Movies In Netflix : నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమాల సందడి-netflix south announced back to back telugu movies here s list ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Netflix South Announced Back To Back Telugu Movies Here's List

Movies In Netflix : నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమాల సందడి

HT Telugu Desk HT Telugu
Jan 16, 2023 05:29 PM IST

Telugu OTT Release Movies List In Netflix : నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమాల సందడి చేయనున్నాయి. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు రానున్నాయి. సుమారు 16 సినిమాలు ఈ ఓటీటీలోకి వస్తున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమాలు
నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమాలు (twitter)

కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. సినిమా ఇండస్ట్రీలోనూ పరిస్థితులు మారాయి. ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదల అయిన కొన్నిరోజులకు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా.. సినిమాలు కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నాయి. థియేటర్లకు వెళ్లే బదులుగా.. ఇంట్లోనే కూర్చొని చూసేందుకు ఆడియన్స్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఎంతో కొంత పెట్టి రిఛార్జ్ చేస్తే.. అయిపోతుందనే ఆలోచనలో ఉన్నారు.

ప్రేక్షకులకు తగ్గట్టుగా.. ఓటీటీలు కూడా సినిమాలు విడుదల చేస్తున్నాయి. థియేటర్లలో విడుదల చేసినట్టుగానే వారం వారం ఓటీటీలో విడుదల అవుతున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ.. నెట్‌ఫ్లిక్స్‌(Netflix) కూడా వరుసగా సినిమాలు విడుదల చేస్తోంది. అయితే అందులో ఇంగ్లీష్, హిందీ సినిమాలు ఎక్కువగా విడుదల అవుతాయి. తెలుగు ప్రేక్షుకులపైనా నెట్‌ఫ్లిక్స్‌ ఫోకస్ చేసింది. వరుస సినిమాలు లైనప్ లో పెట్టుకుంది.

తెలుగు ప్రేక్షుకులు నెట్‌ఫ్లిక్స్‌ను తక్కువగానే ఉపయోగిస్తుంటారు. అప్పుడప్పుడు మాత్రమే అందులో తెలుగు సినిమాలు విడుదల అవుతుంటాయి. నెట్‌ఫ్లిక్స్‌ ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యేందుకు నెట్‌ఫ్లిక్స్‌ వరుస సినిమాలను తీసుకొస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ 16 సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు ఆయా సినిమాల రైట్స్ దక్కించుకుంది.

1.అమిగోస్‌, 2.భోళా శంకర్‌, 3. సందీప్‌ కిషన్‌ బడ్డి, 4.దసరా, 5.ధమాకా, 6.బుట్ట బొమ్మ, 7.కార్తికేయ8, 8.వరుణ్‌ తేజ్‌ 12, 9.టిల్లు స్క్వేర్‌, 10.వైష్ణవ్‌ తేజ్ 4, 11.ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28, 12.విరూపాక్ష, 13.నాగశౌర్య 24, 14.మీటర్‌, 15.18పేజీస్‌, 16.అనుష్క, నవీన్‌ పొలిశెట్టి సినిమా.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.