CBN Tributes to Tata: ముంబై బయలుదేరిన చంద్రబాబు, లోకేష్‌.. ఏపీ క్యాబినెట్ వాయిదా, టాటాకు నివాళులు అర్పించిన క్యాబినెట్-chandrababu lokesh left for mumbai ap cabinet paid tributes to ratan tata ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Cbn Tributes To Tata: ముంబై బయలుదేరిన చంద్రబాబు, లోకేష్‌.. ఏపీ క్యాబినెట్ వాయిదా, టాటాకు నివాళులు అర్పించిన క్యాబినెట్

CBN Tributes to Tata: ముంబై బయలుదేరిన చంద్రబాబు, లోకేష్‌.. ఏపీ క్యాబినెట్ వాయిదా, టాటాకు నివాళులు అర్పించిన క్యాబినెట్

Published Oct 10, 2024 12:58 PM IST Bolleddu Sarath Chandra
Published Oct 10, 2024 12:58 PM IST

  • CBN Tributes to Tata:  దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా మృతికి ఏపీ క్యాబినెట్ సంతాపం తెలిపింది.  రతన్ టాటా మృతికి సంతాపంగా క్యాబినెట్ రెండు నిముషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించింది. రతన్ టాటా చిత్ర పటానికి పూలు వేసి ముఖ్యమంత్రి, మంత్రులు నివాళులు అర్పించారు. 

భారత పారిశ్రామిక రంగానికి దశ దిశ చూపించి నవతరం పారిశ్రామిక వేత్తలకు ఆదర్శప్రాయులైన గొప్ప వ్యక్తి రతన్ టాటా అని ఏపీ క్యాబినెట్‌ మంత్రులు కొనియాడారు. పారిశ్రామిక రంగానికి మానవత్వం జోడించి పేద ప్రజల సంక్షేమాన్ని ఆలోచించిన మానవతావాది రతన్ టాటా అని కీర్తించారు.  దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని ఆజన్మాంతం ఆచరించిన మహనీయుడని పేర్కొన్నారు.

(1 / 7)

భారత పారిశ్రామిక రంగానికి దశ దిశ చూపించి నవతరం పారిశ్రామిక వేత్తలకు ఆదర్శప్రాయులైన గొప్ప వ్యక్తి రతన్ టాటా అని ఏపీ క్యాబినెట్‌ మంత్రులు కొనియాడారు. 

పారిశ్రామిక రంగానికి మానవత్వం జోడించి పేద ప్రజల సంక్షేమాన్ని ఆలోచించిన మానవతావాది రతన్ టాటా అని కీర్తించారు.  దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని ఆజన్మాంతం ఆచరించిన మహనీయుడని పేర్కొన్నారు.

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్‌ టాటాకు ఏపీ క్యాబినెట్‌ ఘనంగా నివాళులు అర్పించింది.  టాటాకు సంతాప సూచకంగా  క్యాబినెట్‌ సమావేశాన్ని వాయిదా వేశారు. అజెండా అంశాలను చర్చించకుండానే క్యాబినెట్ వాయిదా వేశారు. అనంతరం రతన్‌టాటాకు నివాళులు అర్పించారు. 

(2 / 7)

ఏపీ క్యాబినెట్ సమావేశంలో రతన్‌ టాటాకు నివాళులు అర్పిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి వర్గ సహచరులు, టాటాకు నివాళులు అర్పించేందుకు సీఎం చంద్రబాబు, లోకేష్‌ ముంబైకు పయనం అయ్యారు. 

(3 / 7)

కోట్ల మంది ప్రజల హృదయాల్లో రతన్ టాటా  జీవించే ఉంటారని ఏపీ మంత్రులు కొనియాడారు. కార్పొరేట్ రంగంలో వృద్ధి చెందుతూనే సామాన్యుల సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ఆకాంక్షించిన మహోన్నత మానవతా వాదిగా కీర్తించారు.  ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా నాడు హైదరాబాద్ లో చంద్రబాబు  కృషితో TCS ఏర్పాటు చేసి ఎంతో మంది యువతకు మంచి భవిష్యత్తు అందించారని మంత్రులు గుర్తు చేసుకున్నారు. 

(4 / 7)

తిరుపతిలో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించిన రతన్ టాటా,  విపత్తు సమయాల్లో కూడా మన రాష్ట్రానికి ఎంతో మేలు చేశారని మంత్రి అచ్చన్నాయుడు గుర్తు చేసుకున్నారు.  చంద్రబాబు  అభ్యర్థన మేరకు విశాఖలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేస్తామని  టాటా గ్రూప్ నిన్ననే ప్రకటించిందని,  కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిన రతన్ టాటా గారు మంచి మనస్సున్న స్ఫూర్తిదాయక పారిశ్రామికవేత్తగా మంత్రులు కొనియాడారు. 

(5 / 7)

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా మృతికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. రతన్‌ టాటాకు నివాళులు అర్పించేందుకు  ముంబై బయలుదేరి వెళ్లారు. 

(6 / 7)

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఆకస్మిక మృతి పట్ల గురువారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నివాళులు అర్పించింది.

(7 / 7)

ఇతర గ్యాలరీలు