LIVE UPDATES
AP Free Gas Cylinders : మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం
Andhra Pradesh News Live September 18, 2024: AP Free Gas Cylinders : మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం
18 September 2024, 22:50 IST
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Andhra Pradesh News Live: AP Free Gas Cylinders : మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం
- AP Free Gas Cylinders : ఏపీ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించారు. ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీలు ప్రకటించిన విషయం తెలిసిందే.
Andhra Pradesh News Live: AP Cabinet Decisions : వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు వివిధ శాఖాల్లో సర్దుబాటు- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే
- AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నూతన మద్యం పాలసీ ఆమోదంతో పాటు పలు మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 18 అంశాలపై నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు ఇస్తున్న రూ.200 ఆర్థిక సాయం జీవో రద్దు చేయాలని నిర్ణయించింది.
Andhra Pradesh News Live: Tirupati RARS Recruitment 2024 : తిరుపతి ఆర్‌ఏఆర్‌ఎస్ లో టీచింగ్ ఖాళీలు - కేవలం ఇంటర్వూనే!
- టీచింగ్ ఉద్యోగాల భర్తీకి తిరుపతిలోని ఆర్‌ఏఆర్‌ఎస్ (RARS) ప్రకటన జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 21 పోస్టులను రిక్రూట్ చేస్తారు. టీచింగ్ అసిస్టెంట్, టీచింగ్ అసోసియేట్ పోస్టులున్నాయి. సెప్టెంబర్ 21న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
Andhra Pradesh News Live: Balineni Srinivasa Reddy : వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా
- వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత జగన్ కు రాజీనామా లేఖ పంపారు.
Andhra Pradesh News Live: Pydithalli Jatara : విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర-సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 30 వరకు ఉత్సవాలు
- Pydithalli Jatara : ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 30 వరకు నిర్వహించనున్నారు. రాష్ట్ర పండుగగా కావడంతో అమ్మవారికి టీటీడీ, ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పిస్తాయి. అక్టోబర్ 14న తొలేళ్ల ఉత్సవం, అక్టోబర్ 15న సిరిమానోత్సవం నిర్వహిస్తారు.
Andhra Pradesh News Live: AP New Liquor Policy : ఏపీ నూతన మద్యం పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్, అక్టోబర్ 1 నుంచి అమల్లోకి
- AP New Liquor Policy : ఏపీ కొత్త మద్యం విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చల అనంతరం కొత్త మద్యం పాలసీని ఆమోదించింది. అలాగే సగటు మద్యం ధరలు రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది.
Andhra Pradesh News Live: AP New Liquor Policy : వారంలో ఒక రోజు మద్యం అమ్మకాలను ఆపేయాలి - మహిళా సంఘాలు డిమాండ్
- ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించాలని సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. వారంలో ఒక రోజు మద్యం అమ్మకాలను పూర్తిగా ఆపివేయాలని కోరింది. ఆ రోజు డ్రై డేగా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.ఆదాయాన్ని తగ్గించుకునే లక్ష్యంతో నూతన మద్యం పాలసీని రూపొందించాలని సూచించింది.
Andhra Pradesh News Live: Kakinada GGH : కాకినాడ జీజీహెచ్ వైద్యులు అదుర్స్, కామెడీ సీన్లు చూపిస్తూ బ్రెయిన్ ట్యూమర్ తొలగింపు
- Kakinada GGH : కాకినాడ జీజీహెచ్ వైద్యులు అదుర్స్ అనిపించారు. 55 ఏళ్ల మహిళకు కామెడీ సీన్స్ చూపిస్తూ సర్జరీ చేశారు. బ్రెయిన్ లోని ట్యూమర్ ను శస్త్ర చికిత్స చేసి తొలగించారు. సర్జరీ సక్సెస్ అయ్యిందని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
Andhra Pradesh News Live: Postal PA Plan : ఏడాదికి రూ.799 చెల్లిస్తే రూ.15 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా- పోస్టాఫీస్ బెస్ట్ ప్లాన్
- Postal PA Plan : పోస్టల్ బ్యాంక్, పలు బీమా సంస్థలతో కలిసి వ్యక్తిగత ప్రమాద బీమా స్కీమ్ అందిస్తోంది. ఏడాదికి రూ.350 నుంచి రూ.799 మధ్య చెల్లిస్తే రూ.5 నుంచి రూ.15 లక్షల వరకు ప్రమాద బీమా పొందవచ్చు. ఈ స్కీమ్ పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంది.
