Tirupati RARS Recruitment 2024 : తిరుపతి ఆర్‌ఏఆర్‌ఎస్ లో టీచింగ్ ఖాళీలు - కేవలం ఇంటర్వూనే!-tirupati rars recruitment notification for teaching assistant teaching associate jobs 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirupati Rars Recruitment 2024 : తిరుపతి ఆర్‌ఏఆర్‌ఎస్ లో టీచింగ్ ఖాళీలు - కేవలం ఇంటర్వూనే!

Tirupati RARS Recruitment 2024 : తిరుపతి ఆర్‌ఏఆర్‌ఎస్ లో టీచింగ్ ఖాళీలు - కేవలం ఇంటర్వూనే!

HT Telugu Desk HT Telugu
Sep 18, 2024 05:31 PM IST

టీచింగ్ ఉద్యోగాల భర్తీకి తిరుపతిలోని ఆర్‌ఏఆర్‌ఎస్ (RARS) ప్రకటన జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 21 పోస్టులను రిక్రూట్ చేస్తారు. టీచింగ్ అసిస్టెంట్‌, టీచింగ్ అసోసియేట్ పోస్టులున్నాయి. సెప్టెంబ‌ర్ 21న ఇంట‌ర్వ్యూలు నిర్వహిస్తారు.

తిరుప‌తి ఆర్ఏఆర్‌ఎస్ లో ఉద్యోగాలు
తిరుప‌తి ఆర్ఏఆర్‌ఎస్ లో ఉద్యోగాలు

రాష్ట్రంలోని తిరుప‌తి అగ్రిక‌ల్చ‌ర‌ల్ పాలిటెక్నిక‌ల్‌లో టీచింగ్ అసిస్టెంట్‌, టీచింగ్ అసోసియేట్ పోస్టుల భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ పోస్టుల భర్తీకి ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్శ‌ిటీ అనుబంధ అగ్రిక‌ల్చ‌ర‌ల్ పాలిటెక్నిక్‌ రీజిన‌ల్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రీసెర్చ్ స్టేష‌న్ (Regional Agricultural Research Station), తిరుప‌తి నోటిఫికేష‌న్ జారీ చేసింది. సెప్టెంబ‌ర్ 21న ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తుంది.

కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష లేదు. ఇంట‌ర్వ్యూలు ద్వారానే డైరెక్ట్ భ‌ర్తీ ఉంటుంది. మొత్తం 22 పోస్టులు భ‌ర్తీ చేయ‌గా, అందులో టీచింగ్ అసిస్టెంట్ 19 (కేట‌గిరీ-బీ), టీచింగ్ టీచింగ్ అసోసియేట్ 3 (కేట‌గిరీ-ఏ) పోస్టులు ఉన్నాయి.

తిరుప‌తి అగ్రిక‌ల్చ‌ర‌ల్ పాలిటెక్నిక్ ( రెండు- టీచింగ్ అసిస్టెంట్‌), పొదలకూరు అగ్రిక‌ల్చ‌ర‌ల్ పాలిటెక్నిక్ (మూడు-టీచింగ్ అసిస్టెంట్‌), సోమ‌శిల‌ అగ్రిక‌ల్చ‌ర‌ల్ పాలిటెక్నిక్ (మూడు-టీచింగ్ అసిస్టెంట్‌), ఉటుకూర్‌ అగ్రిక‌ల్చ‌ర‌ల్ పాలిటెక్నిక్ (మూడు-టీచింగ్ అసిస్టెంట్‌, ఒక టీచింగ్ అసోసియేట్‌), క‌లికిరి అగ్రిక‌ల్చ‌ర‌ల్ పాలిటెక్నిక్ (రెండు-టీచింగ్ అసిస్టెంట్‌), పుంగ‌నూరు అగ్రిక‌ల్చ‌ర‌ల్ పాలిటెక్నిక్ (రెండు-టీచింగ్ అసిస్టెంట్‌), క‌లికిరి పాలిటెక్నిక‌ల్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఇంజ‌నీరింగ్ (నాలుగు-టీచింగ్ అసిస్టెంట్‌, రెండు-టీచింగ్ అసోసియేట్‌)ల్లో పోస్టింగ్ ఉంటుంది.

