Andhra Pradesh News Live October 10, 2024: Edible Oil Prices: ఏపీలో రిఫైండ్ ఆయిల్‌ రూ.124, పామాయిల్ రూ.110కే విక్రయం, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అమలు…-today andhra pradesh news latest updates october 10 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live October 10, 2024: Edible Oil Prices: ఏపీలో రిఫైండ్ ఆయిల్‌ రూ.124, పామాయిల్ రూ.110కే విక్రయం, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అమలు…

Edible Oil Prices: ఏపీలో రిఫైండ్ ఆయిల్‌ రూ.124, పామాయిల్ రూ.110కే విక్రయం, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అమలు…

Andhra Pradesh News Live October 10, 2024: Edible Oil Prices: ఏపీలో రిఫైండ్ ఆయిల్‌ రూ.124, పామాయిల్ రూ.110కే విక్రయం, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అమలు…

03:06 PM ISTOct 10, 2024 08:36 PM HT Telugu Desk
  • Share on Facebook
03:06 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 10 Oct 202403:06 PM IST

Andhra Pradesh News Live: Edible Oil Prices: ఏపీలో రిఫైండ్ ఆయిల్‌ రూ.124, పామాయిల్ రూ.110కే విక్రయం, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అమలు…

  • Edible Oil Prices: ఏపీలో వంట నూనెల ధరల నియంత్రణకు సర్కారు చర్యలు చేపట్టింది.  రిఫైండ్ ఆయిల్‌, పామాయిల్ ధరలపై  గరిష్ట ధరల్ని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన ధరలతో విక్రయించాలని వ్యాపారులను మంత్రి నాదెండ్ల ఆదేశించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 10 Oct 202402:11 PM IST

Andhra Pradesh News Live: Sadaram Slots: సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం...అక్టోబర్ 14 నుంచి ఎంపిక చేసిన ఆసుప‌త్రిల్లో వైద్య ప‌రీక్ష‌లు

  • Sadaram Slots: రాష్ట్రంలో స‌ద‌రం స‌ర్టిఫికేట్ కోసం స్లాట్ బుకింగ్ ప్రారంభం అయింది. అక్టోబ‌ర్ 14 నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు రాష్ట్రంలో ఎంపిక చేసిన ఆసుప‌త్రుల్లో వైద్య ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి. మీసేవ‌, గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో స‌ద‌రం స్లాట్ బుక్ చేసుకోవ‌చ్చు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 10 Oct 202401:18 PM IST

Andhra Pradesh News Live: KGBV Applications: కేజీబీవీల్లో కాంట్రాక్టు ఉద్యోగ దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు

  • KGBV Applications: ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ- పాఠశాల విద్యాశాఖ ద్వారా నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో ఖాళీగా ఉన్న బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి దరఖాస్తు తేదీని పొడిగించారు. బోధనేతర సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 10 Oct 202412:56 PM IST

Andhra Pradesh News Live: AP Temples: ఆల‌యాల్లో వైదిక‌, ఆగ‌మ విష‌యాల్లో స్వ‌యం ప్ర‌తిప‌త్తి...ఈవోల‌ జోక్యం తగదని ప్రభుత్వ ఉత్తర్వులు..

  • AP Temples: రాష్ట్రంలో దేవాల‌యాల‌కు వైదిక‌, ఆగ‌మ విష‌యాల్లో స్వ‌యం ప్ర‌తిప‌త్తి రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ల్పించింది. ఆలయ సంప్రదాయాలు, ఆగమ, వైదిక వ్యవహారాల్లో ఉన్నతాధికారులు, ఈవోలు జోక్యం ఉండ‌కూడ‌దని స్ప‌ష్టం చేసింది.ప్ర‌తి ఆల‌యానిక వైదిక క‌మిటీ నియ‌మించి కీలక అంశాల్లో కమిటీ సూచనలు పాటించాల‌ని పేర్కొంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 10 Oct 202412:25 PM IST

Andhra Pradesh News Live: AP School Education : ప్ర‌ధానోపాధ్యాయుల‌కు లీడ‌ర్‌షిప్ ట్రైనింగ్‌.. అక్టోబ‌ర్ 14 నుంచి 19 వ‌ర‌కు ఏలూరులో శిక్ష‌ణ‌

