KGBV Applications: కేజీబీవీల్లో కాంట్రాక్టు ఉద్యోగ దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు-extension of deadline for receiving applications for contract jobs in kgbvs ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kgbv Applications: కేజీబీవీల్లో కాంట్రాక్టు ఉద్యోగ దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు

KGBV Applications: కేజీబీవీల్లో కాంట్రాక్టు ఉద్యోగ దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 10, 2024 06:48 PM IST

KGBV Applications: ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ- పాఠశాల విద్యాశాఖ ద్వారా నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో ఖాళీగా ఉన్న బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి దరఖాస్తు తేదీని పొడిగించారు. బోధనేతర సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తారు.

కేజీబీవీల్లో ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు
కేజీబీవీల్లో ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు

KGBV Applications: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన బోధనేతర సిబ్బందిని ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో 2024-25 విద్యా సంవత్సరంలో ఏడాది కాలానికి భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందుకు అర్హులైన, ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించడానికి గడువు 10.10.2024 నకు పూర్తి అయ్యింది.

గడువు లోగా రుసుము చెల్లించి, దరఖాస్తు సమర్పించని వారికి 13.10.2024 వరకు దరఖాస్తు చేసుకోడానికి అవకాశం కల్పించినట్టు సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ప్రకటించారు.

ప్రశాంతంగా ఎనిమిదో రోజు టెట్ పరీక్షలు

ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా ఎనిమిదో రోజు గురువారం అక్టోబర్ 10న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు విభాగంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో మొత్తం 28477 మందికి 25487 మంది అభ్యర్థులు 89.50 శాతం మంది హాజరయ్యారు.

ఉదయం 57 సెంటర్లలో జరిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 12866 మందికి గాను 11501మంది అనగా 89.39 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 58 సెంటర్లలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల పరీక్షలకు 15611 మందికి గాను 13986 మంది అనగా 89.59 శాతం మంది హాజరయ్యారు.

ఎనిమిదవ రోజు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల విభాగంలో పరీక్షలు అన్ని ముగిసిన తర్వాత వారి ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్స్ విడుదల చేస్తారని ఏపీ టెట్ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి తెలిపారు.

Whats_app_banner