Andhra Pradesh News Live: CBN on Floods: అమరావతిపై విషప్రచారం ఆపండి..! ఏ నగరాలకైనా ముంపు బెడద తప్పదన్నఏపీ సీఎం చంద్ర బాబు
- CBN on Floods: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతికి వరద ముంపుపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నగరాలకైనా ముంపు బెడద ఉంటుందని, చెన్నై, బెంగుళూరు, ముంబై, హైదరాబాద్ సిటీలను మార్చేయాలని చెప్పగలరా అని ప్రశ్నించారు.
Andhra Pradesh News Live: AP TET Update: షెడ్యూల్ ప్రకారమే ఏపీ టెట్ నిర్వహణ, పుకార్లు నమ్మోద్దంటున్నపాఠశాల విద్యాశాఖ
- AP TET Update: షెడ్యూల్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ టెట్ పరీక్షలు నిర్వహిస్తున్న ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. గురువారం నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో భాగంగా మాక్‌టెస్ట్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ప్రకటించారు.
Andhra Pradesh News Live: Prakasam Barrage Boats: ప్రకాశం బ్యారేజీలో బయటపడిన మొదటి బోటు… ఇంకా నీటిలోనే మరో మూడు బోట్లు
- Prakasam Barrage Boats: కృష్ణానది వరదల్లో ఎగువ నుంచి కొట్టుకువచ్చి ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకుపోయిన డ్రెడ్జింగ్ బోట్లలో మొదటి దానిని విజయవంతంగా వెలికి తీశారు. సెప్టెంబర్ మొదటి వారంలో కృష్ణా వరదల్లో కొట్టుకువచ్చిన భారీ పడవలు గేట్ల వద్ద చిక్కుకుపోయాయి. సుదీర్ఘ ప్రయత్నాలతో వెలికి తీస్తున్నారు
Andhra Pradesh News Live: Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల - డిసెంబర్ కోటా టికెట్ల షెడ్యూల్ వివరాలివే
- తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదలయ్యాయి. వీటిని ఆన్ లైన్ లో టీటీడీ విడుదల చేసింది. ఇక సెప్టెంబరు 21న వర్చువల్ సేవల కోటా, సెప్టెంబరు 23న అంగప్రదక్షిణం టోకెన్లను విడుదల చేయనుంది. https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లోకి భక్తులు టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు.
Andhra Pradesh News Live: AP Govt Jobs 2024 : ఏపీ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు - రాత పరీక్ష లేదు, నెలకు రూ. 60 వేల జీతం
- APSDPS Recruitment 2024 : ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 24 ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 28వ తేదీతో ఆన్ లైన్ దరఖాస్తుల గడువు పూర్తి కానుంది. http://www.apsdps.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి.
Andhra Pradesh News Live: VZRM Accident: విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు స్పాట్ డెడ్...తిరుపతి వెళ్లి వస్తుండగా ప్రమాదం
- VZRM Accident: విజయ నగరంలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తిరుపతి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh News Live: Eluru Hostel Warden: ఏలూరులో హాస్టల్ వార్డెన్ దుర్మార్గం.. ఫోటో షూట్‌ల పేరుతో బాలికలపై లైంగిక వేధింపులు
- Eluru Hostel Warden: ఏలూరు జిల్లాలో దారుణ సంఘటన వెలుగుచూసింది. హాస్టల్లో ఆశ్రయం పొందుతున్న బాలికల్ని పోటోషూట్ పేరుతో ఎరవేసి లైంగిక దాడులకు పాల్పడుతున్న వైనం బయటపడింది. నిందితుడి వేధింపులు తాళలేక విద్యార్థినులు పోలీసుల్ని ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
Andhra Pradesh News Live: HT Effect: CM కీలక నిర్ణయం.. వరద ముంపు నేపథ్యంలో విజయవాడలో ఆస్తి పన్ను వసూలు వాయిదా..
- HT Effect: ఓ వైపు వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజల్ని ఆస్తి పన్ను చెల్లించాలంటూ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ హెచ్చరికలు జారీ చేయడంపై హిందుస్తాన్ టైమ్స్ కథనానికి సిఎంఓ స్పందించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పన్నుల చెల్లింపుకు మూడు నెలలు గడువు ఇస్తున్నట్టు సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు.
Andhra Pradesh News Live: Private Liquor Shops: ప్రైవేట్ మద్యం దుకాణాలకే పాలసీ మొగ్గు, అక్టోబర్ 1నుంచి అమల్లోకి కొత్త లిక్కర్ పాలసీ
- Private Liquor Shops: ఆంధ్రప్రదేశ్ కొత్త మద్యం పాలసీలో ప్రైవేట్ మద్యం దుకాాణాల వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది. కొత్త మద్యం పాలసీపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నివేదిక క్యాబినెట్ ముందుకు రానుంది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే పాలసీలో ప్రైవేట్ దుకాణాలు ఏర్పాటు కానున్నాయి.