Postal PA Plan : ఏడాదికి రూ.799 చెల్లిస్తే రూ.15 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా- పోస్టాఫీస్ బెస్ట్ ప్లాన్
Postal PA Plan : పోస్టల్ బ్యాంక్, పలు బీమా సంస్థలతో కలిసి వ్యక్తిగత ప్రమాద బీమా స్కీమ్ అందిస్తోంది. ఏడాదికి రూ.350 నుంచి రూ.799 మధ్య చెల్లిస్తే రూ.5 నుంచి రూ.15 లక్షల వరకు ప్రమాద బీమా పొందవచ్చు. ఈ స్కీమ్ పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంది.
Postal PA Plan : పోస్టల్ బ్యాంక్ ఇటీవల అతి తక్కువ ప్రీమియంతో వ్యక్తిగత ప్రమాద బీమా స్కీమ్ లను ప్రవేశపెట్టింది. పోస్టల్ బ్యాంక్ లో వ్యక్తిగత ప్రమాద కవరేజీ కింద హెల్త్ ప్లస్, ఎక్స్‌ప్రెస్ హెల్త్ ప్లస్ వేరియంట్‌లను అందిస్తుంది. ఈ వ్యక్తిగత ప్రమాద పాలసీ వ్యవధి ఒక సంవత్సరం ఉంటుంది. ఏడాదికి రూ.559-799 మధ్య చెలిస్తే రూ.10-15 లక్షల కవరేజీ అందిస్తోంది.
పోస్టల్ బ్యాంక్, ఇతర బీమా కంపెనీల ఉమ్మడిగా ఈ బీమా పథకాలను అందిస్తు్న్నాయి. 18-65 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఈ వ్యక్తిగత ప్రమాద బీమా పథకాల కింద చేరవచ్చు. ప్రమాదం కారణంగా మరణం, శాశ్వత లేదా పాక్షిక వైకల్యం, అవయవాలకు నష్టం లేదా పక్షవాతం సంభవించినప్పుడు రూ. 10 నుంచి 15 లక్షల వరకు బీమా కవరేజీ ఉంటుంది. అదనంగా ఆసుపత్రి ఖర్చులు, ఓపీడీ ఖర్చులు, ఇతర ప్రమాద చికిత్స ఖర్చులను కవర్ చేస్తారు. లబ్ధిదారులు వైద్యుల నుంచి ఉచితంగా సలహాలను కూడా పొందవచ్చు. ఈ పాలసీలో ఇద్దరు పిల్లలకు రూ. 1 లక్ష వరకు విద్యా ఖర్చులు, పది రోజుల పాటు ఆసుపత్రి ఖర్చుల కోసం రోజుకు రూ. 1,000, కుటుంబం వేరే నగరంలో నివసిస్తుంటే రవాణా ఖర్చుల కోసం రూ. 25,000, అంత్యక్రియల ఖర్చుల కోసం రూ. 5,000 బీమా కంపెనీలు చెల్లిస్తాయి.
హెల్త్ ప్లస్ ఆప్షన్- 1 ప్రయోజనాలు
హెల్త్ ప్లస్ ఆప్షన్-1 బీమా మొత్తం రూ. 5 లక్షలు, దురదృష్టవశాత్తు మరణం లేదా శాశ్వత, వ్యక్తిగత వైకల్యాలు సంభవించినప్పుడు బీమా ఉన్న వ్యక్తి కుటుంబం 100 శాతం బీమా మొత్తాన్ని పొందుతారు. రూ.50,000 వరకు పిల్లల పెళ్లికి అందిస్తారు. ప్రమాదంలో ఎముకలు విరిగితే రూ.25,000 బీమా చెల్లిస్తారు. హెల్త్ ప్లస్ ఆప్షన్-1 వార్షిక ప్రీమియం పన్నులతో సహా రూ. 355 అవుతుంది.
హెల్త్ ప్లస్ ఆప్షన్ -2 ప్రయోజనాలు
హెల్త్ ప్లస్ ఆప్షన్-2 కింద బీమా మొత్తం రూ.10 లక్షలు. మరణం లేదా శాశ్వత, వ్యక్తిగత వైకల్యాల విషయంలో బీమా ఉన్న వ్యక్తి కుటుంబానికి 100 శాతం బీమా చెల్లిస్తారు. పిల్లల పెళ్లిళ్లకు, ప్రమాదంలో విరిగిన ఎముకలకు రూ. 25,000 బీమా చెలిస్తారు. అంత్యక్రియలకు రూ.7 నుంచి 9 వేలు చెలిస్తారు. పిల్లల చదువులకు రూ. 50 వేలు ఇస్తారు. ప్రమాదఖర్చులు రూ.75 వేలు, హాస్పిటల్ ఉన్నప్పుడు రోజుకు వెయ్యి చొప్పున రూ.60 వేలు చెల్లిస్తారు. ఈ బీమా ప్రీమియం ఏడాది రూ.559.
హెల్త్ ప్లస్ ఆప్షన్ -3 ప్రయోజనాలు
హెల్త్ ప్లస్ ఆప్షన్ 3 కింద బీమా మొత్తం రూ.15 లక్షలు ఉంటుంది. దురదృష్టవశాత్తు మరణం లేదా శాశ్వత మరియు వ్యక్తిగత వైకల్యాలు సంభవించినప్పుడు బీమా ఉన్న వ్యక్తికి లేదా అతని కుటుంబానికి రూ. 15 లక్షలు చెల్లిస్తారు. పిల్లల పెళ్లికి రూ.లక్ష వరకు కవరేజీ ఉంటుంది. ప్రమాదాల వైద్య ఖర్చులు రూ.లక్ష, పిల్లలు చదువులకు రూ.50 వేలు ఇస్తారు. ఇతర అన్ని ప్రయోజనాలు హెల్త్ ప్లస్ ఆప్షన్ 2 లాగానే ఉంటాయి. ఈ బీమా ప్రీమియం ఏడాదికి రూ.799.
సంబంధిత కథనం