Hansika About Old relationship: ఓల్డ్ రిలేషన్‌పై ఓపెన్ అయిన హన్సిక.. లవ్ అఫైర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
Hansika About Old relationship: కోలీవుడ్ హీరోయిన్ హన్సిక మోత్వానీ తన ఓల్డ్ రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తన వివాహానికి సంబంధించిన డాక్యూసిరీస్ ట్రైలర్‌లో ఓల్డ్ రిలేషన్ గురించి ప్రస్తావించింది.
Hansika About Old relationship: ఇటీవల కాలంలో సెలబ్రెటీల వివాహలపై కూడా సినిమాల మాదిరిగా బజ్ ఏర్పడుతోంది. ఓటీటీల పుణ్యామాని ప్రముఖుల పెళ్లి విశేషాలను డాక్యూ సిరీస్‌ల రూపంలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. గతేడాది కోలీవుడ్ దంపతులు నయనతార-విఘ్నేశ్ శివన్ పెళ్లి కూడా ఇదే మాదిరిగా ఓటీటీలో ఎపిసోడ్‌ల రూపంలో విడుదలైంది. తాజాగా మరో సౌత్ హీరోయిన్ హన్సిక మోత్వానీ వివాహం కూడా అదే విధంగా స్ట్రీమింగ్ కానుంది. గత డిసెంబరు 4న తన బెస్ట్ ఫ్రెండ్ సోహైల్ కథురియాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
దీంతో వీరి వివాహాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ డాక్యూ సిరీస్‌ల రూపంలో విడుదల చేస్తోంది. తాజాగా ఈ ఎపిసోడ్ ట్రైలర్‌ను విడుదల చేసింది. లవ్ షాదీ ధర్మ పేరుతో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో హన్సిక తన పెళ్లి, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నట్లు తెలుస్తోంది. ఆశ్చర్యకరమైన విషయమేమంటే తన పాత రిలేషన్‌షిప్ గురించి కూడా ఇందులో ప్రస్తావించింది.
ఈ ట్రైలర్‌ను గమనిస్తే ప్రారంభంలోనే హన్సిక్ తన పాత రిలేషన్‌షిప్ గురించి మాట్లాడుతూ.. వ్యక్తిగత జీవితం పరంగా తాను మరోసారి పబ్లిక్ దృష్టిలో పడదలచుకోలేదని స్పష్టం చేసింది. అందుకే సోహైల్ కథురియాతో తన ప్రేమ, పెళ్లి విషయాన్ని చివరి వరకు సీక్రెట్‌గా ఉంచినట్లు పేర్కొంది.
హన్సిక.. తమిళ హీరో శింబుతో రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వీరిద్దరూ తమ ప్రేమను పెళ్లి వరకు కూడా తీసుకెళ్దామని అనుకున్నారని వార్తే అప్పట్లో సంచలనం రేపింది. కానీ వివాహం తర్వాత హన్సిక సినిమాల్లో నటించకూడదని శింబు కుటుంబం షరతు విధించడంతో ఆమె ఆ రిలేషన్‌షిప్ నుంచి వైదొలిగినట్లు సమాచారం. తాజాగా హన్సిక ఈ అంశంపై తన పెళ్లి డాక్యూసిరీస్ ఎపిసోడ్‌లో ప్రస్తావించడంతో శింబు ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో వేచి చూడాలని నెటిజన్లు తమ స్పందనను తెలియజేస్తున్నారు.
డిసెంబరు 4న హన్సిక తన బెస్ట్ ఫ్రెండ్ సోహైల్‌ను వివాహం చేసుకుంది. అతడు అంతకుముందే తన మరో స్నేహితురాలిని వివాహం చేసోకోగా.. అనంతరం వారు విడిపోయారు. అయితే ఈ ట్రైలర్‌లో సోహైల్ రిలేషన్ గురించి హన్సిక ఎలాంటి కామెంట్ చేసినట్లు చూపించలేదు. మరి పూర్తి ఎపిసోడ్‌లో ఏమైనా మాట్లాడిందో చూడాలి. ఎందుకంటే తనపై ఊహాగానాలు రాస్తున్నట్లు హన్సిక స్పష్టం చేసింది. "కొంతమంది యువకులు నా అతిపెద్ద సంతోషకరమైన క్షణాన్ని పాడుచేయాలని కోరుకున్నారు." లాంటి వ్యాఖ్యలను చేసింది.