AP TET Key : ఏపీ టెట్ ప్రాథమిక కీ విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి-ap tet 2024 primary keys released check download in aptet apcfss website ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet Key : ఏపీ టెట్ ప్రాథమిక కీ విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

AP TET Key : ఏపీ టెట్ ప్రాథమిక కీ విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

Bandaru Satyaprasad HT Telugu
Oct 06, 2024 02:37 PM IST

AP TET Key : ఏపీలో టెట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 3, 4 తేదీల్లో జరిగిన టెట్ పరీక్షల కీ లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. పరీక్ష జరిగిన తర్వాతి రోజున టెట్ కీ లను విడుదల చేస్తున్నారు. త్వరలోనే ప్రాథమిక కీ లపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు.

ఏపీ టెట్ ప్రాథమిక కీ విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
ఏపీ టెట్ ప్రాథమిక కీ విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

ఏపీలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(AP TET) పరీక్షలు జరుగుతున్నాయి. అక్టోబర్ 3న ప్రారంభమైన పరీక్షలు, ఈ నెల 21వ తేదీ వరకు జరుగనున్నాయి. అక్టోబర్ 3, 4 తేదీల్లో నిర్వహించిన టెట్ పరీక్షల ప్రాథమిక 'కీ' లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. మిగిలిన 'కీ'లు పరీక్ష జరిగిన తర్వాతి రోజున విడుదల చేయనున్నారు. టెట్ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు.

టెట్ పరీక్షలను ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ప్రాథమిక కీ లపై త్వరలోనే అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అక్టోబర్‌ 27న టెట్ పరీక్షల తుది కీ విడుదల చేయనున్నారు. అలాగే నవంబర్‌ 2న టెట్ ఫలితాలు ప్రకటించనున్నారు.

ఏపీ టెట్ కీని డౌన్‌లోడ్ చేయడం ఎలా?

  • Step 1 : అభ్యర్థులు https://aptet.apcfss.in/ పై క్లిక్ చేయండి.
  • Step 2: హోం పేజీలోని 'Question Papers & Keys' ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • Step 3: మీ పరీక్ష తేదీ అనుగుణంగా ప్రాథమిక కీ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • Step 4: టెట్ ఎగ్జామ్ పేపర్, ఆన్సర్ కీని చెక్ చేసి డౌన్‌లోడ్ చేయండి.

భవిష్యత్ అవసరాల కోసం ఆన్సర్ కీ హార్డ్ కాపీని తీసుకోండి. అభ్యర్థులు తగిన రుసుము చెల్లించి ప్రాథమిక కీ పై అభ్యంతరాలు తెలియజేయవచ్చు. త్వరలోనే ఆ ఆప్షన్ యాక్టివేట్ కానుంది. టెట్ పరీక్షలు రెండు షిఫ్టులలో జరుగుతున్నారు. ఉదయం షిఫ్టు 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్ట్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:00 గంటలకు ముగుస్తుంది. టెట్ లో పేపర్లు 1, 2 ఉన్నాయి. టెట్ పరీక్షను తెలుగు, కన్నడ, తమిళం, ఒడియా, హిందీ, ఉర్దూ... ఇలా ఆరు భాషలలో నిర్వహిస్తున్నారు.

ఏపీ టెట్ పరీక్షలు అక్టోబర్ 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే అక్టోబర్‌ 3, 4, 5 తేదీలు పరీక్షలు పూర్తయ్యాయి.

  • అక్టోబర్ 6న సెకండరీ గ్రేడ్ టీచర్‌ 1ఏ , 1బీ పరీక్షలు జరుగుతాయి. మధ్యాహ్నం 1ఏ పరీక్షను నిర్వహిస్తారు.
  • అక్టోబర్ 7, 8, 9, 10 తేదీలలో రెండు సెషన్లలో ఎస్జీటీ పేపర్ 1ఏ పరీక్షలు జరుగతాయి.
  • అక్టోబర్ 11, 12 తేదీలలో సెలవులు
  • అక్టోబర్ 13న ఉదయం సెషన్‌లో ఎస్జీటీ పేపర్‌ 1ఏ, మధ్యాహ్నం ఎస్జీటీ 1ఏ తెలుగు, హిందీ, కన్నడ, ఒరియా, తమిళ్, సంస్కృతం పరీక్షలు నిర్వహిస్తారు.
  • అక్టోబర్‌ 14న ఎస్జీటీ 1ఏ తెలుగు, మధ్యాహ్నం పేపర్‌ 2ఏ మ్యాథ్స్, సైన్స్‌ పరీక్షలు జరుగుతాయి.
  • అక్టోబర్ 15న ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పేపర్ 2ఏ మ్యాథ్స్‌, సైన్స్‌ పరీక్షలు నిర్వహిస్తారు.
  • అక్టోబర్ 16వ తేదీ ఉదయం పేపర్‌ 2ఏ మ్యాథమెటిక్స్‌, మధ్యాహ్నం పేపర్‌ 2ఏ తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళ్, ఇంగ్లీష్‌ పరీక్షలు నిర్వహిస్తారు.
  • అక్టోబర్ 17వ తేదీన రెండు సెషన్లలో పేపర్ 2ఏలో మ్యాథ్స్‌, సైన్స్‌ పరీక్షలు జరుగుతాయి.
  • అక్టోబర్ 18న పేపర్ 2ఏ ఉదయం సెషన్‌లో మ్యాథ్స్‌, మధ్యాహ్నం సోషల్ పరీక్షలు జరుగుతాయి. 19వ తేదీన ఉదయం, సాయంత్రం పేపర్ 2ఏ సోషల్ పరీక్షలు నిర్వహిస్తారు.
  • అక్టోబర్ 20న పేపర్‌ 2ఏ తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, ఒరియా, తమిళ్, ఇంగ్లీష్‌, మధ్యాహ్నం సెషన్‌లో సోషల్ పరీక్షలు నిర్వహిస్తారు.
  • అక్టోబర్‌ 21వ తేదీ ఉదయం సోషల్‌ పరీక్షను మధ్యాహ్నం పేపర్ 2బి పరీక్షను నిర్వహిస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం