తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Teacher Student Sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

Sharath Chitturi HT Telugu

05 May 2024, 14:37 IST

    • Teacher student sex in America : ఓ 5వ తరగతి స్టూడెంట్​తో ఓ టీచర్​ మేకౌట్​ చేసింది. ఈ విషయం ఆ విద్యార్థి తల్లిదండ్రులకు తెలిసింది. ఆ టీచర్​ అరెస్ట్​ అయ్యింది. అమెరికాలోని విస్కాన్సిస్​లో జరిగింది ఈ ఘటన.
విస్కాన్సిస్​ ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ బర్గ్​మన్​
విస్కాన్సిస్​ ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ బర్గ్​మన్​ (Facebook/@Stuart Kent Smith)

విస్కాన్సిస్​ ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ బర్గ్​మన్​

Teacher student sex in USA : అమెరికాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వార్తలకెక్కింది. 5వ తరగతి విద్యార్థితో ఓ ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​ చేసింది. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే.. ఆమె పెళ్లి ఆగిపోయింది!

ట్రెండింగ్ వార్తలు

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

ఇదీ జరిగింది..

అమెరికా విస్కాన్సిస్​లో జరిగింది ఈ ఘటన. 24ఏళ్ల మాడిసన్​ బర్గ్​మన్​.. తాను పని చేస్తున్న స్కూల్​లో 5వ తరగతి చదువుకుంటున్న ఓ 11ఏళ్ల విద్యార్థితో అఫైర్​ పెట్టుకుంది. ఇద్దరు చాలా సార్లు 'మేకౌట్​ (సెక్స్​, ముద్దులు పెట్టుకోవడం)' చేశారు. విద్యార్థి తల్లిదండ్రుల అనుమానంతో.. ఈ వ్యవహారం బయటపడింది.

తమ బిడ్డ, టీచర్​ సన్నిహితంగా ఉండటాన్ని చూసి.. ఆ 5వ తరగతి విద్యార్థి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. వారిద్దరు పంచుకున్న ఇంటిమేట్​ మెసేజ్​లు.. బాలుడి తండ్రికి దొరికాయి. టీచర్​- స్టూడెంట్​ కలిసి లంచ్​ సమయంలో క్లాస్​రూమ్​లో లేదా స్కూల్​ తర్వాత.. మేకౌట్​ చేసినట్టు ఆ మెసేజ్​ల ద్వారా తేలింది.

ఈ 11ఏళ్ల విద్యార్థికి అతని తల్లిదండ్రులు ఫోన్​ ఇచ్చారు. గత డిసెంబర్​లో.. ఆ టీచర్​ని విద్యార్థి తల్లి ఇంటికి పిలిచింది. అలా.. బాలుడి ఫోన్​ నెంబర్​ బర్గ్​మన్​కి దొరికింది. అప్పటి నుంచి వారిద్దరు మేకౌట్​ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Wisconsin elementary school teacher : ఈ విషయంపై ఆగ్రహించిన ఆ 11ఏళ్ల విద్యార్థి తండరి.. రివర్​ క్రెస్ట్​ ఎలిమెంటరీ స్కూల్​కి వెళ్లి.. సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. బర్గ్​మన్​పై దర్యాప్తు మొదలైంది. ఈ వ్యవహారం.. పోలీసుల దృష్టికి వెళ్లింది. పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. ఆ విద్యార్థి పర్స్ పోలీసులకు దొరికింది. అందులో.. టీచర్​ పేరు, ఒక స్క్రిబ్లింగ్​ నోట్ లభించింది. టీచర్​- స్టూడెంట్​ ఎన్నిసార్లు సెక్స్​ చేశారు? ఎన్నిసార్లు ముద్దులు పెట్టుకున్నారు వంటి వివరాలు ఆ స్క్రిబ్లింగ్​ నోట్స్​లో ఉన్నాయి.

బర్గ్​మన్​ని స్కూల్​ సిబ్బంది వెంటనే సస్పెండ్​ చేసింది. పోలీసులు ఆమెను అరెస్ట్​ చేశారు. పిల్లలపై లైంగిక దాడి కింద ఆమెపై కేసు వేశారు. ఆ తర్వాత.. 25వేల డాలర్ల సిగ్నేచర్​ బాండ్​పై ఆమెను విడిచిపెట్టారు. కానీ పిల్లలు, స్కూల్​ సిబ్బంది, తల్లిదండ్రుల నుంచి ఆమెను దూరంగా ఉంచుతున్నారు.

టీచర్​ చేసిన పనికి ఆగిపోయిన పెళ్లి..

America news latest : కాగా.. ఈ జులైలో బర్గ్​మన్​కి వివాహం జరగాల్సి ఉంది. కానీ.. ఆమె చేసిన పని గురించి తెలుసుకున్న కాబోయే భర్త సామ్​ హిక్​మన్​.. పెళ్లిని ఆపేశాడు. రిలేషన్​ని దాదాపు కట్​ చేశాడు.

"పెళ్లి వాయిదా పడింది. కానీ ఆ పెళ్లి ఎప్పటికీ జరగకపోవచ్చు. సామ్​ చాలా బాధగా ఉన్నాడు. గుండె బద్దలైపోయింది. చాలా సిగ్గుపడుతున్నాడు. ఇవన్నీ అనుభవించాల్సిన అవసరం అతనికి లేదు. అందరు కోపంగా ఉన్నారు. సామ్​ ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఇంకా షాక్​లోనే ఉన్నాడు. ఆమె సామ్​ని చీట్​ చేయడమే కాదు.. ఒక చిన్న పిల్లాడిని కూడా మోసం చేసింది." అని సామ్​ హిక్​మన్​ స్నేహితుల్లో ఒకరు.. అమెరికాలోని ఓ ప్రముఖ వార్తా సంస్థతో చెప్పారు.

ఇలా.. టీచర్​, స్టూడెంట్​ సెక్స్​ చేస్తూ దొరికిపోవడం అమెరికాలో కొత్త విషయం ఏం కాదు! న్యూజెర్సీలో.. పెళ్లైన ఓ టీచర్​.. ఓ స్టూడెంట్​తో సెక్స్​ చేస్తూ దొరికిపోయింది. ఆమెను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆమెపై లైంగిక దాడి కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం