AP Sand Policy : ఏపీలో కొత్తగా 108 ఇసుక రీచ్ లు.. నేరుగా బుకింగ్ చేసుకునే అవకాశం - కీలక ఆదేశాలు-ap cm chandrababu review on mines and sand policy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Sand Policy : ఏపీలో కొత్తగా 108 ఇసుక రీచ్ లు.. నేరుగా బుకింగ్ చేసుకునే అవకాశం - కీలక ఆదేశాలు

AP Sand Policy : ఏపీలో కొత్తగా 108 ఇసుక రీచ్ లు.. నేరుగా బుకింగ్ చేసుకునే అవకాశం - కీలక ఆదేశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 12, 2024 01:18 PM IST

AP Sand Policy 2024: గనులు, భూగర్భ శాఖ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. డిమాండ్ కు తగిన స్థాయిలో ఇసుక సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 16వ తేదీ నుంచి 108 కొత్త ఇసుక రీచ్‌లు అందుబాటులో వస్తాయని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఇసుక పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఇసుక పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష

డిమాండ్ కు తగిన స్థాయిలో ఇసుక సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శనివారం గనులు, భూగర్భ శాఖ పై సమీక్షించిన ఆయన… అక్టోబర్ 16వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇసుక సరఫరా కోసం 108 కొత్త ఇసుక రీచ్‌లు అందుబాటులో వస్తాయని ప్రకటించారు. మొత్తం 70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగి ఉంటుందని పేర్కొన్నారు.

నేరుగా బుకింగ్…

 ఈ రీచ్‌ ల ద్వారా రోజూ 80,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆన్ లైన్ పోర్టల్ తో పాటు రీచ్‌ల వద్ద నేరుగా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. చెకింగ్, GPS ట్రాకింగ్, ఆడిట్ ల ద్వారా బ్లాక్ మార్కెటింగ్‌ జరగకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పాలసీని పూర్తిగా మారుస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్దిరోజుల్లోనే కొత్త పాలసీని తీసుకొచ్చింది. అయితే ఇసుక పాలసీ అమల్లో లోపాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.  కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లో తక్కువ ధరలోనే లభ్యమయ్యేది. వర్షాకాలం ఉండటంతో ఇసుక ధరలు అంతగా ఉన్నాయని జనం సర్దుకుపోయారు. 

రీచ్‌లు అమలులోకి వస్తే కొరత తీరుతుందని ఆశించారు. ఇప్పటికీ రీచ్‌లు అందుబాటులోకి రాలేదు. నిల్వల వద్ద సక్రమంగా ఇసుక సరఫరా చేసే చర్యలు తీసుకోలేకపోతున్నారు.  దీంతో ధరలు కూడా భారీగా పెరిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ఇసుక రీచ్ లు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. పెద్ద మొత్తంలో ఇసుక లభ్యం కావాల్సిన అవసరం ఉండటంతో.. ఆ దిశగా అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు భవన నిర్మాణ రంగంపై కూడా ఇసుక కొరత ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలోనే… ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష జరిపారు. అక్టోబర్ 16వ తేదీ నుంచి ఇసుక సరఫరా కోసం 108 కొత్త ఇసుక రీచ్‌లు అందుబాటులో వస్తాయని ప్రకటించారు. మొత్తం 70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగి ఉంటుందని వివరించారు.

 

Whats_app_banner