తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  భారీగా పెరగనున్న వడ్డీ రేట్లు.. నడ్డి విరవనున్న ఈఎంఐలు

భారీగా పెరగనున్న వడ్డీ రేట్లు.. నడ్డి విరవనున్న ఈఎంఐలు

02 June 2022, 9:35 IST

    • జూన్ 8తో మొదలు వచ్చే ఐదారు నెలల్లో ఆర్బీఐ పలుమార్లు వడ్డీ రేటు పెంచనుంది. ఈ దెబ్బతో ప్రస్తుత వడ్డీ రేట్ల కంటే దాదాపు 1 శాతం వడ్డీ రేటు బ్యాంకులు అధికంగా వసూలు చేయనున్నాయి. ఈ కారణంగా ఈఎంఐ భారం అడ్డగోలుగా పెరగనుంది.
వడ్డీ రేట్లను పెంచనున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
వడ్డీ రేట్లను పెంచనున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (REUTERS)

వడ్డీ రేట్లను పెంచనున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

రానున్న కొద్ది నెలల్లో స్వల్ప వ్యవధుల్లో పలుమార్లు రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటు పెంచుతుందని, వచ్చే ఏడాది ఆరంభంలో రెపో రేటు దాదాపు టర్మినెల్ లెవల్‌కు చేరుకుంటుందని రాయిటర్స్ వార్తా సంస్థ నిర్వహించిన పోల్‌లో ఆర్థిక వేత్తలు తమ అంచనాలు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

మే 4న ఆశ్చర్యకరంగా, అకస్మాత్తుగా ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచేసింది. ఎనిమిదేళ్ల గరిష్టానికి చేరుకున్న ద్రవ్యోల్భణాన్ని అదుపు చేసేందుకు ముందు ముందు మరిన్ని సమావేశాలు ఉండాలని మానిటరీ పాలసీ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు.

మే 26- జూన్ 1న రాయిటర్స్ నిర్వహించిన పోల్‌లో ఈ సెంటిమెంట్‌ ప్రతిధ్వనించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తదుపరి నాలుగు మానిటరీ పాలసీ కమిటీ సమావేశాల్లో కనీసం 100 బేసిస్ పాయింట్ల (1 శాతం) మేర వడ్డీ రేట్లు పెంచుతుందని రాయిటర్స్ పోల్ అంచనా వేసింది.

మేలో నిర్వహించిన ఆకస్మిక సమావేశంలో 40 బేసిస్ పాయింట్ల (0.40 శాతం) మేర వడ్డీ రేటు పెంచి రెపో రేటును 4.40 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. జూన్ 8న ఆర్‌బిఐ నిర్వహించే మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో కూడా వడ్డీ రేటు పెరుగుతుందని రాయిటర్స్ పోల్ అంచనా వేసింది. ఇదే అంశంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల స్పందిస్తూ ‘పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు’ అంటూ వడ్డీ రేట్ల పెంపు ఖాయమంటూ పరోక్ష సంకేతాలు ఇచ్చారు.

అయితే ఎంత మేర పెంచుతారన్న అంశంలో స్పష్టత లేదు. పోల్ అంచనాలు కూడా ఆరు శ్రేణులుగా విడిపోయాయి. పెంపు అంచనాలు 25 బేసిస్ పాయింట్ల నుంచి 75 బేసిస్ పాయింట్ల మధ్య ఉన్నాయి. నెల రోజుల క్రితం నిర్వహించిన పోల్ కూడా ఇంచుమించు ఇదే రీతిలో ఉంది. 

రెపో రేటు ఎంత ఉండనుంది?

రెపోరేటు వచ్చే త్రైమాసికంలో కోవిడ్ మహమ్మారి కంటే ముందున్న స్థాయి అయిన 5.15 శాతం లేదా అంతకంటే ఎక్కువకు పెరుగుతుందని మొత్తం 47 మందిలో 41 మంది ఆర్థిక వేత్తలు తమ స్పందన తెలియజేశారు. సంవత్సరాంతానికి ఇప్పుడున్న రెపో రేటుతో పోల్చితే 110 బేసిస్ పాయింట్ల మేర పెరిగి 5.50 శాతానికి చేరుతుందని పోల్ తేల్చింది. అయితే అంతకంటే ఎక్కువ పెరుగుతుందని 47 మందిలో 19 మంది తమ అంచనాలు వెల్లడించారు.

రెపో రేటు పెంపులో ఎక్కువ భాగం ఈ ఏడాదే  ఉంటుందని, వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి రేట్ల పెంపుదల ఆగిపోతుందని పోల్ అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికానికల్లా పెరుగుదల అవసరం ఉండకపోవచ్చునని పాంథియోన్ మాక్రోఎకనామిక్స్‌కు చెందిన ప్రతినిధి మిగ్యుల్ చాంకో అన్నారు.

‘ద్రవ్యోల్భణం విషయంలో, వడ్డీ రేట్ల విషయంలో ఏం చేయాలన్న నిర్ణయం తీసుకోవడంలో రిజర్వ్ బ్యాంక్ వెనకబడి ఉంది. భవిష్యత్తులో ధరల పెరుగుదలపై వారు ఇంకా ఆశావాద దృష్టితోనే ఉన్నట్టు కనిపిస్తోంది..’ అని చాంకో అన్నారు.

అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల, ఆహార ధరల పెరుగుదలను ప్రతిబింబిస్తూ ద్రవ్యోల్భణం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వృద్ధి అవకాశాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. జీడీపీ వృద్ధి గడిచిన త్రైమాసికంలో ఏడాది కనిష్ట స్థాయికి పతనమైంది.

ద్రవ్యోల్భణం కంటే వృద్ధికి అధిక ప్రాధాన్యతినిస్తూ వచ్చిన ఆర్బీఐ.. జీడీపీ తగ్గుతుండడంతో  మే నెలలో అకస్మాత్తుగా వడ్డీ రేట్లను పెంచేసింది. ఏడాదిపాటు వడ్డీ రేట్లు పెంచేందుకు ఆర్బీఐ మొగ్గుచూపే అవకాశం ఉంది.

టెర్మినల్ రెపో రేట్ 6 శాతం లేదా అంకంటే ఎక్కువగా ఉండొచ్చని 26 మందిలో 14 మంది ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు. మిగిలినవారు 5.15 శాతం నుంచి 6.50 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేశారు.

మూడింట రెండొంతుల మంది ఆర్థిక వేత్తలు ఈ ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలోనే టెర్మినల్ రేట్ అందుకోవచ్చని అంచనా వేశారు. అయితే రానున్న కొద్ది నెలలపాటు ధరల ఒత్తిడిపై ఇది ఆధారపడి ఉంటుందని ఆర్థిక వేత్తలు అంచనా వేశారు.

ఒకవేళ ఈ ఆర్థిక సంవత్సరం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్భణం 6 నుంచి 7 శాతం మధ్యే ఉండాలంటే టెర్మినల్ రేట్ ఇప్పుడు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉందని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ సీనియర్ ఎకనామిస్ట్ సుబొదీప్ రక్షిత్ తెలిపారు.

టాపిక్