Andhra Pradesh: విద్యుత్ శాఖ‌లో కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు.. ప‌రీక్ష లేదు.. ఇంటర్వ్యూతోనే ఉద్యోగాలు!-notification for the recruitment of contract jobs in andhra pradesh electricity department ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh: విద్యుత్ శాఖ‌లో కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు.. ప‌రీక్ష లేదు.. ఇంటర్వ్యూతోనే ఉద్యోగాలు!

Andhra Pradesh: విద్యుత్ శాఖ‌లో కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు.. ప‌రీక్ష లేదు.. ఇంటర్వ్యూతోనే ఉద్యోగాలు!

HT Telugu Desk HT Telugu
Aug 26, 2024 11:26 AM IST

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఈస్ట‌ర్న ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ లిమిటెడ్ (ఏపీఈపీడిసీఎల్‌)లో కాంట్రాక్ట్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ వెలువడింది. మూడేళ్ల కాంట్రాక్టు ప‌ద్ద‌తిలో ప‌ని చేయ‌డానికి.. మేనేజ‌ర్ ఐటీ పోస్టుల భ‌ర్తీకి ఇంటర్వ్యూలు నిర్వ‌హిస్తున్నారు.

విద్యుత్ శాఖ‌లో కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు
విద్యుత్ శాఖ‌లో కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు ((APEPDCL))

విద్యుత్ శాఖ‌లో కాంట్రాక్ట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మూడేళ్ల కాలానికి పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్య‌ర్థులు ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు ఈనెల 28వ తేదీ వరకు అవకాశం ఉంటుందని వెల్లడించారు.

పోస్టుల వివ‌రాలు..

మేనేజ‌ర్ -ఐటీ, డేటా అన‌లిస్టు-1

మేనేజ‌ర్ -ఐటీ, డేటా సెంట‌ర్ అడ్మినిస్ట్రేట‌ర్‌-1

మేనేజ‌ర్ -ఐటీ, సైబ‌ర్ సెక్యూరిటీ-1

మేనేజ‌ర్ -ఐటీ, ఎస్ఏపీ-1

మేనేజ‌ర్ -ఐటీ, మొబైల్ అప్లికేష‌న్స్‌-1

అర్హ‌త‌లు.. అనుభ‌వం..

ఎంసీఏ, బిటెక్‌, ఎంటెక్ (టెక్నాల‌జీ మేనేజ్‌మెంట్‌), బ్యాచిల‌ర్ ఆఫ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, కంప్యూట‌ర్ సైన్స్ లేదా దానికి సంబంధించిన విద్యార్హ‌త ఉండాలి. ఐటీ రంగంలో క‌నీసం ఐదేళ్ల నుంచి ఎనిమిదేళ్ల వ‌ర‌కు పనిచేసిన అనుభ‌వం ఉండాలి. మూడేళ్ల కాంట్రాక్ట్ ప‌ద్దతిలో భ‌ర్తీ చేస్తారు. త‌రువాత ఏడాది పాటు పొడిగించే అవ‌కాశం ఉంటుంది.

వ‌యో ప‌రిమితి.. వేత‌నం..

అభ్య‌ర్థి వ‌య‌స్సు 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. నెల‌వారీ వేత‌నం రూ.30,000 ఉంటుంది. రాత ప‌రీక్ష లేదు. ఎటువంటి ఫీజు లేదు. ఇంట‌ర్వ్యూ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. విశాఖ‌ప‌ట్నం సీతమ్మధారలోని ఏపీఈపీడీసీఎల్‌ చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌ ఆఫీస్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీని చెబుతారు.

జ‌త చేయాల్సిన డాక్యూమెంట్స్‌..

అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి.. విద్యా అర్హ‌త‌, వ‌య‌స్సు, జాతీయత‌, వ‌ర్క్ ఎక్స్‌పీరెన్స్ స‌ర్టిఫికేట్లు జత చేయాలి. అప్‌డేట్ చేసిన రెస్యూమేను కూడా జత చేయాలి. అలాగే.. ఎందుకు ఈ ఉద్యోగం చేయడానికి ఆస‌క్తి చూపుతున్నారో.. అలాగే 200 ప‌దాల్లో రాసి పంపాలి.

అప్లికేష‌న్ ఫాం కోసం.. అధికారిక‌ వెబ్‌సైట్ https://apeasternpower.com/ ను సంప్ర‌దించాలి. లేదంటే అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ https://apeasternpower.com/careers ను సంప్ర‌దించాలి. అద‌న‌పు స‌మాచారం కోసం ఫోన్ నెంబ‌ర్‌ 0891-2582445 ను, మెయిల్ ఐడీ cgm_hrd@apeasternpower.com ని సంప్ర‌దించవ‌చ్చు.

( రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ప్రతినిధి )