీ సిలబస్ ఉంటుందని, ఎలాంటి మార్పులు లేవని పేర్కొంది. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో(https://apdsc.apcfss.in/) లో చెక్‌ చేసుకోవాలని స్పష్టం చేసింది.

మెగా డీఎస్సీలో ఖాళీలు

  • మొత్తం పోస్టులు - 16,347
  • సెకండరీ గ్రేడ్ టీచర్లు - 6371 ఖాళీలు
  • స్కూల్ అసిస్టెంట్ లు- 7725 ఖాళీలు
  • ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ లు- 1781
  • పీఈటీలు- 132
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు- 286
  • ప్రిన్సిపల్ పోస్టులు - 52

ఏపీ టెట్ కీ విడుదల

ఏపీలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(AP TET) పరీక్షలు జరుగుతున్నాయి. అక్టోబర్ 3న ప్రారంభమైన పరీక్షలు, ఈ నెల 21వ తేదీ వరకు జరుగనున్నాయి. అక్టోబర్ 3, 4, 5 తేదీల్లో నిర్వహించిన టెట్ పరీక్షల ప్రాథమిక 'కీ' లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. మిగిలిన 'కీ'లు పరీక్ష జరిగిన తర్వాతి రోజున విడుదల చేయనున్నారు. టెట్ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. టెట్ పరీక్షలను ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. ప్రాథమిక కీ లపై త్వరలోనే అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అక్టోబర్‌ 27న టెట్ పరీక్షల తుది కీ విడుదల, నవంబర్‌ 2న టెట్ ఫలితాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ఏపీ టెట్ కీని డౌన్‌లోడ్ చేయడం ఎలా?

Step 1 : అభ్యర్థులు https://aptet.apcfss.in/ పై క్లిక్ చేయండి.

Step 2: హోం పేజీలోని 'Question Papers & Keys' ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

Step 3: మీ పరీక్ష తేదీ అనుగుణంగా ప్రాథమిక కీ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి.

Step 4: టెట్ ఎగ్జామ్ పేపర్, ఆన్సర్ కీని చెక్ చేసి డౌన్‌లోడ్ చేయండి.

Step 5 : భవిష్యత్ అవసరాల కోసం ఆన్సర్ కీ హార్డ్ కాపీని తీసుకోండి.

Whats_app_banner

సంబంధిత కథనం