West Godavari : ఐదు నెలలుగా అత్యాచారం...! గర్భం దాల్చిన బాలిక
పశ్చిమగోదావరి జిల్లాలో ఘోరం వెలుగు చూసింది. 5 నెలలుగా ఓ యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చటంతో విషయం బయటికి వచ్చింది. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని బాధిత కుటుంబం ఆరోపించింది. దెందులూరు ఎమ్మెల్యే ద్వారా ఐజీని కలిసి ఫిర్యాదు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. అభంశుభం తెలియన ఓ బాలికపై ఐదు నెలలుగా వ్యక్తి అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. అయితే బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకో లేదు. దీంతో ఈ విషయాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి బాధిత కుటుంబ తీసుకెళ్లింది.
ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పి ద్వారకా తిరుమల మండలం మల్లసానికుంటకు చెందిన యువకుడు మాయ మాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ప్రస్తుతం బాలిక ఐదు నెలల గర్భిణి. బాధితురాలి తల్లిండ్రులు దెందూలూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసి నెల రోజులు అవుతోంది. అయితే పోలీసులు కేసు నమోదు చేయలేదు. పోక్సో కేసు నమోదు చేయాలని పోలీసులను కోరినప్పటికీ, ఎస్ఐ పట్టించుకోలేదు.
ఐజీకి ఫిర్యాదు….
దీంతో బుధవారం బాధిత కుటుంబం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయంపై వివరించారు. దీంతో ఆయన ఆ బాధిత కుటుంబ సభ్యులతో కలిసి ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్‌ను ఫిర్యాదు చేశారు. దెందులూరు పోలీస్ స్టేషన్‌లో బాధిత కుంటుంబ ఫిర్యాదు చేసి నెల రోజులు అవుతుందని, కానీ నేటీకి కేసు నమోదు చేయలేదని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలికను గర్భవతిని చేసి, తనకు సంబంధం లేని అంటున్నాడని ఐజీకి వివరించాడు. దీనిపై పోక్సో కేసు నమోదు చేయాలని కోరారు.
పిఠాపురంలో అత్యాచారం కేసు - నిందితులు అరెస్ట్:
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితులను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు.
పిఠాపురం పట్టణంలోని 16 ఏళ్ల మైనర్ బాలికపై ఈనెల 7 (సోమవారం)న టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ భర్త జాన్, అతడి స్నేహితురాలు సుబ్బలక్ష్మీ కిడ్నాప్ చేసి ఆటోలో మాదాపురం గ్రామ శివారులోని డంపింగ్ యార్డు సమీపంలోని గోదావరి కాలువ గంట్టు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బాలికకు బలవంతంగా మద్యం పట్టించారు. దీంతో ఆ బాలిక స్పృహ కోల్పోయింది. అనంతరం ఆటో డ్రైవర్ ఆ బాలికపై అత్యాచారం చేశాడు.
ఈ ఘటనపై బాలిక మేనత్త ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు నిందితులపై పోక్సో, కిడ్నాప్ వంటి ఐదు కేసులు నమోదు చేశారు. ఎస్పీ విక్రాంగ్ పాటిల్, డీఎస్పీ రఘువీర్ విష్ణు పర్యవేక్షణలో కేసులో నిందితులను పట్టుకోవడానికి మూడు బృందాలను ఏర్పాటు చేశారు.
పిఠాపురం ఐతే నగర్‌కు చెందిన దుర్గా లక్ష్మయ్య అలియాస్ జాన్, ఇందిరా నగర్‌కు చెందిన కొంగపూడి సుబ్బలక్ష్మిలను బుధవారం గొర్స రోడ్డులోని రైస్‌మిల్లు సమీపంలో అరెస్టు చేశారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరు పరిచారు. నిందితుడి నుంచి ఆటో, దుస్తులు, మద్యం సీసాను స్వాధీనం చేసుకున్నారు.