AP Govt Jobs 2024 : ఏపీ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు - రాత పరీక్ష లేదు, నెలకు రూ. 60 వేల జీతం-andhra pradesh state development planning society recruitment notification for professional vacancies 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Jobs 2024 : ఏపీ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు - రాత పరీక్ష లేదు, నెలకు రూ. 60 వేల జీతం

AP Govt Jobs 2024 : ఏపీ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు - రాత పరీక్ష లేదు, నెలకు రూ. 60 వేల జీతం

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 18, 2024 10:37 AM IST

APSDPS Recruitment 2024 : ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 24 ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 28వ తేదీతో ఆన్ లైన్ దరఖాస్తుల గడువు పూర్తి కానుంది. http://www.apsdps.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి.

APSDPS నుంచి ఉద్యోగ నోటిఫికేషన్
APSDPS నుంచి ఉద్యోగ నోటిఫికేషన్

స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్‌మేంట్ యూనిట్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ(ఏపీఎస్‌డీపీఎస్) ప్రకటన జారీ చేసింది. మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వీటిని రిక్రూట్ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఇందుకు సెప్టెంబర్ 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటి/సంస్థ నుంచి సంబంధిత విభాగంలో ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం కూడా తప్పనిసరి. స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. http://www.apsdps.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎంపికైన వారు విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 40 ఏళ్ల లోపు(01.01.2025) ఉండాలి. సంబంధిత విభాగంలో మూడేళ్లు పని చేసిన అనుభవం ఉండాలి. ఎంపికైన వారికి నెల జీతం రూ. 60 వేలుగా ఉంటుంది. మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉండాలి.

ముఖ్య వివరాలు :

  • ఉద్యోగ నోటిఫికేషన్ - ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ(APSDPS).
  • పోస్టులు - స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్‌మేంట్ యూనిట్ ప్రొఫెషనల్స్().
  • మొత్తం ఖాళీలు - 24
  • పని చేయాల్సిన ప్రదేశం -విజయవాడ
  • అర్హతలు - గుర్తింపు పొందిన యూనివర్సిటి/సంస్థ నుంచి సంబంధిత విభాగంలో ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 40 ఏళ్ల లోపు(01.01.2025) ఉండాలి.
  • ఈ పోస్టులను Outsourcing Basisలో రిక్రూట్ చేస్తారు.
  • జీతం - నెలరు రూ. 60 వేలు
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్
  • దరఖాస్తులకు తుది గడువు - 28, సెప్టెంబర్ 2024.
  • ఎంపిక విధానం - అకడమిక్ క్వాలిఫికేషన్స్, స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వూ.
  • అధికారిక వెబ్ సైట్ -http://www.apsdps.ap.gov.in/
  • అప్లికేషన్ లింక్ - https://apsdpscareers.com/Svmu.aspx
  • ఏమైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే edcb-apsdps@ap.gov.in మెయిల్ ను సంప్రదించవచ్చు.