AP TET 2024 Alert: ఏపీ టెట్‌ 2024 పరీక్షకు హాజరవుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి…-guidelines for andhra pradesh tet 2024 applications ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet 2024 Alert: ఏపీ టెట్‌ 2024 పరీక్షకు హాజరవుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి…

AP TET 2024 Alert: ఏపీ టెట్‌ 2024 పరీక్షకు హాజరవుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి…

Sarath chandra.B HT Telugu
Jul 17, 2024 08:09 AM IST

AP TET 2024 Alert: ఏపీలో మెగా డిఎస్సీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎక్కువమంది అభ్యర్థులకు అవకాశం కల్పించేందుకు మరో టెట్‌ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో టెట్ దరఖాస్తు చేసేపుడు వీటిని మరువకండి.

టెట్ దరఖాస్తు చేసేపుడు ఇవి మరువకండి...
టెట్ దరఖాస్తు చేసేపుడు ఇవి మరువకండి...

AP TET 2024 Alert: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మెగా డిఎస్సీని ప్రకటించింది. ఎన్నికల హామీల్లో డిఎస్సీ నిర్వహణపై సిఎం తొలిసంతకాలు చేశారు. డిఎస్సీ ఉద్యోగాలకు వీలైనంత ఎక్కువ మందికి అవకాశాన్ని కల్పించేందుకు టెట్‌ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో టెట్ దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు పొరపాట్లు చేయొద్దని పాఠశాల విద్యాశాఖ సూచనలు చేసింది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరీక్షకు హాజరయ్య ే అభ్యర్థులు దరఖాస్తు నింపే సమయంలో కింది జాగ్రత్తలు తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పలు సూచనలు చేశారు.

• దరఖాస్తు నింపడానికి ముందుగా అభ్యర్థి ముందుగా ap tet 2024 వెబ్‌సైట్‌ https://aptet.apcfss.in లో మాత్రమే లాగిన్ కావాల్సి ఉంటుంది.

• అభ్యర్థులు నోటిఫికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ బులెటిన్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. తరువాత వాటిని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి.

• అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, దరఖాస్తు చేస్తున్న పేపరు, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్, వివరాలతో పేమెంట్ గేట్ వే ద్వారా నిర్దేశిత ఫీజు చెల్లించాలి.

• అభ్యర్థికి కేటాయించబడిన క్యాండిడేట్ ఐడితో క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్లి దరఖాస్తు లోని అన్ని వివరాలను పూర్తి సమాచారంతో అప్లికేషన్‌లో నింపి పూర్తి చేసుకోవాలి.

• దరఖాస్తును ప్రివ్యూ చూసుకొని ప్రింట్ అవుట్ తీసుకొని వివరాలు అన్నీ సరిగా ఉన్నాయో లేదో పరిశీలించుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాలి

• దరఖాస్తు నింపే సమయంలో ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద తెలిపిన హెల్ప్ డెస్క్ నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది. (9505619127, 8121947387, 8125046997, 9398822554, 7995649286, 7995789286, 9963069286, 9398810958, 9398822618)

• అదేవిధంగా అభ్యర్థులు తమ సందేహాలను కింది మెయిల్ ఐడి కి grivances.tet.@apschooledu.in మెయిల్ చేసి కూడా సమాచారం తెలుసుకోవచ్చు.

• దరఖాస్తు నింపేటప్పుడు ఏవైనా తప్పులు వున్నట్లైతే అభ్యర్థులు కాండిడేట్ లాగిన్ లో డిలీట్ ఆప్షన్ ఉపయోగించుకుని తిరిగి దరఖాస్తును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Whats_app_banner