  • AP School Education : రాష్ట్రంలో ప్ర‌ధానోపాధ్యాయుల‌కు లీడ‌ర్‌షిప్ ట్రైనింగ్ నిర్వ‌హించనున్నారు. అక్టోబ‌ర్ 14 నుంచి 19 వ‌ర‌కు ఏలూరు జిల్లాలో ఈ శిక్ష‌ణ ఇస్తారు. ఈ మేర‌కు సమగ్ర శిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్.. బి.శ్రీనివాసరావు ఉత్త‌ర్వులు జారీ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 10 Oct 202411:21 AM IST

Andhra Pradesh News Live: Vijayawada Names: చారిత్రక శాసనాల్లో విజయవాడకు ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా… లిస్ట్‌ ఇదిగో చూడండి..

  • Vijayawada Names: చారిత్రకంగా  నదీతీరాల్లో విలసిల్లిన నగరాల్లో విజయవాడ ఒకటి. అందుబాటులో ఉన్న శాసనాల్లో శాతవాహనుల కాలం నుంచి విజయవాడ ప్రస్తావన చరిత్రలో ఉంది. కృష్ణానదికి ఉత్తరం వైపున ఉన్న విజయవాడ నగరం ప్రస్తావన అనే శాసనాల్లో వెలుగు చూసింది. చరిత్రలో  కృష్ణానదీ తీర నగరానికి అనేక పేర్లు ఉన్నాయి. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 10 Oct 202410:32 AM IST

Andhra Pradesh News Live: DurgaDevi: దుర్గ‌తుల‌ను నివారించే మ‌హాశ‌క్తి స్వ‌రూపం దుర్గాదేవి... అష్టమి రోజు అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

  • DurgaDevi: దసరా శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా 8వ రోజైన నిజ ఆశ్వ‌యుజ శుద్ధ అష్ట‌మి సంద‌ర్భంగా గురువారం నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ శ్రీదుర్గాదేవిగా ద‌ర్శ‌న‌మిస్తుంది. అష్ట‌మి నాడు దుర్గాదేవిగా భ‌క్తుల‌ను సాక్షాత్కారిస్తున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 10 Oct 202410:31 AM IST

Andhra Pradesh News Live: AP Wine Shop Tenders 2024 : వైన్ షాపుల డ్రా ఎలా తీస్తారు.. ఎలా కేటాయిస్తారు.. ముఖ్యమైన 10 అంశాలు ఇవే

  • AP Wine Shop Tenders 2024 : ఏపీ మద్యం షాపులను దక్కించుకోవడానికి చాలామంది ముందుకొస్తున్నారు. ఇప్పటికే భారీగా దరఖాస్తులు వచ్చాయి. అప్లై చేయడానికి ఇంకా సమయం ఉంది. మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అసలు లాటరీ ఎలా తీస్తారు.. షాపులు ఎలా కేటాయిస్తారో ఓసారి చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 10 Oct 202409:21 AM IST

Andhra Pradesh News Live: AP Property Tax: ఏపీలో నాలుగేళ్లలో 75శాతం పెరిగిన ఆస్తి పన్నులు, కాంపౌండ్ వసూళ్లు ఆపాలని జనం డిమాండ్..

  • AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను లెక్కింపు విధానాన్ని ఆస్తి కేపిటల్ విలువ ఆధారంగా లెక్కించే పద్ధతికి మార్చడంతో నాలుగేళ్లలో దాదాపు 75శాతం పన్నులు పెరిగాయి. వైసీపీ ప్రభుత్వం చేసిన చట్ట సవరణ రద్దు చేసి, ఆస్తి పన్ను ఏటా 15 శాతం చొప్పున కాంపౌండింగ్ తొలగించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.  
పూర్తి స్టోరీ చదవండి

Thu, 10 Oct 202407:45 AM IST

Andhra Pradesh News Live: Social Media Politics: సోషల్ మీడియా పాలిటిక్స్‌ ముద్దు, పబ్లిక్ పాలిటిక్స్‌ వద్దు.. వైసీపీ వ్యూహం అదేనా?

