
(1 / 5)
సామాన్యులకు ఇసుక కావాలంటే బ్లాక్‌లో కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. బ్లాక్‌లో ఇసుకకు వేలల్లో వసూలు చేస్తున్నారు. గతం కంటే ఎక్కువ ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. దీంతో శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ, మండలాల్లోనూ ఆందోళనలు జరిగాయి. ఉచిత ఇసుక అమలు చేయాలని, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.

(2 / 5)
రాష్ట్రంలో ఉచిత ఇసుక ఏమోగాని.. గతం కంటే ఇసుక ఖరీదైపోయిందని సీపీఎం ఆరోపిస్తోంది. బ్లాక్ మార్కెట్లోనే ఇసుక దొరుకుతోందని.. దీనికి వేలల్లో వెచ్చించాల్సి వస్తోందని అంటున్నారు. సామాన్యులకు ఇది కష్టంగానూ, భారంగానూ మారిందని.. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఇసుక గతం కంటే చాలా ఖరీదు అయిందని సీపీఎం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

(3 / 5)
గోదావరి నదికి సమీపంలో ఉండే కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో ఒక ట్రాక్టర్ (నాలుగు టన్నులు) గత ప్రభుత్వ హయంలో రూ.2,400 (టన్ను ఇసుక రూ.600) ఉంటే, ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక దాదాపు రూ.ఏడు వేలు అయింది. అందుకు కారణం బ్లాక్ మార్కెట్. బ్లాక్ మార్కెట్లలో ట్రాక్టర్ ఇసుక రూ.7 వేల అవుతోంది.

(4 / 5)
ప్రభుత్వ స్టాక్ పాయింట్ల వద్ద ఇసుకు లేకపోతే, బ్లాక్ మార్కెట్‌లోకి ఇసుక ఎలా వస్తుందని సీపీఎం నేత నీలపాల సూరిబాబు ప్రశ్నించారు. మరోవైపు ఇసుక అక్రమ రవాణా అవుతోందని ఆరోపించారు.

(5 / 5)
ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణ చేస్తున్న వాహనాలు పట్టుబడుతున్నాయని సీపీఎం నేతలు చెబుతున్నారు. ప్రతి రోజు ఏదో ఒక జిల్లాలో, ఏదో ఒక మండలంలో ఇసుక అక్రమ రవాణా చేసే వాహనాలు పట్టుబడుతున్నాయి. వీటికి వ్యతిరేకంగా సీపీఎం పోరాడుతోందని.. నేతలు స్పష్టం చేశారు.
ఇతర గ్యాలరీలు