Hansika wedding as Realty Show: రియాల్టీ షోగా వస్తున్న హన్సిక వెడ్డింగ్ వీడియో.. ఏ ఓటీటీలోనో తెలుసా?
Hansika wedding as Realty Show: రియాల్టీ షోగా వస్తోంది హన్సిక మోత్వానీ వెడ్డింగ్ వీడియో. ఈ విషయాన్ని హన్సికనే ఓ ఫన్నీ వీడియో ద్వారా బుధవారం (జనవరి 18) అనౌన్స్ చేయడం విశేషం.
Hansika wedding as Realty Show: సెలబ్రిటీల పెళ్లిళ్లు అభిమానుల్లో ఎంతలా ఆసక్తి రేపుతాయో మనకు తెలిసిందే కదా. వాళ్ల పెళ్లి విషయం బయటకు వచ్చినప్పటి నుంచీ ఆ తంతు మొత్తం ముగిసే వరకూ ఓ రేంజ్ హడావిడి ఉంటుంది. వాళ్ల పెళ్లి ఫొటోలు, వీడియోలకు అయితే విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దానిని క్యాష్ చేసుకోవడానికి కూడా ఈ సెలబ్రిటీలు ఎప్పుడూ ముందే ఉంటారు.
ఈ మధ్య కాలంలో ఇలాంటి పెళ్లిళ్ల వీడియోలు ఓటీటీల్లో రావడం ప్రారంభమైంది. గతేడాది ఇలాగే ఎంతగానో ఆసక్తి రేపిన నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లి స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఆ పెళ్లిని ఓ డాక్యుమెంటరీలాగా తీసుకొస్తున్నట్లు చెప్పింది. ఇక ఇప్పుడు మరో నటి హన్సిక మోత్వానీ పెళ్లి కూడా ఓటీటీలో స్ట్రీమ్ అవనుంది.
అయితే ఈసారి ఈ పెళ్లి రియాల్టీ షోలాగా రానుండటం విశేషం. ఈ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. త్వరలోనే హన్సిక పెళ్లి స్ట్రీమ్ కానున్నట్లు హాట్ స్టార్ ఓ ఫన్నీ వీడియో ద్వారా అనౌన్స్ చేసింది. ఈ వీడియోలో కొత్త పెళ్లి కూతురు హన్సికనే ఉండటం విశేషం. తన చేతికి ఉన్న రింగును చూపిస్తూ తనకు పెళ్లి జరిగిందని, దీనికి సంబంధించిన వీడియో మొత్తం హాట్ స్టార్ లో చూడొచ్చని చెప్పింది.
అయితే షో పేరు విషయంలోనే ఈ ఓటీటీ కాస్త డ్రామా క్రియేట్ చేసింది. ఈ షో పేరు లవ్ షాదీ డ్రామా. కానీ పేరులో డ్రామా ఏంటి అంటూ హన్సిక అంటుంది. అయితే కాస్త డ్రామా లేకుండా పెళ్లికి అర్థం ఏముంటుంది అంటూ హాట్ స్టార్ ఈ వీడియోను ట్విటర్ లో షేర్ చేసింది. గత నెలలో వ్యాపారవేత్త సోహైల్ కథూరియాను హన్సిక పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. హన్సిక పెళ్లి వీడియో స్ట్రీమింగ్ తేదీని త్వరలో అనౌన్స్ చేయనున్నారు.
సంబంధిత కథనం