  • Social Media Politics: ఏపీలో మళ్ళీ సోషల్ మీడియా పాలిటిక్స్‌ మొదలయ్యాయి..ఎన్నికల్లో గెలిచిన మూడు నెలల్లోనే ఎన్డీఏ కూటమి పార్టీలకి సోషల్‌ మీడియా నీడలతో యుద్ధం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష వైసీపీ సోషల్ మీడియాలో చెలరేగిపోతోంది.వైసీపీ ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో అధికార పార్టీ వెనకబడింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 10 Oct 202407:33 AM IST

Andhra Pradesh News Live: AP SSC Exams 2025 : వారికి మాత్రమే పాత సిలబస్..! ఈ ఏడాది పది విద్యార్థులకు కొత్త సిల‌బ‌స్ ప్ర‌కార‌మే ప‌రీక్ష‌లు

  • ఏపీ పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ‌త మూడేళ్ల విద్యార్థుల‌కు పాత సిల‌బ‌స్‌తోనే ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ ఏడాది విద్యార్థుల‌కు మాత్రం కొత్త సిల‌బ‌స్ ప్ర‌కార‌మే ప‌రీక్ష‌లు ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు పరీక్ష విభాగం వివరాలను వెల్లడించింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 10 Oct 202407:08 AM IST

Andhra Pradesh News Live: Pawan Kalyan : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్.. రూ.60 లక్షలు విరాళం

  • Pawan Kalyan : ఇటీవల రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మైసూరవారిపల్లి గ్రామానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. అప్పుడు అక్కడి ప్రజలు.. తమ పాఠశాలలో క్రీడా మైదానం లేదని చెప్పారు. దీంతో తాను క్రీడా మైదానానికి కావాల్సిన నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం రూ.60 లక్షలు ఆ గ్రామస్తులకు అందజేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 10 Oct 202405:13 AM IST

Andhra Pradesh News Live: Palnadu : పల్నాడు జిల్లాలో బ్యాంక్ మేనేజర్ బాగోతం.. ఐసీఐసీఐ బ్యాంక్‌లో నిధుల గోల్‌మాల్

  • Palnadu : ప‌ల్నాడు జిల్లాలోని చిల‌క‌లూరిపేట‌, న‌ర‌స‌రావుపేట ఐసీఐసీఐ బ్యాంకుల్లో మేనేజ‌రే అవ‌క‌త‌వ‌క‌లకు పాల్ప‌డ్డాడు. కోట్లాది రూపాయలు మోసం చేశాడు. అధిక వడ్డీల పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయించి.. సొంత ఖాతాల్లోకి మ‌ళ్లించుకున్నాడు. ఈ కేసును సీఐడీకి అప్ప‌గించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 10 Oct 202404:36 AM IST

Andhra Pradesh News Live: West Godavari : ఐదు నెల‌లుగా అత్యాచారం...! గ‌ర్భం దాల్చిన బాలిక‌

  • ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఘోరం వెలుగు చూసింది. 5 నెల‌లుగా ఓ యువకుడు బాలిక‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు.  బాలిక గ‌ర్భం దాల్చటంతో విషయం బయటికి వచ్చింది. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని బాధిత కుటుంబం ఆరోపించింది. దెందులూరు ఎమ్మెల్యే ద్వారా ఐజీని కలిసి ఫిర్యాదు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 10 Oct 202402:34 AM IST

Andhra Pradesh News Live: Govt Jobs 2024 : ఏపీ 'నిట్'లో 125 ఉద్యోగాలు - ఆన్ లైన్ దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు..!

  • NIT Andhrapradesh Recruitment 2024 : ఏపీలోని నిట్(NIT) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 125 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ఇవాళ్టితో(అక్టోబరు 10) పూర్తి కానుంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 10 Oct 202401:37 AM IST

Andhra Pradesh News Live: AP Cabinet Meeting : ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ - చర్చించే కీలక అంశాలివే...!

  • ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. చెత్తపన్ను రద్దు, కొత్త మున్సిపాలిటీల్లో పోస్టుల భర్తీ, రేషన్ కార్డుల జారీతో పాటు మరికొన్ని  కీలక అంశాలపై చర్చించనుంది. 
పూర్తి స్టోరీ చదవండి