Tirumala Darshan Tickets : తిరుమల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్లు విడుదల - డిసెంబర్ కోటా టికెట్ల షెడ్యూల్ వివరాలివే-ttd released arjitha seva tickets for december 2024 other ticket dates check here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Darshan Tickets : తిరుమల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్లు విడుదల - డిసెంబర్ కోటా టికెట్ల షెడ్యూల్ వివరాలివే

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్లు విడుదల - డిసెంబర్ కోటా టికెట్ల షెడ్యూల్ వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 18, 2024 11:19 AM IST

తిరుమల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు విడుదలయ్యాయి. వీటిని ఆన్ లైన్ లో టీటీడీ విడుదల చేసింది. ఇక సెప్టెంబరు 21న వర్చువల్ సేవల కోటా, సెప్టెంబరు 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లను విడుదల చేయనుంది. https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లోకి భక్తులు టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు.

తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు
తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు

డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్ల విడుదల తేదీ వివరాలను టీటీడీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఇవాళ(సెప్టెంబర్ 18) శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేసింది. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లోకి ఈ టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు.

ఇక ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబరు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబరు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను సెప్టెంబరు 21వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

సెప్టెంబరు 21న వర్చువల్ సేవల కోటా:

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన డిసెంబరు నెల కోటాను సెప్టెంబరు 21న విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయని టీటీడీ పేర్కొంది.

సెప్టెంబరు 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు :

డిసెంబరు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను సెప్టెంబరు 23న విడుదల చేస్తారు. ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా :

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన డిసెంబరు నెల ఆన్ లైన్ కోటాను సెప్టెంబరు 23వ తేదీన అందుబాటులోకి తీసుకువస్తారు. ఉదయం 11 గంటల నుంచి ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకోవచ్చు.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా :

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను సెప్టెంబరు 23న విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంట‌ల‌ నుంచి ఆన్ లైన్ లో బుకించ్ చేసుకోవాలి.

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా :

డిసెంబరు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబరు 24న విడుదల చేస్తారు. ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా:

తిరుమల, తిరుపతిల‌లో డిసెంబరు నెల గదుల కోటాను సెప్టెంబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

శ్రీవారి సేవ కోటా :

సెప్టెంబరు 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా టికెట్లను ఉదయం 11 గంటలకు విడుదల చేస్చారు. ఇక న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ ఓ ప్రకటనలో కోరింది.

మరోవైపు ఇవాళ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కృష్ణ తేజ గేస్ట్ హౌస్ వరకు భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. మంగళవారం 72,072 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 30,384 మంది తలనీలాలు సమర్పించారు. 4.16 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది.

Whats_app_banner