జీతం...అర్హ‌త‌లివే

టీచింగ్ అసోసియేట్ పోస్టుకు నెలవారీ వేత‌నం రూ.54 వేలు (పీహెచ్‌డీ చేసిన వారికి), రూ.49 వేలు (పీజీ చేసిన వారికి) అద‌నంగా హెచ్ఆర్ఏ ఉంటుంది. ఈ పోస్టుల‌కు అర్హ‌త‌లు అగ్రిక‌ల్చ‌ర్‌, అనుబంధ స‌బ్జెక్ట్‌ల్లో పీహెచ్‌డీ చేసి ఉండాలి. లేక‌పోతే అగ్రిక‌ల్చ‌ర‌ల్, అనుబంధ స‌బ్జెక్ట్‌ల్లో పీజీ చేసి ఉండాలి. అలాగే బ్యాచిల‌ర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వ‌యో ప‌రిమితి ఇంట‌ర్వ్యూ నాటికి పురుషుల‌కు 40 ఏళ్లు, మ‌హిళ‌ల‌కు 45 ఏళ్లు మించ‌కూడ‌దు.

టీచింగ్ అసిస్టెంట్ పోస్టుకు నెల‌వారీ వేత‌నం రూ.30 వేలు ఉంటుంది. ఈ పోస్టుల‌కు అర్హ‌త‌లు బీఎస్సీ అగ్రిక‌ల్చ‌ర‌ల్‌, బీటెక్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఇంజ‌నీరింగ్ పూర్తి చేసి ఉండాలి. వ‌యో ప‌రిమితి ఇంట‌ర్వ్యూ నాటికి 35 ఏళ్ల మించ‌కూడ‌దు.

11 నెల‌ల స‌ర్వీస్ పూర్తి అయిన త‌రువాత టెర్మినేట్ చేస్తారు. అవ‌స‌రం అనుకుంటే కొన‌సాగిస్తారు. అభ్య‌ర్థులు ఇంట‌ర్వ్యూకు అన్ని ఒరిజిన‌ల్ డాక్యుమెంట్లు ప‌ట్టుకుని వెళ్లాలి. అలాగే ఒక సెట్ సెల్ఫ్ అటెస్ట్‌డ్ కాపీలు ఉండాలి. ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రైన అభ్య‌ర్థుల‌కు టీఏ, డీఏలు ఇవ్వ‌బ‌డ‌వు. అభ్య‌ర్థులు స‌ర్టిఫికేట్లలో ఎటువంటి త‌ప్పులైన ఉంటే సెల‌క్ట్ అయిన త‌రువాత కూడా అభ్య‌ర్థిని టెర్మినేట్ చేస్తాం.

ఎటువంటి నోటీసు ఇవ్వకుండా, ఎటువంటి కార‌ణం చెప్ప‌కుండా అభ్య‌ర్థిని టెర్మినేట్ చేసే అధికారం సంస్థ‌కు ఉంది. ఒక‌వేళ అభ్య‌ర్థి ఉద్యోగం మానియాల‌నుకుంటే నెల రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూ అయిన త‌రువాత ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ కోసం మెడిక‌ల్ టెస్ట్ నిర్వ‌హిస్తారు. ఇంట‌ర్వ్యూ సెప్టెంబ‌ర్ 21న ఉద‌యం 10ః00 గంట‌ల‌కు తిరుప‌తిలోని రీజిన‌ల్ అగ్రిక‌ల్చ‌రల్ రీసెర్చ్ స్టేష‌న్ (ఆర్ఏఆర్ఎస్‌)లో ఆఫీసు ఆఫ్ ది అసోసియేట్ డైరెక్ట‌ర్ ఆఫ్ రీసెర్చ్‌లో జ‌రుగుతుంది.

రిపోర్టింగ్ - జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

సంబంధిత కథనం